గురువారం నిర్వహించిన బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్షిపణి ప్రయోగం విజయవంతమైందని రక్షణ శాఖ తెలిపింది. సముద్రంలో ఉన్న ఓడలు, పడవలు వంటి లక్ష్యాలను ఛేదించేందుకు ప్రత్యేకంగా తయారుచేసిన యాంటీషిప్ వెర్షన్ బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్షిపణి పరీక్ష విజయవంతమైనట్లు ఇండియన్ నేవీ, అండమాన్ నికోబార్ కమాండ్ వెల్లడించాయి. బ్రహ్మోస్ క్షిపణి అత్యంత కచ్చితత్వంతో నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించినట్లు తెలిపాయి.
ఈ ప్రయోగాన్ని ఇండియన్ నేవీ, అండమాన్ నికోబార్ కమాండ్ సంయుక్తంగా నిర్వహించాయి. ఈ నెల 19న భారత వైమానిక దళం సుఖోయ్ యుద్ధవిమానం నుంచి బ్రహ్మోస్ క్షిపణిని పరీక్షించింది. అంతకుముందు హిందూ మహా సముద్రం నుంచి బ్రహ్మోస్ క్షిపణిని పరీక్షించారు. బ్రహ్మోస్ క్షిపణి ధ్వని కంటే మూడు రెట్లు ఎక్కువ వేగంతో ప్రయాణించి లక్ష్యాలను ఛేదించగలదు.
Shigella: కేరళలో వెలుగుచూసిన షిగెల్లా కేసు.. లక్షణాలు ఇవే..!