Intermediate Exams: 15 నుంచి ఇంటర్ పరీక్షలు.. అధికారులకు సీఎస్ ఆదేశాలు.. ఇవి ఉండాల్సిందే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Intermediate Exams: ఇంటర్ పరీక్షలకు సమయం దగ్గర పడింది.. ఆంధ్రప్రదేశ్‌లో ఈనెల 15వ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి.. ఏప్రిల్ 4వ తేదీ వరకు జరగనున్నాయి.. అయితే, ఇంటర్మీడియట్ పరీక్షలు సజావుగా జరిగేలా విస్తృతమైన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి.. అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలకు ఆదేశాలు జారీ చేశారు.. ఇంటర్ పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై విజయవాడలోని సీఎస్ క్యాంపు కార్యాలయం నుండి ఆయన జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, విద్యాశాఖ ఉన్నతాధికారులతో వీడియో కార్ఫరెన్స్ నిర్వహించారు.. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ వేసవి దృష్ట్యా అన్ని పరీక్షా కేంద్రాల్లో తాగునీరు అందుబాటులో ఉంచడంతో పాటు తగిన ఫస్ట్ ఎయిడ్ కిట్లతో వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచాలని స్పష్టం చేశారు. 20-25 పరీక్షా కేంద్రాలకు కలిపి ఒక 108 అంబులెన్స్ సేవలను కూడా అందుబాటులో ఉంచాలని చెప్పారు. ఆయా పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు సకాలంలో చేరుకునేందుకు వీలుగా ఆయా రూట్లలో తగినన్ని ఆర్టీసీ బస్సులు నడిపేందుకు ఆర్టీసీ అధికారులు చర్యలు తీసుకునేలా చూడాలని సూచించారు సీఎస్.
Read Also: Breast Cancer : రొమ్ము క్యాన్సర్ ప్రారంభ లక్షణాలను తెలుసుకోండి
Also Read
- Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. కాసేపట్లో రూ.300 దర్శనం టికెట్లు విడుదల..
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- AP Municipal Elections: మున్సిపల్ ఎన్నికల సీట్లపై కూటమి కసరత్తు.. చంద్రబాబు ముందు పవన్ కల్యాణ్ కీలక ప్రతిపాదనలు..!
- AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ సమావేశం.. కీలక నిర్ణయాలపై ఉత్కంఠ
ఇక, పరీక్షలు జరిగే సమయంలో ప్రశ్నాపత్రాలు లీకేజి లేదా మాల్ ప్రాక్టీస్ వంటి వదంతులు సృష్టించి విద్యార్థులను ఆందోళనలకు గురిచేసే ప్రయత్నాలు జరుగుతుంటాయి.. అలాంటివి జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించారు సీఎస్ జవహర్ రెడ్డి. జిల్లా, రాష్ట్ర స్థాయి కంట్రోల్ రూమ్‌ల ద్వారా నిరంతరం పర్యవేక్షణ చేయాలని స్పష్టం చేశారు. ఆయా పరీక్షా కేంద్రాల పరిధిలో పరీక్షలు జరిగే తేదీల్లో జిరాక్స్ కేంద్రాలు, ఫొటో కాపీయింగ్ కేంద్రాలను మూసి ఉంచేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.. అదే విధంగా పరీక్షల సమయంలో ఎటువంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా పోలీసు శాఖ అధికారులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేయాలని ఎస్పీలను ఆదేశించారు. అంతేకాకుండా తగినన్ని మొబైల్ పెట్రోలింగ్ బృందాలను ఏర్పాటు చేసి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్నారు.
ముఖ్యంగా పరీక్షలు జరిగే సమయంలో ఆయా పరీక్షా కేంద్రాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని విద్యుత్ శాఖ అధికారులను సీఎస్ జవహర్ రెడ్డి ఆదేశించారు. ఇందుకుగాను ప్రత్యేకంగా ఒక నోడలు అధికారిని నియమించి ఇంటర్మీడియట్ బోర్డు అధికారులతో సమన్వయం కలిగి ఉండేలా చూడాలన్నారు. ఇంటర్మీడియట్ పరీక్షల పటిష్ట నిర్వహణకు సంబంధిత శాఖల అధికారులతో జిల్లా స్థాయిలో కలెక్టర్, ఎస్పీల స్థాయిలో సమన్వయ సమావేశం నిర్వహించి తగిన చర్యలు తీసుకోవాలన్నారు.. కాగా, 15వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ పరీక్షలకు రాష్ట్రంలో మొత్తం 10 లక్షల 3వేల 674 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. వారిలో 4 లక్షల 84 వేల 12 మంది మొదటి సంవత్సరం పరీక్షలకు.. 5 లక్షల 19 వేల 662 మంది ద్వితీయ సంవత్సరం పరీక్షలు రాయనున్నారు.. ఇక, పరీక్షల నిర్వహణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 1,489 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు.. పరీక్షలు ఆయా తేదీల్లో ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతాయి.
తాజావార్తలు
-
Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. కాసేపట్లో రూ.300 దర్శనం టికెట్లు విడుదల..
-
Jailer 2 : జైలర్ 2 సెన్సార్ కంప్లిట్.. రన్ టైమ్ ఎంతంటే ?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!
-
Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
ట్రెండింగ్
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!
-
Pet Hair Cleaning Tips: సోఫా, బెడ్, కార్పెట్‌పై పెంపుడు కుక్క లేదా పిల్లి హెయిర్ పోవడం లేదా? ఈ ట్రిక్స్‌తో ఈజీగా తొలగించండి
-
144Hz AMOLED డిస్‌ప్లే, 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరా వ్యవస్థతో Vivo V80 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
10,000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ మన్నిక, AMOLED డిస్ప్లేతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ మొబైల్ vivo S2 FE లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే..!
-
Shreyas Iyer: నేను ఎక్కడ ఉన్నానో కూడా అర్థం కాలేదు.! కలలు నిజమయ్యాయి.. కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు.!