ఐఎన్ఎస్ ఖుక్రీ… దేశంలో తయారైన మొదటి క్షిపణి సామర్థ్యమున్న యుద్ధనౌక. 1989 లో మజ్‌గావ్ డాక్‌లో తయారైంది. 1971 వ సంవత్సరంలో పాక్‌తో జరిగిన యుద్ధం సమయంలో అప్పటి ఖుక్రీ యుద్ధనౌకను అరేబియా సముద్రంలో పాక్ సైనికులు కూల్చివేశారు. ఆ తరువాత భారత్ కరాచీ రేవు పట్టణంపై బాంబుల వర్షం కురిపించి రేవును స్వాధీనం చేసుకోవడంతో పాక్ ఓటమిని అంగీకరించింది. అప్పటి ఖుక్రీ నౌక అందించిన సేవలకు గుర్తుగా దేశంలో తయారైన తొలి క్షిపణి యుద్ధనౌకకు ఐఎన్ఎస్…
నావికాదళానికి 25వ చీఫ్ (సీఎన్‌ఎస్) గా అడ్మిరల్ ఆర్. హరికుమార్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. 41సంవత్సరాల పాటు విధి నిర్వహణ సాగించి పదవీ విరమణ చేసిన చీఫ్ అడ్మిరల్ కరంబీర్ సింగ్ నుండి ఆయన బాధ్యతలు తీసుకున్నారు. వెస్ట్రన్ నావల్ కమాండ్‌లో ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్‌గా పనిచేసిన హరికుమార్ ఈ నెల 9న కొత్త సీఎన్‌ఎస్‌గా నియమితులయ్యారు. 130 నౌకలు కలిగిన భారత నావికాదళం ప్రస్తుతం పలు ప్రధానమైన ఆధునీకరణ ప్రణాళికలను చేపట్టే క్రమంలో…
ఇండియా, యునైటెడ్ స్టేట్స్ నుంచి 30 ప్రిడేటర్ డ్రోన్‌లను కొనుగోలు చేయడానికి సంబంధించిన ఒప్పందం పై నేడు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. వీటి ధర సుమారు రూ. 21,000 కోట్లుగా అంచనా వేస్తున్నారు. దీనిపై చర్చించేందుకు రక్షణ మంత్రిత్వ శాఖ సోమవారం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించనుంది. సీనియర్ అధికారులు పాల్గొనే సమావేశానికి రక్షణ కార్యదర్శి అధ్యక్షత వహి స్తారని రక్షణ మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు తెలిపారు. ఈ సమా వేశంలో వీటి కొనుగోలుకు ఆమోదం పొందినట్లయితే,…