INS Satpura, Indian Warship's Historic US Visit: భారత యుద్దనౌక ఐఎన్ఎస్ సాత్పురా అమెరికా పర్యటనలో చరిత్ర సృష్టించింది. ఓ భారత యుద్ధ నౌక అమెరికా పశ్చిమ తీరాన్ని చేరుకోవడం ఇదే మొదటిసారి. ఈ రికార్డును ఐఎన్ఎస్ సాత్పురా సొంతం చేసుకుంది. ఇండియాకు స్వాతంత్య్ర వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంలో ఐఎన్ఎస్ సాత్పురా ఈ చారిత్రాత్మక పర్యటన చేస్తోంది. అమెరికా పశ్చిమ తీరం కాలిఫోర్నియా లోని శాన్ డియాగోకు చేరుకుంది.
Salman Khan in Vishakapatnam: బాలీవుడ్ కండల వీరుడు, సీనియర్ హీరో సల్మాన్ ఖాన్ విశాఖలో సందడి చేశాడు. ఓ సినిమా షూటింగ్‌లో భాగంగా విశాఖకు వచ్చిన హీరో సల్మాన్ ఖాన్.. షూటింగ్ విరామ సమయంలో నేవీ సిబ్బందితో కలిసి ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల్లో పాల్గొన్నాడు. ఇండియన్ నేవీ తూర్పు కమాండ్ స్థావరమైన విశాఖపట్నంలోని నేవీ సిబ్బందితో సల్మాన్ ఖాన్ డ్యాన్సులు వేశాడు. అనంతరం నేవీ సిబ్బందితో కలిసి కిచెన్‌లో వంట చేశాడు. అంతేకాకుండా…
Indian Navy All Women Team Completes Surveillance Mission: భారత నారీ శక్తి ఎందులో తీసిపోదని మరోసారి నిరూపితం అయింది. ఇండియన్ నేవీకి చెందిన మహిళా బృందం తాజాగా రికార్డ్ సృష్టించింది. ఐదుగురు సభ్యులతో కూడిన మహిళా బృందం ఉత్తర అరేబియా సముద్రంలో నిఘా మిషన్ ను పూర్తి చేసి చరిత్ర సృష్టించింది. బుధవారం అత్యాధునిక డోర్నియర్ 228 విమానంలో ఉత్తర అరేబియా సముద్రంలో సముద్ర నిఘాను పూర్తి చేసింది. ఈ మిషన్ ద్వారా నారీ…
భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ విమాన వాహక నౌక 'విక్రాంత్' నౌకాదళానికి అప్పగించబడింది. విస్తృతమైన వినియోగదారు అంగీకార ట్రయల్స్ తర్వాత కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్(సీఎస్ఎల్) 'విక్రాంత్'ను భారత నావికాదళానికి అప్పగించింది. స్వదేశీ విమాన వాహక నౌక 'విక్రాంత్'ను నిర్మించిన కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్.. ఇవాళ భారత నౌకాదళానికి అప్పగించి చరిత్రను సృష్టించింది.
భారత అమ్ములపొదిలో మరో క్షిపణి చేరింది. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీవో) శుక్రవారం రోజు ఒడిశాలోని చాందీపూర్ తీరంలో ‘‘వీఎల్-ఎస్ఆర్ఎస్ఏఎం’’ క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. వర్టికల్ లాంచ్ షార్ట్ రేంజ్ సర్ఫేస్ టూ ఎయిర్ మిస్సైల్ ( వీఎల్-ఎస్ఆర్ఎస్ఏఎం) క్షిపణిని డీఆర్డీవో డెవలప్ చేసింది. ఇండియన్ నేవీతో కలిసి ఈ రోజు పరీక్షించారు. అత్యంత ఖచ్చితత్వంతో క్షిపణి లక్ష్యాన్ని చేరుకుంది. ఈ క్షిపణిని యుద్ధ నౌకల నుంచి ప్రయోగించవచ్చు. ఆకాశం నుంచి వచ్చే శత్రు…
గురువారం నిర్వహించిన బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్షిపణి ప్రయోగం విజయవంతమైందని రక్షణ శాఖ తెలిపింది. సముద్రంలో ఉన్న ఓడలు, పడవలు వంటి లక్ష్యాలను ఛేదించేందుకు ప్రత్యేకంగా తయారుచేసిన యాంటీషిప్ వెర్షన్ బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్షిపణి పరీక్ష విజయవంతమైనట్లు ఇండియన్ నేవీ, అండమాన్ నికోబార్ కమాండ్ వెల్లడించాయి. బ్రహ్మోస్ క్షిపణి అత్యంత కచ్చితత్వంతో నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించినట్లు తెలిపాయి. ఈ ప్రయోగాన్ని ఇండియన్ నేవీ, అండమాన్ నికోబార్ కమాండ్ సంయుక్తంగా నిర్వహించాయి. ఈ నెల 19న భారత…
తూర్పు నావికాదళం నిర్వహిస్తున్న ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూ కి అంతా రెడీ అయింది. సోమవారం ఉదయం 9 గంటలకు రివ్యూ ప్రారంభం కానుంది. ఈ సమీక్షలో పాల్గొనేందుకు భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆదివారం సాయంత్రమే విశాఖ వచ్చారు. ఆయనకు ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సీఎం జగన్ పుష్పగుచ్ఛాలు ఇచ్చి సాదరంగా స్వాగతం పలికారు. రాష్ట్రపతికి సీఎం జగన్ ప్రత్యేకంగా జ్ఞాపికను బహూకరించారు. 9కి ప్రారంభం కానున్న ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూ 9.07 కి…
సాగరతీరం విశాఖ అద్భుత కార్యక్రమానికి వేదికైంది. దేశ ప్రథమ పౌరుడు భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ మరికాసేపట్లో విశాఖలో యుద్ధ నౌకల సమీక్ష నిర్వహించనున్నారు. వివిధ దేశాల నావికా దళ విన్యాసాలు అందరినీ కనువిందుచేయనున్నాయి. ప్రెసిడెంట్ ఫ్లీట్ లో ప్రత్యేక ఆకర్షణగా యుద్ద నౌక ఐ.ఎన్.ఎస్. విశాఖపట్నం, జలాంతర్గామి ఐ.ఎన్.ఎస్. వేల నిలవనున్నాయి. మొదటి సారి విశాఖపట్నం పేరును యుద్ధ నౌకకు పెట్టింది ఇండియన్ నేవీ. దీంతో సాగరతీరం పేరు దేశవిదేశాల్లో మారుమోగనుంది. మూడు నెలల…
కేంద్ర బడ్జెట్ 2022-2023లో రక్షణ రంగానికి భారీగా నిధులను కేటాయించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో సైనికదళాల అవసరాల కోసం కేంద్రం 5.25 లక్షల కోట్ల రూపాయల నిధులను కేటాయించింది. మూలధన కేటాయింపులను 12.82 శాతంగా పెంచి రూ. 1.52 లక్షల కోట్లు కేటాయించారు. అయితే, ఈసారి వాయుసేన, ఆర్మీకంటే నేవీకి అధికంగా నిధులను కేటాయించారు. గతేడాది కంటే ఈసారి నేవీకి 43 శాతం మేర నిధులు పెరిగాయి. వాయుసేనకు 4.5 శాతం కేటాయింపుల్లో పెరుగుదల కనిపించగా, ఆర్మీకి…