Indian Navy Submarines: అణు సబ్‌మెరిన్ల దిశగా భారత నౌకాదళం.. మరో 9 కొత్త సబ్‌మెరిన్లు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Indian Navy Submarines: భారత్ ఎప్పటికప్పుడు తన రక్షణ శక్తులను పెంచుకుంటూ పోతుంది. ఇందులో భాగంగానే తాజాగా భారత నౌకాదళం మరింత బలపడేందుకు మరో పెద్ద అడుగు వేయబోతోంది. అతి త్వరలో 9 ఆధునిక డీజిల్-ఎలక్ట్రిక్ సబ్‌మెరిన్లు నౌకాదళంలో చేరనున్నట్లు సమాచారం. ప్రస్తుతం వీటి ధరలపై చర్చలు జరుగుతుండగా, తర్వాత మంత్రివర్గ భద్రతా కమిటీ (CCS) నుంచి ఆమోదం లభించనుంది. ఈ సబ్‌మెరిన్లు మజగావ్ డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్‌లో నిర్మించబడతాయి.
AFG vs PAK: ఛేదనలో బొక్కబోర్లా పడ్డ పాకిస్తాన్.. ఆఫ్గనిస్తాన్ అద్భుత విజయం!
Also Read
- WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
- Pensions: పెన్షన్ల నిధులు విడుదల.. అక్టోబర్ 1వ తేదీ ఉదయం నుంచే పంపిణీ షురూ..
- New Train Service: ఏపీ రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. కొత్త రైలు వచ్చేసింది.. వారానికి 3 రోజులు..
- Honor Smart Phone: 200MP కెమెరా, 11,000mAh బ్యాటరీ.. మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్..
ఇప్పటికే భారతదేశం 2005లో ఫ్రాన్స్‌తో కలిసి ప్రాజెక్ట్-75లో భాగంగా 6 స్కార్పీన్ తరగతి సబ్‌మెరిన్లు నిర్మించుకుంది. వాటిలో కల్వరి, ఖండేరి, కరంజ్, వేళా, వగీర్, వగశీర్ నౌకాదళంలో చేరి వాటి పనిని చేస్తున్నాయి. ఇవి టార్పెడో, యాంటీ-షిప్ మిసైళ్లతో రహస్యంగా దాడి చేయగలిగే అత్యాధునిక అటాక్ సబ్‌మెరిన్లలో ఒకటిగా గుర్తించబడ్డాయి. ఇక ఈ ప్రాజెక్ట్-75 ఫాలో ఆన్ ఆర్డర్ కింద భారత నౌకాదళానికి మరో 3 కొత్త సబ్‌మెరిన్లు రాబోతున్నాయి. అలాగే ప్రాజెక్ట్-75 ఇండియా కింద 6 సబ్‌మెరిన్ల ఒప్పందం కూడా ముందుకు వెళ్తోంది. అంటే రాబోయే కాలంలో మొత్తం 9 సబ్‌మెరిన్లు నౌకాదళ శక్తిలో చేరనున్నాయి.
Pakistan: పాకిస్థాన్‌లో ఆత్మాహుతి దాడి.. 14 మంది మృతి, 30 మందికి గాయాలు!
డీజిల్-ఎలక్ట్రిక్ సబ్‌మెరిన్లతో పాటు అణు సబ్‌మెరిన్ల ద్వారానూ భారత నౌకాదళం శక్తివంతం కానుంది. ప్రస్తుతం భారతదేశం వద్ద 17 డీజిల్-ఎలక్ట్రిక్, 2 న్యూక్లియర్ బాలిస్టిక్ మిసైల్ సబ్‌మెరిన్లు (SSBN) ఉన్నాయి. తాజాగా ప్రభుత్వం 2 అణు అటాక్ సబ్‌మెరిన్ల (SSN) నిర్మాణానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వీటిలో మొదటి స్వదేశీ SSN సబ్‌మెరిన్ 2036-37 నాటికి నౌకాదళంలో చేరే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
-
OTR : El Ninoతో మరణమృదంగమేనా ? లక్షల మంది పిట్టల్లా రాలిపోతారా ?
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!