Brahmos Missile : పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన బ్రహ్మోస్ క్షిపణి ప్రయోగం విజయవంతమైంది. ఆదివారం భారత నావికాదళం ఆరేబియాసముద్రంలో నిర్వహించిన ఈ మిసైల్ నిప్పులు చిమ్ముతూ నింగికెగసింది.
INS Vagir commissioned into Indian Navy: భారత నౌకాదళం మరింతగా బలోపేతం అయింది. కల్వరి క్లాస్ కు చెందిన 5వ జలంతార్గామ ఐఎన్ఎస్ వగీర్ సోమవారం నౌకాదళంలో చేరింది. ముంబైలోని నావల్ డాక్ యార్డ్ లో చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ అడ్మిరల్ ఆర్ హరి కుమార్ సమక్షంలో ఐఎన్ఎస్ వగీర్ నౌకాదళలోకి ప్రవేశించింది. అత్యంత తక్కువ కాలంలో 24 నెలల్లోనే భారత నౌకాదళంలోకి ప్రవేశించిన మూడో జలంతర్గామి అని హరికుమార్ అన్నారు. భారతదేశ షిప్‌యార్డ్‌ల…
అండమాన్ దీవుల సమీపంలో ఓ పడవలో 100 మంది రోహింగ్యాలు చిక్కుకుపోయారని.. దాదాపు 16 నుంచి 20 మంది దాహం, ఆకలి లేదా నీటిలో మునిగి చనిపోయి ఉండొచ్చని మయన్మార్ రోహింగ్యా ఉద్యమకారులు తెలిపారు.
INS Mormugao, a P15B stealth-guided missile destroyer, commissioned into the Indian Navy: భారత నౌకాదళంలోకి కొత్తగా వార్ షిప్ ఐఎన్ఎస్ మోర్ముగోను ప్రవేశపెట్టారు. దీంతో భారత నౌకాదళం మరింతగా శక్తివంతం కానుంది. స్టెల్త్-గైడెడ్ క్షిపణి విధ్వంసక నౌకను ఆదివారం భారత రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ సైన్యంలోకి ప్రవేశపెట్టారు. ముంబైలో జరిగిన ఈ కార్యక్రమానికి రక్షణ మంత్రితో పాటు సీడీఎస్ అనిల్ చౌమాన్, నేవీ చీఫ్ అడ్మినరల్ ఆర్ హరికుమార్, గోవా…
విశాఖ సాగర తీరంలో తూర్పు నౌకాదళం ఘనంగా విజయ్ దివస్‌ను నిర్వహించింది. భారత సైన్యం ప్రాణాలకు తెగించిం 1971లో పాకిస్థాన్‌పై యుద్ధంలో సాధించిన విజయానికి గుర్తుగా ఈ విజయ్ దివస్‌ను జరుపుకోవడం ఆనవాయితీ.
భారత నావికాదళం 2047 నాటికి ఆత్మనిర్భర్‌గా మారుతుందని ప్రభుత్వం హామీ ఇచ్చిందని నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్.హరి కుమార్ నేవీ డే సందర్భంగా శనివారం మీడియాతో వెల్లడించారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వంటి ఇటీవలి సంఘటనలు మన భద్రతా అవసరాల కోసం ఇతరులపై ఆధారపడలేమని నిరూపించాయని.. ఆత్మనిర్భర్‌గా ఉండటానికి ప్రభుత్వం చాలా స్పష్టమైన మార్గదర్శకాలను అందించిందని నేవీ చీఫ్ చెప్పారు.
Ballistic missile fired from nuclear submarine INS Arihant:భారత సైనిక సామర్థ్యాన్ని మరోసారి నిరూపించుకుంది. భారతదేశ న్యూక్లియర్ సబ్మెరైన్ ఐఎన్ఎస్ అరిహంత్ నుంచి బాలిస్టిక్ క్షిపణిని విజయవంతంగా ప్రయోగించింది. సబ్మెరైన్ లాంచ్డ్ బాలిస్టిక్ మిస్సైల్(ఎస్ఎల్బీఎం)ను అరిహంత్ నుంచి శుక్రవారం విజయవంతంగా ప్రయోగించినట్లు భారత రక్షణ మంత్రిత్వశాఖ వెల్లడించింది. క్షిపణి నిర్ణయించిన విధంగా అత్యంత ఖచ్చితత్వంతో లక్ష్యాన్ని ఛేదించినట్లు అధికారలు వెల్లడించారు.
₹ 1,200-Crore Afghan Heroin Caught: ఆఫ్ఘనిస్తాన్ నుంచి పాకిస్తాన్ మీదుగా ఇండియాకు తీసుకువస్తున్న హెరాయిన్ ను పట్టివేశారు అధికారులు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి 200 కిలోల హెరాయిన్ ను మొదటగా పాకిస్తాన్ తరలించి అక్కడ నుంచి ఇరాన్ పడవలో ఇండియా, శ్రీలంకకు తరలించేందుకు ప్రయత్నించారు. గురువారం ఇండియన్ నేవీ, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎస్ సి బి) కలిసి సముద్రంలో ఆపరేషన్ నిర్వహించి భారీ డ్రగ్స్ దందాను పట్టుకున్నారు. ఇరాన్ పడవలో ఏడు పొరల ప్రాకేజింగ్ తో హెరాయిన్…
డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO), ఇండియన్ నేవీ ఇవాళ ఒడిశా తీరంలోని ఛాందిపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ITR) నుంచి వర్టికల్ లాంచ్ షార్ట్ రేంజ్ సర్ఫేస్-టు-ఎయిర్ మిస్సైల్ (VL-SRSAM) ను విజయవంతంగా పరీక్షించాయి.