Indian Navy All Women Team Completes Surveillance Mission: భారత నారీ శక్తి ఎందులో తీసిపోదని మరోసారి నిరూపితం అయింది. ఇండియన్ నేవీకి చెందిన మహిళా బృందం తాజాగా రికార్డ్ సృష్టించింది. ఐదుగురు సభ్యులతో కూడిన మహిళా బృందం ఉత్తర అరేబియా సముద్రంలో నిఘా మిషన్ ను పూర్తి చేసి చరిత్ర సృష్టించింది. బుధవారం అత్యాధునిక డోర్నియర్ 228 విమానంలో ఉత్తర అరేబియా సముద్రంలో సముద్ర నిఘాను పూర్తి చేసింది. ఈ మిషన్ ద్వారా నారీ శక్తి ప్రదర్శితమైందని ఇండియన్ నేవీ చెబుతోంది.
ఈ నిఘా మిషన్ కమాండర్ గా లెఫ్టినెంట్ సీడీఆర్ ఆంచల్ శర్మ నాయకత్వం వహించారు. వీరిలో ఫైలెట్లుగా లెఫ్టినెంట్ శివంగి, లెఫ్టినెంట్ అపూర్వ గీతే వ్యవహరించారు. టాక్టికల్ ఆఫీసర్ గా లెఫ్టినెంట్ పూజా పాండే, సెన్సార్ ఆఫీసర్ గా ఎస్ఎల్టీ పూజా షెకావత్ మిషల్ లో పాలుపంచుకున్నారు. పోర్ బందర్ నావర్ ఎయిర్ ఎన్ క్లేవ్ లో ఉన్న ఫ్రంట్ లైన్ నావర్ ఎయిర్ స్వ్కాడ్రన్ కు చెందిన ఐఎన్ఏఎస్ 315కి ఈ ఐదుగురు అధికారిణులు ఈ మిషన్ ను విజయవంతంగా పూర్తి చేశారు. ఈ మిషన్ కోసం మహిళా అధికారులకు నెలల తరబడి శిక్షణ ఇచ్చారు.
Read Also: Himanta Biswa Sarma: 800 ప్రభుత్వ మదర్సాల రద్దు.. టెర్రరిస్టులకు అడ్డాగా అస్సాం
ఈ మొదటి రకం ఫ్లైయింగ్ మిషన్ ఎంతో ప్రత్యేకమైనదిగా.. ఏవియేషన్ క్యాడర్ లో మహిళా అధికారులు మరింత బాధ్యతతో సవాళ్లు స్వీకరించేలా ఈ మిషన్ ఉపయోగపడుతుందని నేవీ అధికారులు భావిస్తున్నారు. భారత దేశంలోని కోట్ల మంది మహిళలకు ఈ విజయం స్ఫూర్తి ఇస్తుందని అధికారులు అభినందనలు కురిపిస్తున్నారు. నావికాదళంలో మహిళలను చేర్చడంతో పాటు మహిళా పైలెట్లను హెలికాప్టర్ల విభాగంలోకి చేర్చుకోవడం వంటి మహిళా సాాధికారిక కార్యక్రమాలను ఇండియన్ నేవీ చేపడుతోంది.