బీసీసీఐ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం. ఐదేళ్ల ముందు వరకు ఉన్న రూల్స్ మళ్లీ తీసుకురావాలనే ఆలోచనలో బీసీసీఐ ఉన్నట్లు సమాచారం. 45 రోజుల విదేశీ టూర్ కు టీమ్ వెళ్లినప్పుడు.. ప్లేయర్స్ కుటుంబ సభ్యులతో ఉండేందుకు కేవలం రెండు వారాలు మాత్రమే అనుమతించాలని నిర్ణయించుకున్నట్లు క్రికెట్ వర్గాలు వెల్లడించాయి.
IPL Mega Auction Unsold Players: ఎన్నో సంచనాలను క్రియేట్ చేస్తూ ఐపీఎల్ 2025 మెగా వేలం కొనసాగింది. అంచనాలకు మించి కొందరు కోట్లలో అమ్ముడుపోగా.. మరికొందరేమో పేరుకే టాప్ ప్లేయర్స్ అయినా వారిని కొనడానికి ఐపీఎల్ ఫ్రాంఛైజీలు ఇష్టపడలేదు. ఇకపోతే, మెగా వేలం మొదటిరోజు ఫ్రాంఛైజీలు అగ్రశ్రేణి ఆటగాళ్ల కోసం భారీగా ఖర్చుపెట్టిన.. రెండో రోజు మాత్రం కాస్త ఆచితూచి వ్యవహరించాయి. ఈ నేపథ్యంలో రెండోరోజు ముఖ్యంగా భారత పేసర్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. మొత్తంగా…
మహిళల టీ20 ప్రపంచకప్ 2024 అక్టోబరు 3 నుంచి 20 వరకు యూఏఈ వేదికగా జరగనుంది. మొత్తం 10 జట్లను రెండు గ్రూప్‌లుగా విభజించారు. భారత్ అక్టోబర్ 4న న్యూజిలాండ్‌తో తొలి మ్యాచ్ ఆడనుంది. చిరకాల ప్రత్యర్థులు భారత్, పాక్ మ్యాచ్ అక్టోబర్ 6న జరగనుంది. ఇక 9న శ్రీలంక, 13న ఆస్ట్రేలియాతో తలపడనుంది. భారత మహిళల జట్టు ప్రస్తుతం బెంగళూరులోని ఏన్సీఏలో ప్రాక్టీస్ చేస్తోంది. టైటిల్ లక్ష్యంగా టీమిండియా బరిలోకి దిగుతోంది. అయితే భారత జట్టును…
IND vs BAN Test Series: సెప్టెంబర్ 19 నుంచి భారత క్రికెట్ జట్టు, బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు మధ్య 2 మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్ కోసం భారత జట్టు ఆటగాళ్లు చెన్నై చేరుకున్నారు. తొలి టెస్టు చెన్నై వేదికగా చిదంబరం స్టేడియంలో జరగనుంది. చెన్నై చేరుకోగానే ఆటగాళ్లకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా వీడియోలో కనిపిస్తున్నారు. చాలా కాలం…
పారిస్ ఒలింపిక్స్లో ఈరోజు (మంగళవారం) భారత్ను మరో పతకం వరించింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ ఈవెంట్‌లో మను, సరబ్‌జోత్‌లు కాంస్య పతకాన్ని గెలిచి.. భారత్‌కు రెండో పతకాన్ని అందించారు. అంతకుముందు మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో మను బాకర్ కాంస్యం సాధించిన సంగతి తెలిసిందే.. మహిళల వ్యక్తిగత ఆర్చరీ రౌండ్ ఆఫ్ 16 ప్రీక్వార్టర్స్‌కు చేరుకుంది. భజన్ కౌర్ 7-3తో ఇండోనేషియాకు చెందిన సైఫాను ఓడించింది.
ఢిల్లీ నుంచి ముంబై వస్తున్న భారత ఆటగాళ్లకు ఊహించని ట్విస్ట్ నెలకొంది. ఢిల్లీ నుంచి ముంబైకి భారత ఆటగాళ్లు వచ్చే విమానానికి విస్తార ఎయిర్లైన్స్ UK 1845 నెంబర్ ను కేటాయించింది.
టీ20 ప్రపంచ కప్ 2024 కోసం కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. జూన్ 2 నుంచి వెస్టిండీస్, అమెరికా గడ్డపై మెగా టోర్నీ ప్రారంభం కానుంది. కాగా.. మెగా టోర్నీకి భారత జట్టును ప్రకటించగా, అనుభవజ్ఞులైన ఆటగాళ్లపై సెలక్టర్లు మరింత విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. కాగా.. కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, రింకూ సింగ్ వంటి పేర్లు ప్రధాన జట్టులో చోటు దక్కించుకోలేకపోయారు. అయితే, అగార్కర్ నేతృత్వంలో సెలెక్టర్లు అత్యుత్తమ 15 మంది ఆటగాళ్లను ఎంపిక చేశామని బీసీసీఐ సెక్రటరీ…
రేపటి నుంచి చైనాలోని జాంఘులో జరగనున్న 19వ ఆసియా క్రీడల్లో అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన ముగ్గురు ఆటగాళ్లకు అనుమతి చైనా అనుమతి నిరాకరించింది. ఈ చర్యపై భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలోని చైనా ఎంబసీ, బీజింగ్‌లోని భారత రాయబార కార్యాలయం ద్వారా తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. దీంతో ఆసియా క్రీడల్లో పాల్గొనేందుకు భారత కేంద్ర క్రీడలు, యువజన సంక్షేమ శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ చైనా పర్యటనను రద్దు చేసుకున్నారు.
పోర్ట్స్ మౌత్‌లోని అరుండెల్ మైదానంలో టీమిండియా ఆటగాళ్లు నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నారు. నెట్ ప్రాక్టీస్‌లో బ్యాటింగ్, బౌలింగ్‌పైనే కాకుండా ఫీల్డింగ్‌పై కూడా రోహిత్ సేన నజర్ పెట్టింది. ఈ క్రమంలో రంగు రంగుల రబ్బరు బంతులతో భారత జట్టు క్యాచింగ్ ప్రాక్టీస్ చేస్తోంది.