Stock Market Roundup 06-03-23: ఇండియన్ స్టాక్ మార్కెట్‌కి ఈవారం శుభారంభం లభించింది. ఇవాళ సోమవారం ఉదయం లాభాలతో ప్రారంభమైన రెండు కీలక సూచీలు సాయంత్రం కూడా లాభాలతోనే ముగిశాయి. గ్లోబల్ మార్కెట్ నుంచి సానుకూల సంకేతాలు వెలువడటంతో ఒక్కో ఇండెక్స్ సున్నా పాయింట్ ఏడు శాతం వరకు పెరిగాయి.
ఈ రోజు సెన్సెక్స్ మళ్లీ 60 వేల బెంచ్ మార్క్‌ను దాటడం చెప్పుకోదగ్గ విషయం. చివరికి.. సెన్సెక్స్.. 415 పాయింట్లు పెరిగి 60 వేల 224 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ.. 117 పాయింట్లు పెరిగి 17 వేల 711 పాయింట్ల వద్ద ఎండ్ అయింది.
read more: Farmers Income: ఈ ఏడాది అన్నదాతల పంట పండినట్లే!!
బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో టాటా మోటార్స్, ఎన్‌టీపీసీ, పవర్ గ్రిడ్, ఇన్ఫోసిస్, బజాజ్ ఫిన్‌సర్వ్, ఏసియన్ పెయింట్స్, రిలయెన్స్, ఐటీసీ, హెచ్‌డీఎఫ్‌సీ, విప్రో, టీసీఎస్, యాక్సిస్ బ్యాంక్, హెచ్‌సీఎల్ టెక్ తదితర సంస్థలు బాగా రాణించాయి. టాటా స్టీల్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, ఎల్ అండ్ టీ, ఐసీఐసీఐ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్ వెనకబడ్డాయి.
వ్యక్తిగత స్టాక్స్ విషయానికొస్తే.. నిప్టీలో అదానీ ఎంటర్‌ప్రైజెస్ 5 పాయింట్ 5 శాతం మెరిశాయి. అదానీ ఎనర్జీ కూడా చెప్పుకోదగ్గ ఫలితాలను నమోదు చేసింది. బ్రిటానియా, టాటా స్టీల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ 1 నుంచి 2 శాతం వరకు నేల చూపులు చూశాయి.
రంగాల వారీగా పరిశీలిస్తే.. నిఫ్టీ ఐటీ ఇండెక్స్ అద్భుతమైన పనితీరు కనబరిచింది. 1 పాయింట్ 2 శాతానికి పైగా పెరిగింది. నిఫ్టీ ఆటో ఇండెక్స్ ఒక శాతం లాభపడింది. పది కేజీల బంగారం ధర 195 రూపాయలు పెరిగింది.
గరిష్టంగా 55 వేల 916 రూపాయల వద్ద ట్రేడ్ అయింది. కేజీ వెండి రేటు 307 రూపాయలు పెరిగి అత్యధికంగా 64 వేల 700 రూపాయలు పలికింది. క్రూడాయిల్ ధర స్వల్పంగా 52 రూపాయలు తగ్గింది. ఒక బ్యారెల్ ముడిచమురు 6 వేల 451 రూపాయలుగా నమోదైంది. రూపాయి మారకం విలువ డాలరుతో పోల్చితే 82 రూపాయల 47 పైసల వద్ద స్థిరపడింది.