DRDO : భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో, దేశ రక్షణ వ్యూహాల్లో హైదరాబాద్‌లోని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) కీలక భూమిక పోషిస్తోంది. దేశ భద్రతకు అవసరమైన అనేక ఆధునిక ఆయుధాల తయారీలో హైదరాబాద్ DRDO ల్యాబ్ నడిపిస్తున్న పరిజ్ఞానం ఇప్పుడు యుద్ధ సన్నాహాల్లో కీలకంగా మారింది. ఆకాష్, బ్రహ్మోస్ వంటి శక్తివంతమైన క్షిపణుల నుంచి, సాంకేతికంగా ముందున్న యాంటీ డ్రోన్ సిస్టమ్ వరకు, అనేక ఆయుధ వ్యవస్థలు స్వదేశీ పరిజ్ఞానంతో హైదరాబాద్ DRDO ఆధ్వర్యంలో తయారయ్యాయి. ప్రస్తుతం జరిగే యుద్ధ సన్నివేశాల్లో ఇవి ప్రధానంగా వినియోగంలోకి వస్తున్నాయి.
RAPO22 : ‘ఆంధ్ర కింగ్ తాలూకా’.. రిలీజ్ డేట్ ఫిక్స్.?
దేశం మొత్తం మీద ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలో అత్యంత కీలకమైన భాగం — ఆకాష్ క్షిపణి వ్యవస్థ — పూర్తిగా హైదరాబాద్ DRDO పరిశోధనల ఫలితమే. ఈ క్షిపణి మన ప్రాంతాన్ని ఏ యుద్ధ విమానం గాల్లోనుండి చేరకుండా నిరోధించగలదు. దీనితో పాటు, అత్యంత వేగవంతమైన బ్రహ్మోస్ క్షిపణి కూడా హైదరాబాద్ కేంద్రంగా అభివృద్ధి చేయబడిన టెక్నాలజీ ఆధారంగా ఉంది. ఏ రాడార్‌కీ చిక్కనివ్వకుండా లక్ష్యాన్ని ధ్వంసం చేయగలిగే సామర్థ్యం దీనిలో ఉంది. తాజా యుద్ధాలలో డ్రోన్ దాడులు పెరుగుతున్న నేపథ్యంలో, హైదరాబాద్ DRDO రూపొందించిన యాంటీ డ్రోన్ సిస్టమ్ కూడా కీలకంగా మారింది. దేశంలోనే తయారైన ఈ సాంకేతిక పరిజ్ఞానం ఇప్పటికే ప్రయోగాత్మకంగా విజయవంతంగా ఉపయోగించబడుతోంది. ఇంతవరకు స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన ఆయుధాలపై ప్రపంచ దేశాల నుంచి ఆసక్తి పెరుగుతోంది. రాబోయే రోజుల్లో భారత్ నుండి ఆయుధాల ఎగుమతులు మరింతగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇందులో హైదరాబాద్ DRDO కీలక హబ్‌గా నిలుస్తోంది.
Virat Kohli Test Retirement: అభిమానులకు హార్ట్ బ్రేక్.. రిటైర్మెంట్ ప్రకటించిన విరాట్ కోహ్లీ!