Kotamreddy Sridhar Reddy: నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారు.. ఎమ్మెల్యే కోటంరెడ్డి సంచలన వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kotamreddy Sridhar Reddy Says His Phone Was Tapped: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంటెలిజెన్స్ అధికారులు తన ఫోన్‌ని ట్యాప్ చేస్తున్నారని కుండబద్దలు కొట్టారు. తన మీద, తన కదలికల మీద నిఘా పెట్టారని బాంబ్ పేల్చారు. తన ఫోన్‌ని ట్యాప్ చేస్తున్న విషయం తనకు ముందే తెలుసని, అందుకే ఆ ఫోన్లో ఏం మాట్లాడాలో అదే మాట్లాడుతున్నానని అన్నారు. రహస్యాలు మాట్లాడుకునేందుకు తన వద్ద వేరే ఫోన్ ఉందని, చాలా సిమ్ కార్డులు కూడా ఉన్నాయని అన్నారు. చేతనైతే వీటిని కూడా ట్యాప్ చేయండని, అవసరమైతే ఇందుకోసం ఒక ప్రత్యేక అధికారిని కూడా నియమించుకోండని సవాల్ విసిరించారు. ఏం మాట్లాడాలో, ఏం చేయాలో తనకు బాగా తెలుసని పేర్కొన్నారు. క్రికెట్ బెట్టింగ్ కేసుల సమయంలో.. అప్పటి ఎస్పీ తన ఫోన్‌పై నిఘా ఉంచారన్నారు. ఈ సమాచారం తనకు తెలియడంతో.. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా మాట్లాడేవాడినని తెలిపారు. ఫేస్ టైమర్, టెలిగ్రాం కాల్స్‌ని పెగాసస్ రికార్డు చేయలేదన్నారు. 30 ఏళ్ల నుంచి తాను రాజకీయాల్లో ఉన్నానని, ఎప్పుడెలా ప్రవర్తించాలో తనకు బాగా తెలుసని వ్యాఖ్యానించారు. అయినా.. అధికార పార్టీ ఎమ్మెల్యేపై ముగ్గురు అధికారులతో నిఘా అవసరమా? అని కోటంరెడ్డి ప్రశ్నించారు.
Ariyana Glory: కుండ పట్టుకుని కుర్రాళ్ల కొంపముంచుతున్న అరియానా..
Also Read
- Local Body Elections: ‘జయహో బీసీ’ నినాదంతో స్థానిక సమరానికి టీడీపీ.. సీఎం కీలక ప్రకటన..
- Pawan Kalyan: అడవి తల్లి బాట 2.0 కార్యక్రమం ప్రారంభం.. స్థానిక ఎన్నికల్లో కూటమి సత్తా చాటాలి.!
- Chiranjeevi: వయసు ఒక నంబర్ మాత్రమే..! ప్రేమ, అభిమానమే నాకు ఎనర్జీ..
- BC Reservations: సర్కార్ కీలక ఉత్తర్వులు.. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లకు గ్రీన్ సిగ్నల్..!
అంతకుముందు.. నెల్లూరు జిల్లాలోని రాజకీయాలపై కోటంరెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తాను రాజకీయ వారసత్వంతో ఎదగలేదని, స్వతహాగా పోరాటాలతో ఈ స్థాయికి వచ్చానని అన్నారు. తనను రాజకీయంగా ఎదగనీయకుండా జిల్లాలోని పెద్ద రాజకీయ కుటుంబాలు అడ్డుకున్నాయని ఆరోపణలు చేశారు. తనకు రాజకీయంగా అవకాశాలు వచ్చినా.. ఆ పెద్ద కుటుంబాలు అనేకసార్లు తన గొంతును కోశాయని ఆవేదన వ్యక్తం చేశారు. పదవులన్నీ వాళ్లే అనుభవిస్తున్నారని.. ఇకపై ఈ ధోరణి కొనసాగనివ్వబోమన్నారు. తాను రాజకీయాల్లో ఖరాఖండిగా ఉంటానని.. తాను సామాన్యుడిగా జెండా మోసి ఈ స్థాయికి వచ్చానని.. తాను రాజకీయ కుటుంబం నుంచి రాలేదన్నారు. తనవాళ్ల కోసం ఎవరితోనైనా ఢీకొట్టేందుకు సిద్ధంగా ఉన్నానని ఛాలెంజ్ చేశారు. ప్రజా సమస్యల కోసం తాను జైలుకు కూడా వెళ్లిన సందర్భాలు ఉన్నాయని కూడా పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Maharashtra: పెళ్లి నిశ్చయం.. ప్రియురాలిని లోయలోకి తోసిచంపిన ప్రియుడు..
-
Drug Network Busted : గోవా–హైదరాబాద్ డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు.. ప్రధాన సూత్రధారి క్రిస్టీ అరెస్ట్
-
Kapil Sibal: కపిల్ సిబల్ అసంతృప్తిపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
-
Ranabali: డబ్బింగ్ చిక్కుల్లో రణబాలి.. ఓవర్సీస్ రిలీజ్‌పై సడెన్ ట్విస్ట్!
-
Local Body Elections: ‘జయహో బీసీ’ నినాదంతో స్థానిక సమరానికి టీడీపీ.. సీఎం కీలక ప్రకటన..
ట్రెండింగ్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!