భారత్ పూర్తిగా దేశీయంగా నిర్మించిన తొలి విమాన వాహక నౌక ఐఎన్‌ఎస్ విక్రాంత్‌ను ప్రధాని నరేంద్ర మోదీ నౌకాదళంలోకి ప్రవేశపెట్టారు. ఈ కార్యక్రమం కొచ్చిన్ షిప్‌యార్డ్‌లో జరిగింది. భారత్ ఇప్పటివరకు నిర్మించిన అతిపెద్ద నౌక కూడా ఇదే కావడం విశేషం.
రక్షణ రంగంలో భారత శక్తి సామర్థ్యాలను ప్రపంచానికి చాటే రానే వచ్చింది. ఇప్పటిదాకా భారత్ వద్ద ఉన్న నౌకలన్నీ విదేశాలను నుంచి దిగుమతి చేసుకున్నవే కాగా.. ఇప్పుడు అగ్రదేశాలే ఆశ్చర్యపోయేలా అత్యాధునిక విమానవాహక యుద్ధనౌక ఐఎన్‌ఎస్ విక్రాంత్‌ను పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో భారత్ నిర్మించింది.
భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ విమాన వాహక నౌక 'విక్రాంత్' నౌకాదళానికి అప్పగించబడింది. విస్తృతమైన వినియోగదారు అంగీకార ట్రయల్స్ తర్వాత కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్(సీఎస్ఎల్) 'విక్రాంత్'ను భారత నావికాదళానికి అప్పగించింది. స్వదేశీ విమాన వాహక నౌక 'విక్రాంత్'ను నిర్మించిన కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్.. ఇవాళ భారత నౌకాదళానికి అప్పగించి చరిత్రను సృష్టించింది.