Maldives: మాల్దీవులు అన్నంత పనిచేసింది. కొత్తగా ఎన్నికైన అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జూ ప్రమాణ స్వీకారం చేసిన ఒక రోజు తర్వాత.. మాల్దీవుల్లో భారత మిలిటరీ ఉనికి ఉపసంహరించుకోవాలని కోరింది. అంతకుముందు రోజు ప్రయాణ స్వీకారానికి భారత్ తరుపున మాల్దీవులు వెళ్లిన కేంద్రమంత్రి కిరెన్ రిజిజును కలిసినప్పుడు, ముయిజ్జూ అధికారికంగా ఈ అభ్యర్థన చేసినట్లు తెలిసింది.
India Was World's 4th Largest Defence Spender In 2022: ప్రపంచంలో దేశ రక్షణ కోసం ఎక్కువగా ఖర్చు చేస్తున్న దేశాల్లో భారత్ ఒకటి. భారత్ చుట్టూ చైనా, పాకిస్తాన్ వంటి దేశాలు ఉన్నాయి. దీంతో భారత్ ఇటీవల కాలంలో సరిహద్దుల్లో రక్షణ కోసం ఎక్కువగా ఖర్చు పెడుతోంది. 2021తో పోలిస్తే భారత్ రక్షణ వ్యయం 6 శాతం పెరిగినట్లు స్వీడన్ దేశానికి చెందిన స్టాక్‌హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (SIPRI) నివేదిక తెలిపింది.