ఓ వైపు సముద్రం.. ఇంకోవైపు భారతమాత సైనికుల బలం తనతో ఉందని ప్రధాని మోడీ అన్నారు. గోవాలోని కార్వార్ తీరంలో ఐఎన్ఎస్ విక్రాంత్ దగ్గర సాయుధ దళాల సిబ్బందితో కలిసి మోడీ దీపావళి వేడుకలు జరుపుకున్నారు. ఆపరేషన్ సిందూర్ గుర్తుగా ఈ ఏడాది దీపావళి వేడుకలు నౌకాదళంతో జరుపుకున్నారు.
Indian Naval Power: భారత దేశం తన అజేయమైన శక్తిసామర్థ్యాలను ఆపరేషన్ సింధూర్‌తో ప్రపంచానికి చాటిచెప్పింది. భారత నావికాదళం క్రమంగా హిందూ మహాసముద్రంలో సూపర్ పవర్‌గా మారుతోంది. మే నెలలో పాకిస్థాన్‌పై ఆపరేషన్ సింధూర్ సందర్భంగా ఈ విషయాన్ని ప్రపంచానికి రుజువు చేసింది. ఇరుదేశాల మధ్య వివాదం ప్రారంభమైన తర్వాత, పాక్ నావికాదళాన్ని దాని స్వంత భూభాగంలోనే 15 మిగ్-29కె విమానాలతో చుట్టుముట్టినట్లు భారత వైస్ అడ్మిరల్ తాజాగా వెల్లడించారు. READ ALSO: Prabhas : వార్-2ను…
పాకిస్థాన్ దుశ్చర్య తర్వాత భారత నావికాదళం రంగంలోకి దిగింది. అరేబియా సముద్రంలో మోహరించిన INS విక్రాంత్ యుద్ధ బరిలోకి దిగింది. పాకిస్థాన్‌లో ప్రధాన నగరమైన కరాచీని లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తూ.. విధ్వంసం సృష్టిస్తోంది. ఈ దాడి అనంతరం కరాచీ ఓడరేవులో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ భీకర దాడిలో కరాచీ నౌకాశ్రయం విధ్వంసమైనట్లు తెలుస్తోంది. ఓడరేవుతో పాటు కరాచీ నగరంలోని పలు చోట్ల భారీగా మంటలు ఎగిసి పడుతున్నాయి. దీంతో పాకిస్థాన్ భయాందోళనల్లో మునిగి పోయింది.…
VIzag: ప్రస్తుత దేశ పరిస్థితుల్లో అత్యవసర సమయాలను ఎదుర్కొనేందుకు తూర్పు నావికాదళం (Eastern Naval Command) పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉందని అర్థమవుతుంది. పరిస్థితి ఏదైనా ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉండాలని సన్ రైజ్ ఫ్లీట్‌కు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం. ఈ నేపధ్యంలో తూర్పు నావికాదళాధిపతి (ENC Chief) వైస్ అడ్మిరల్ పెందార్కర్ పరిస్థితిని సమీక్షించారు. సముద్ర మార్గంలో పెరుగుతున్న టెన్షన్‌ను దృష్టిలో పెట్టుకుని తగిన అప్రమత్తత తీసుకోవాలని సమీక్ష సమావేశంలో ఆయన సూచించారు. అత్యవసర పరిస్థితుల…
Indian Navy Day : భారత నౌకాదళం యొక్క ధైర్యం, శక్తి , అంకితభావానికి వందనం చేయడానికి ప్రతి సంవత్సరం డిసెంబర్ 4 న ఇండియన్ నేవీ డే జరుపుకుంటారు. 1971లో భారత్-పాకిస్థాన్ యుద్ధ సమయంలో భారత నావికాదళం కూడా అలుపెరగని ధైర్యాన్ని ప్రదర్శించింది. ఈ దినోత్సవాన్ని జరుపుకోవాలని 1972లో ఒక సీనియర్ నావికాదళ అధికారుల సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు, దీని ప్రయత్నాలను గుర్తించడం , దాని విజయాలను జరుపుకోవడం. ఈ సందర్భంగా భారత్, చైనా, అమెరికా…
1971లో, ఇండో-పాక్ యుద్ధం ప్రారంభమైనప్పుడు, భారత నావికాదళం ఆపరేషన్ ట్రైడెంట్ ద్వారా పాకిస్తాన్ సైన్యాన్ని ఓడించడంలో విజయం సాధించింది. ఈ ఆపరేషన్ ప్రారంభమైన రోజు జ్ఞాపకార్థం , వివిధ ఆపరేషన్లలో ధైర్యంగా మరణించిన జవాన్లను స్మరించుకోవడానికి ప్రతి సంవత్సరం డిసెంబర్ 4వ తేదీన ఇండియన్ నేవీ డే జరుపుకుంటారు. కాబట్టి ఈ రోజు చరిత్ర , ప్రాముఖ్యతతో సహా పూర్తి సమాచారం ఇక్కడ ఉంది.
భారత మొట్టమొదటి స్వదేశీ విమాన వాహక నౌక ఐఎన్‌ఎస్ విక్రాంత్‌ను భారత పర్యటనలో ఉన్న ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోని అల్బనీస్ సందర్శించారు. ఆంథోనీ అల్బనీస్ ఈరోజు క్యారియర్‌లో గార్డ్ ఆఫ్ హానర్‌ను అందుకున్నారు.
భారత్‌కు చెందిన మొట్టమొదటి విమాన వాహక నౌక ఓ చారిత్రక మైలురాయిని దాటింది. ఐఎన్‌ఎస్ విక్రాంత్‌పై తొలిసారి ఓ నౌకాదళ స్వదేశీ యుద్ధ విమానం ల్యాండ్ అయింది.
రక్షణ రంగంలో ఎన్నో ఘనతలు సాధించి ప్రపంచం దృష్టిని ఆకర్షించిన భారత్.. ఇవాళ మరో మైలురాయిని అందుకుంది. పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో, భారతీయుల శ్రమ, మేధస్సుతో రూపుదిద్దుకున్న తొలి విమాన వాహక నౌక ఐఎన్‌ఎస్ విక్రాంత్‌ను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు.