DRDO: డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO), ఇండియన్ నేవీ ఇవాళ ఒడిశా తీరంలోని ఛాందిపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ITR) నుంచి వర్టికల్ లాంచ్ షార్ట్ రేంజ్ సర్ఫేస్-టు-ఎయిర్ మిస్సైల్ (VL-SRSAM) ను విజయవంతంగా పరీక్షించాయి. వర్టికల్ లాంచ్ మిస్సైల్ సామర్థ్యాన్ని పరీక్షించారు. భారత నౌక నుంచి హై-స్పీడ్ మానవరహిత విమానాన్ని ఈ క్షిపణి విజయవంతంగా ఛేదించింది.
Movies Shooting: గుడ్‌న్యూస్.. ఆ చిత్రాల షూటింగ్‌లకు గ్రీన్ సిగ్నల్
స్వదేశీ రేడియో ఫ్రీక్వెన్సీ సీకర్‌తో కూడిన క్షిపణులు అత్యంత కచ్చితత్వంతో లక్ష్యాన్ని ఛేదించాయి. వర్టికల్ లాంచ్ షార్ట్ రేంజ్ సర్ఫేస్-టు-ఎయిర్ మిస్సైల్ (VL-SRSAM) వ్యవస్థను డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) స్వదేశీ టెక్నాలజీతో రూపొందించి అభివృద్ధి చేసింది. ఈ ప్రయోగాన్ని డీఆర్డీవో, ఇండియన్ నేవీ సీనియర్ అధికారులు పర్యవేక్షించారు.