TS Inter Exams: ఇంటర్ విద్యార్థులు అలర్ట్.. పరీక్షల్లో కాపీ కొడితే క్రిమినల్ కేసు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TS Inter Exams: ఇంటర్ పరీక్షల్లో కాపీ కొడుతూ పట్టుబడినా.. వారిపై క్రిమినల్ కేసు నమోదు చేసే అవకాశాలున్నాయి. పరీక్షల్లో తప్పుడు విధానాలకు పూర్తిగా స్వస్తి పలుకుతూ తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. పరీక్షల్లో కాపీ కొట్టినా.. ఎవరైనా వచ్చి పరీక్ష రాసినా… మరేదైనా తప్పుడు విధానాలు అవలంబించినా… వారిపై క్రిమినల్ కేసు నమోదు చేస్తామన్నారు. అటువంటి అభ్యర్థులు పరీక్ష నుండి డిబార్ చేయబడతారు. అంతేకాదు ఆ సమయంలో బాధ్యతలు నిర్వహిస్తున్న అధికారులు లేదా యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇంటర్ పరీక్షలు ఈ నెల 28 నుంచి 19 వరకు జరగనున్నాయి. పై హెచ్చరిక ఈ పరీక్షలకు వర్తిస్తుంది.
Read also: Massive Road Accident: కాకినాడ హైవేపై ఘోర ప్రమాదం.. స్పాట్‌లోనే నలుగురు మృతి
Also Read
- HMWSSB: తాగునీటిని వృథా చేస్తే ఫైన్.. ఫిర్యాదు చేయడానికి వాట్సాప్ నంబర్ ఇదే..
- Kishan Reddy: కాంగ్రెస్, బీఆర్ఎస్కు హైకోర్టు తీర్పు చెంపపెట్టు.. కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు..
- Shamshabad: శంషాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇన్నోవా బోల్తా పడి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి
- Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
ఈసారి ఇంటర్ పరీక్షలకు 9,80,978 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. ప్రథమ సంవత్సరం విద్యార్థులు 4,78,718 మంది, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 5,02,260 మంది ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1,521 పరీక్షా కేంద్రాల్లో 12,559 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఇందులో మొదటి సంవత్సరం విద్యార్థులు 6,109 మంది, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 6,450 మంది విద్యార్థులు మొత్తం 30 కేంద్రాల్లో 20 ప్రభుత్వ, 10 ప్రైవేట్ కళాశాలల్లో పరీక్షలు రాయనున్నారు. పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతాయి. విద్యార్థులు 8.45 గంటలకు కేంద్రాలకు చేరుకోవాలి. కాలేజీ యాజమాన్యం బలవంతంగా ఫీజులు వసూలు చేయకుండా హాల్ టిక్కెట్లు ఇవ్వాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. కళాశాల ప్రిన్సిపాల్ సంతకం లేకుండానే పరీక్షలకు అనుమతిస్తారు.
Read also: Telangana Weather: కూల్ కూల్ గా వాతావరణం.. అక్కడక్కడ చిరు జల్లులు..
ఉదయం నుంచి ఆర్టీసీ బస్సులు
నిమిషం నిబంధన అమల్లో ఉన్నందున విద్యార్థులు త్వరగా పరీక్షా కేంద్రాలకు చేరుకునేలా ఉదయం 6 గంటల నుంచి ఆర్టీసీ బస్సులను అందుబాటులో ఉంచాలని కలెక్టర్ హనుమంతు కె.జెండాగే ఆర్టీసీ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పరీక్షలపై జిల్లా స్థాయిలో హైపవర్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి కలెక్టర్ కన్వీనర్‌గా ఉండగా, పరీక్షల నిర్వహణకు 30 మంది సెంటర్ ఇంచార్జిలు (సీఎస్), 70 మంది డిపార్ట్‌మెంట్ ఆఫీసర్లు (డీవో)లను నియమించారు. మూడు ఫ్లయింగ్ స్క్వాడ్, 2 సిట్టింగ్ స్క్వాడ్ బృందాలు సిద్ధంగా ఉన్నాయి. సీసీ కెమెరాల పర్యవేక్షణలో పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రశ్న పత్రాలు 11 స్టోరేజీ పాయింట్లలో భద్రపరచబడతాయి.
Read also: Trisha Krishnan: ముగ్గురు అన్నయ్యలకు ధన్యవాదాలు: త్రిష
సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి
విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రతి పరీక్షా కేంద్రంలో ప్రథమ చికిత్స అందించేందుకు ఒక ఏఎన్‌ఎంను నియమించి నిరంతర విద్యుత్ సరఫరా చేయనున్నారు. విద్యార్థులు సెల్‌ఫోన్లు తీసుకురావద్దని, ఒకవేళ తెచ్చుకుంటే మొబైల్ పాయింట్ సెంటర్ల వద్ద భద్రత కల్పించాలని అధికారులు తెలిపారు. పరీక్షా కేంద్రాల్లోకి ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించరు. కమిటీ సభ్యులతోపాటు ఇతర అధికారులు, ఇన్విజిలేటర్లు, సిబ్బంది సెల్‌ఫోన్లను లోపలికి తీసుకురాకూడదు. మాస్ కాపీయింగ్ చేస్తే ఎవరైనా దృష్టికి వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఇంటర్మీడియట్ నోడల్ ఆఫీసర్ రమణి హెచ్చరించారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని, జిరాక్స్ సెంటర్లను మూసివేయాలని డీసీపీ రాజేష్‌చంద్ర ఆదేశించారు.
Supreme Court: మహిళా కోస్ట్ గార్డ్ అధికారికి శాశ్వత కమిషన్‌పై నేడు సుప్రీంకోర్టులో విచారణ
తాజావార్తలు
-
Iran Hijab Law: ఇరాన్లో హిజాబ్ నిబంధనలకు సవాల్.. స్కార్ఫ్ లేకుండానే 10K రేసులో పాల్గొన్న మహిళలు
-
Baby Nakshatra: పెద్దపెద్ద డైలాగులు చూసి భయపడ్డా.. ఆ సన్నివేశం అంటే చాలా ఇష్టం!
-
Pakistan-Taliban Tensions: పాకిస్తాన్‌కు తాలిబాన్ వార్నింగ్.. ఆఫ్ఘన్‌లోకి అడుగుపెడితే తీవ్ర పరిణామాలే..
-
CPM Local Poll Strategy: స్థానిక ఎన్నికల్లో వారితో కలిసి పోటీ..! సీపీఎం కీలక ప్రకటన
-
HMWSSB: తాగునీటిని వృథా చేస్తే ఫైన్.. ఫిర్యాదు చేయడానికి వాట్సాప్ నంబర్ ఇదే..
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!