Drone Missile: భారత్ సరికొత్త ఆయుధాలతో సత్తా చాటుతోంది. తాజాగా డ్రోన్ ద్వారా మిస్సైల్ ప్రయోగించే పరీక్షను విజయవంతంగా నిర్వహించింది. ఆంధ్రప్రదేశ్‌లోని ఒక టెస్ట్ సెంటర్‌లో డ్రోన్ నుంచి ప్రిసెషన్-గైడెడ్ క్షిపణిని విజయవంతంగా ప్రయోగించింది. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) కర్నూలులో UAV లాంచ్డ్ ప్రెసిషన్ గైడెడ్ క్షిపణి (ULPGM)-V3 పరీక్షలను నిర్వహించింది.
DRDO : భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో, దేశ రక్షణ వ్యూహాల్లో హైదరాబాద్‌లోని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) కీలక భూమిక పోషిస్తోంది. దేశ భద్రతకు అవసరమైన అనేక ఆధునిక ఆయుధాల తయారీలో హైదరాబాద్ DRDO ల్యాబ్ నడిపిస్తున్న పరిజ్ఞానం ఇప్పుడు యుద్ధ సన్నాహాల్లో కీలకంగా మారింది. ఆకాష్, బ్రహ్మోస్ వంటి శక్తివంతమైన క్షిపణుల నుంచి, సాంకేతికంగా ముందున్న యాంటీ డ్రోన్ సిస్టమ్ వరకు, అనేక ఆయుధ వ్యవస్థలు స్వదేశీ పరిజ్ఞానంతో హైదరాబాద్…
Operation Sindoor: “ఆపరేషన్ సింధూర్” తర్వాత భారత్, పాకిస్తాన్ దేశాలలో ఘర్షణ వాతావరణం నెలకొంది. అయితే, అమెరికా మధ్యవర్తిత్వం వహింపుతో ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణకు సమ్మతించాయి. అయితే, ఈ కాల్పుల విరమణ చేపట్టిన కొద్ది సేపటికే పాకిస్తాన్ మరోమారు తన వక్రబుద్ధిని బయటపెట్టింది. ఈ నేపథ్యంలో భారత్ కూడా ఆ దాడులను తిప్పికోట్టింది. ఇకపోతే పాకిస్తాన్ ఆపరేషన్ సింధూర్ తర్వాత బోలెడు అబ్దాలు చెప్పింది. ఆ అబద్దాలను భారత సైన్యం ఆధారాలతో సహా నిరూపించింది.…
పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ నిర్వహించిన ఆపరేషన్ సిందూర్‌లో ఐదుగురు జవాన్లు అమరులైనట్లు వెల్లడించారు DGMO రాజీవ్ ఘాయ్.. ఆపరేషన్ సిందూర్ తదనంతర పరిణామాలపై తొలిసారి ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్, నేవీ DGMOలు సంయుక్త మీడియా సమావేశం.. నిర్వహించారు.. అందులో DGMO రాజీవ్ ఘాయ్ మాట్లాడుతూ.. ఆపరేషన్ సిందూర్‌లో ఐదుగురు సైనికులు అమరులయ్యారు.. ఐదుగురు జవాన్లు, పాక్ దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన పౌరులకు సంతాపం తెలియజేస్తున్నాం.. అమర జవాన్ల త్యాగాలను దేశం ఎన్నటికీ మర్చిపోదు అన్నారు..
మరో మహా భారతం ! ఒకటా ? రెండా ? వరుస అవమానాలు .. అన్యాయాలు .. ఇంటికి నిప్పు పెట్టారు .. నిండు సభలో ఘోరంగా అవమానించారు .. రాజ్యం లాగేసుకున్నారు ..అడవుల పాలు చేసారు .. అయినా పాండవులు కయ్యానికి కాలు దువ్వలేదు . రాయబారాలు పంపారు .. “యుద్ధం వద్దు .. కనీసం అయిదు ఊళ్ళు ఇవ్వు “అన్నారు . పోగాలము దాపురించిన వాడు మంచి వారి మాటలు వినడు . చివరకు…
పహల్గాం ఉగ్ర దాడితో రగిలిపోతున్న భారత్.. పాకిస్థాన్‌పై ప్రతీకారం తీర్చుకుంది. ‘ఆపరేషన్ సింధూర్’ మంగళవారం అర్ధరాత్రి పాక్ ఉగ్ర శిబిరాలపై మెరుపు దాడి చేసింది. ఈ మేరకు ఆపరేషన్ సింధూర్‌లో 100 మందికి పైగా టెర్రరిస్టులు మృతి చెందినట్లు భద్రతా దళాలు తెలిపాయి. ఈ మెరుపు దాడికి ‘ఆపరేషన్ సిందూర్’ అని పేరు పెట్టింది. పాక్‌పై ప్రతీకారం తీర్చుకున్న వేళ ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ సిందూర్ అని పేరు పెట్టడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
Pak Minister Asif: హల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్-పాకిస్తాన్ మధ్య సంబంధాలు క్రమంగా క్షీణిస్తున్నాయి. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపత్యంలో పాక్ రక్షణ మంత్రి ఖవాజా ముహమ్మద్ ఆసిఫ్ సంచలన కామెంట్స్ చేశారు.
1971లో, ఇండో-పాక్ యుద్ధం ప్రారంభమైనప్పుడు, భారత నావికాదళం ఆపరేషన్ ట్రైడెంట్ ద్వారా పాకిస్తాన్ సైన్యాన్ని ఓడించడంలో విజయం సాధించింది. ఈ ఆపరేషన్ ప్రారంభమైన రోజు జ్ఞాపకార్థం , వివిధ ఆపరేషన్లలో ధైర్యంగా మరణించిన జవాన్లను స్మరించుకోవడానికి ప్రతి సంవత్సరం డిసెంబర్ 4వ తేదీన ఇండియన్ నేవీ డే జరుపుకుంటారు. కాబట్టి ఈ రోజు చరిత్ర , ప్రాముఖ్యతతో సహా పూర్తి సమాచారం ఇక్కడ ఉంది.
మాల్దీవులలో ఉన్న భారత సైనిక అధికారుల బృందం స్వదేశానికి తిరిగి వచ్చింది. అలాగే, అక్కడే ఉన్న హెలికాప్టర్ను ఆపరేట్ చేయడానికి భారతీయ పౌరుల బృందం ఇప్పటికే అక్కడికి చేరుకుంది.
హిందూ మహాసముద్ర ద్వీపసమూహం నుంచి భారత్ తన బలగాలను ఉపసంహరించుకోకుంటే తమ దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుందని మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జూ అన్నారు.