Today Stock Market Roundup 05-04-23: దేశీయ ఈక్విటీ మార్కెట్ ఇవాళ బుధవారం లాభాలతో ప్రారంభమై లాభాలతోనే ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందుతున్నప్పటికీ ఆ ప్రభావం ఇండియన్ స్టాక్ మార్కెట్‌పై కనిపించకపోవటం గమనించాల్సిన అంశం. దీంతో.. ఇంట్రాడేలో కూడా లాభాలు కొనసాగాయి. గత ఆర్థిక సంవత్సరంలోని చివరి త్రైమాసికంలో వ్యాపార రంగం ఆరోగ్యవంతమైన ఫలితాలను కనబరచటం పెట్టుబడిదారుల సెంటిమెంట్‌ను పెంచింది.
Today(15-03-23) Stock Market Roundup: ఇండియన్ స్టాక్ మార్కెట్‌లో ఈ వారం వరుసగా 3 రోజుల నుంచి ఒకే రకమైన ట్రేడింగ్ వాతావరణం నెలకొంది. ఉదయం ఉత్సాహంగా ప్రారంభం కావటం.. మధ్యాహ్నానికి డీలా పడిపోవటం.. ఇదే జరుగుతోంది. ఇవాళ బుధవారం రెండు కీలక సూచీలు లాభాలతో ప్రారంభమైనప్పటికీ సాయంత్రం భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. ఎఫ్‌ఎంసీజీ సెక్టార్ స్టాక్స్ మరియు రిలయెన్స్, ఎయిర్‌టెల్ షేర్లు బలహీనపడటంతో సెన్సెక్స్, నిఫ్టీ రోజురోజుకీ నేలచూపులు చూస్తున్నాయి.
Today Stock Market Roundup: సిలికాన్ వ్యాలీ బ్యాంక్ సంక్షోభ భయాలు ఇండియన్ స్టాక్ మార్కెట్‌ని ఇంకా వీడలేదు. దీంతో ఇవాళ మంగళవారం కూడా నిన్నటి మాదిరి పరిణామాలే చోటుచేసుకున్నాయి. రెండు కీలక సూచీలు ఉదయం లాభాలతో ప్రారంభమైనప్పటికీ ఇంట్రాడేలో ఆ పరిస్థితి కొనసాగలేదు. ఐటీ, ఆటోమొబైల్, పవర్, రియాల్టీ కంపెనీల షేర్లు అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి.
Stock Market Roundup 08-03-23: దేశీయ స్టాక్ మార్కెట్ ఇవాళ బుధవారం ఉదయం నష్టాలతో ప్రారంభమైనప్పటికీ సాయంత్రం లాభాలతో ముగిసింది. ఇంట్రాడేలో నష్టాల నుంచి కోలుకుంది. రెండు కీలక సూచీలకు లాభాలతో శుభం కార్డు పడటం వరుసగా ఇది మూడో రోజు. మార్నింగ్ ట్రేడింగ్‌లో 60 వేల కన్నా దిగువకు వచ్చిన సెన్సెక్స్ ఎట్టకేలకు బెంచ్ మార్క్‌ను దాటింది. చివరికి.. సెన్సెక్స్ 123 పాయింట్లు పెరిగి 60 వేల 348 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది.
