VIzag: ప్రస్తుత దేశ పరిస్థితుల్లో అత్యవసర సమయాలను ఎదుర్కొనేందుకు తూర్పు నావికాదళం (Eastern Naval Command) పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉందని అర్థమవుతుంది. పరిస్థితి ఏదైనా ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉండాలని సన్ రైజ్ ఫ్లీట్‌కు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం. ఈ నేపధ్యంలో తూర్పు నావికాదళాధిపతి (ENC Chief) వైస్ అడ్మిరల్ పెందార్కర్ పరిస్థితిని సమీక్షించారు. సముద్ర మార్గంలో పెరుగుతున్న టెన్షన్‌ను దృష్టిలో పెట్టుకుని తగిన అప్రమత్తత తీసుకోవాలని సమీక్ష సమావేశంలో ఆయన సూచించారు. అత్యవసర పరిస్థితుల నేపథ్యంలో యుద్ధ నౌకలు, సబ్ మెరైన్లలో పనిచేస్తున్న సిబ్బందికి ఇప్పటికీ ఇచ్చిన సెలవులను రద్దు చేసే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. సముద్ర తీర ప్రాంతంలో బలగాల కదలికలపై ENC కట్టుదిట్టమైన దృష్టి పెట్టారు.
ఇందులో భాగంగా అరేబియా సముద్రంలో భారత నౌకాదళం అత్యాధునిక ఎయిర్ క్రాఫ్ట్ కారియర్ ఐఎన్ఎస్ విక్రాంత్ మోహరించడంపై ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ చర్యలన్నీ నౌకాదళం తక్షణ స్పందన సామర్థ్యాన్ని పెంచేందుకు చేస్తున్న భాగంగా అర్థమవుతుంది. తూర్పు తీర ప్రాంతంపై కేంద్రం, రక్షణ శాఖ ప్రత్యేక దృష్టి సారించిన నేపథ్యంలో ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి.