మరో మూడు రోజుల్లో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌కు ఫైనల్ ప్రారంభం కానుంది. జూన్ 7 నుంచి లండన్ లోని ఓవల్ స్టేడియం వేదికగా జరగనున్న ఈ తుది పోరులో భారత్-ఆస్ట్రేలియా జట్లు తాడోపేడో తెల్చుకోవడానికి సిద్దమయ్యాయి. ఇప్పటికే ఇంగ్లండ్ గడ్డపై అడుగుపెట్టిన భారత జట్టు.. అక్కడి పరిస్థితులకు అలవాటు పడేందుకు ప్రయత్నం చేస్తోంది.
Also Read: Chandrababu: నేడు ప్రధాని మోదీతో చంద్రబాబు కీలక భేటీ.. ఏపీ రాజకీయాల్లో సర్వత్రా ఆసక్తి!
పోర్ట్స్ మౌత్‌లోని అరుండెల్ మైదానంలో టీమిండియా ఆటగాళ్లు నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నారు. నెట్ ప్రాక్టీస్‌లో బ్యాటింగ్, బౌలింగ్‌పైనే కాకుండా ఫీల్డింగ్‌పై కూడా రోహిత్ సేన నజర్ పెట్టింది. ఈ క్రమంలో రంగు రంగుల రబ్బరు బంతులతో భారత జట్టు క్యాచింగ్ ప్రాక్టీస్ చేస్తోంది. ఇంగ్లండ్ లాంటి స్వింగింగ్ పరిస్థితుల్లో చివరి నిమిషాల్లో బాల్ గమనంలో మార్పునకు టీమిండియా ప్లేయర్స్ అలవాటు పడేందుకు ఈ ప్రత్యేక బాల్స్ ను వాడుతున్నారు. ఈ నేపథ్యంలో శుభ్‌మన్ గిల్ ఆకుపచ్చ బంతితో క్యాచ్ ప్రాక్టీస్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Also Read: Narasimha Naidu: అక్కడ అఖండ ఫీట్ రిపీట్ అవుతుందా?
ఈ బాల్స్ ను మనం గల్లీ క్రికెట్‌లో చూసేవి కావు.. ఇవి స్పెషల్ గా తయారు చేయబడిన రబ్బరు బంతులు.. ఇవి ఫీల్డింగ్ డ్రిల్స్ కోసం తయారు చేస్తారు. వీటిని ‘రియాక్షన్ బాల్స్’ అంటారు.. వీటిని కొన్ని దేశాల పరిస్థితులను బట్టి మాత్రమే ఉపయోగిస్తారు.. ఎక్కువగా గాలి, చల్లని వాతావరణ పరిస్థితులు ఉండే ఇంగ్లండ్ లేదా న్యూజిలాండ్‌లో వీటిని ఫీల్డింగ్ ప్రాక్టీస్ కోసం ఉపయెగిస్తారు అని ఏన్సీఏలో పనిచేసిన ప్రముఖ ఫీల్డింగ్ కోచ్ ఒకరు వెల్లడించారు.