Stock Market Roundup 06-03-23: ఇండియన్ స్టాక్ మార్కెట్‌కి ఈవారం శుభారంభం లభించింది. ఇవాళ సోమవారం ఉదయం లాభాలతో ప్రారంభమైన రెండు కీలక సూచీలు సాయంత్రం కూడా లాభాలతోనే ముగిశాయి. గ్లోబల్ మార్కెట్ నుంచి సానుకూల సంకేతాలు వెలువడటంతో ఒక్కో ఇండెక్స్ సున్నా పాయింట్ ఏడు శాతం వరకు పెరిగాయి. ఈ రోజు సెన్సెక్స్ మళ్లీ 60 వేల బెంచ్ మార్క్‌ను దాటడం చెప్పుకోదగ్గ విషయం. చివరికి.. సెన్సెక్స్.. 415 పాయింట్లు పెరిగి 60 వేల 224…
Today (13-02-23) Business Headlines: మనోళ్లే మార్కెట్ ఓనర్లు: ఇండియన్ ఈక్విటీ మార్కెట్’లో డొమెస్టిక్ ఇన్వెస్టర్ల ఓనర్’షిప్.. అక్టోబర్-డిసెంబర్ క్వార్టర్’లో లైఫ్ టైమ్ హయ్యస్ట్ లెవల్’కి చేరుకుంది. అంటే.. 24 పాయింట్ నాలుగు నాలుగు శాతంగా నమోదైంది. వరుసగా ఐదో త్రైమాసికంలో కూడా గ్రోత్ నెలకొనటం విశేషం. ఈ యాజమాన్యం.. వ్యక్తులు మరియు సంస్థలది కావటం గమనించాల్సిన విషయం. ఇదిలా ఉండగా.. రిటైల్ ఇన్వెస్టర్ల ఓనర్’షిప్ మాత్రం సున్నా పాయింట్ ఒకటీ ఒకటీ శాతం తగ్గింది.
Today (10-02-23) Stock Market Roundup: దేశీయ స్టాక్ మార్కెట్ ఈ వారాంతాన్ని నష్టాలతో ప్రారంభించి నష్టాలతోనే ముగించింది. ఇవాళ శుక్రవారం ఈక్విటీ మార్కెట్లు ఎక్కువ శాతం నేల చూపులు చూశాయి. ఇంట్రాడేలో నిఫ్టీ.. 50 పాయింట్లకు పైగా పడిపోగా.. సెన్సెక్స్ 150 పాయింట్లకు పైగా కోల్పోయింది. రిలయెన్స్ ఇండస్ట్రీస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, హిందుస్థాన్ యూనిలీవర్, ఏసియన్ పెయింట్స్ తదితర సంస్థల షేర్ల అమ్మకాలు పెరగటంతో కీలకమైన సూచీలు కోలుకోలేకపోయాయి.
Today (01-02-23) Stock Market Roundup: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ ప్రభావం దేశీయ స్టాక్ మార్కెట్‌పై రెండు విధాలుగా వ్యక్తమైంది. సెన్సెక్స్ లాభపడగా.. నిఫ్టీ స్వల్పంగా నష్టపోయింది. రెండు కీలక సూచీలు ఇవాళ బుధవారం ఉదయం భారీ లాభాలతో ప్రారంభం కాగా ఇంట్రాడేలో పెద్దఎత్తున అప్ అండ్ డౌన్స్‌కి గురయ్యాయి. ఫలితంగా.. వరుసగా మూడో రోజు.. సెన్సెక్స్, నిఫ్టీ.. బెంచ్ మార్క్‌లకు దిగువనే ముగిశాయి.
T+1 Settlement Cycle: భారత స్టాక్ మార్కెట్ చరిత్రలో సరికొత్త అధ్యాయం ప్రారంభమైంది. T+1 సెటిల్మెంట్ సైకిల్ అందుబాటులోకి వచ్చింది. దీంతో స్టాక్ ఎక్స్ఛేంజ్‌ల్లో ట్రేడింగ్ చేసిన సెక్యూరిటీస్ ఒక్క రోజు వ్యవధిలోనే మన డీమ్యాట్ అకౌంట్లలో జమవుతాయి. స్టాక్స్ విక్రయించగా వచ్చే డబ్బు లేదా ప్రాఫిట్స్ కూడా ఒక్క వర్కింగ్ డేలోనే మన చేతికొస్తాయి. దీనికి గతంలో 2 రోజులు పట్టేది. మధ్యలో సెలవులొస్తే మరింత ఆలస్యమయ్యేది. కొత్త విధానం ఈ నెల 27వ తేదీ…