బంగాళాఖాతంలో ఏర్పడిన అసని తుఫాను ప్రభావం వల్ల ఆంధ్ర రాష్ట్రంలోని తీరప్రాంతం అలజడిగా మారింది. ఈ నేపథ్యంలోనే తుఫాను కారణంగా సముద్రం ఒడ్డుకు బంగారు వర్ణం కలిగిన ఓ రథం తీరానికి కొట్టుకొచ్చింది. సంతబొమ్మాళి సున్నాపల్లి సముద్రం రేవుకు ఇది కొట్టుకురావడం వల్ల.. దీన్ని వీక్షించేందుకు స్థానిక ప్రజలు ఎగబడ్డారు. ఇలాంటిది ఆ ప్రాంతంలో మునుపెన్నడూ చూడలేదని వాళ్ళు చెప్తున్నారు. బంగారు వర్ణంతో తళతళమని మెరిసిపోతున్న ఈ రథంపై 16-1-2022 అని విదేశీ భాషలో రాసి ఉంది.…