AP Inter Exam Schedule: ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్ పరీక్షలకు షెడ్యూల్ రిలీజ్ అయింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి/మార్చి నెలలో జరిగే ఫస్ట్, సెకండ్ ఇయర్ ఇంటర్మిడీయట్ పరీక్షల టైం టేబుల్ ను బోర్డు ఆఫ్ ఇంటర్మిడియట్ ఎడ్యూకేషన్ కార్యదర్శి నారాయణ భరత్ గుప్తా విడుదల చేశారు. కాగా, ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు ఫిబ్రవరి 23వ తేదీన మొదలుకొని మార్చి 24వ తేదీ వరకూ వివిధ కోర్సులకు ఎగ్జామ్స్ నిర్వహించనున్నారు. అలాగే, ద్వీతీయ సంవత్సరం పరీక్షలు ఫిబ్రవరి 24న ప్రారంభమై మార్చి 23వ తేదీ వరకు జరగనున్నాయి.
Read Also: Stalin: కరూర్‌ను ఒకలా.. మణిపూర్‌ను మరొకలా చూస్తారా? బీజేపీపై సీఎం స్టాలిన్ ఆగ్రహం
ఇక, ఎథిక్స్ అండ్ హ్యూమన్ వ్యాల్యూస్ పరీక్షను జనవరి 21వ తేదీన ఉదయం 10 గంటలు నుంచి మధ్యాహ్నం 1 గంట వరకూ జరగనుంది. పర్యావరణ పరిరక్షణ పరీక్ష జనవరి 23వ తేదీన నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 1 నుంచి 10 వ తేదీ వరకూ జనరల్ కోర్సులకు ప్రాక్టికల్ పరీక్షలు పెట్టనున్నారు. జనవరి 27 నుంచి ఫిబ్రవరి 10 వరకూ ఒకేషనల్ కోర్సులకు, సమగ్ర శిక్షా ఓకేషనల్ ట్రేడ్ పరీక్ష ఫిబ్రవరి 13వ తేదీన నిర్వహించనున్నట్టు షెడ్యూల్ లో వెల్లడించింది. ఈ షెడ్యూల్ తాత్కాలికమని 2026 హలిడేస్ క్యాలెండర్ ఆధారంగా కొన్ని డేట్లు మారే అవకాశం ఉందన్నారు.