ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం మరింత ఉధృతంగా సాగుతోంది.. ఉక్రెయిన్‌లో రష్యా మారణహోమం సృష్టిస్తోంది.. పోలాండ్ సరిహద్దు సమీపంలోని యవరీవ్‌ను టార్గెట్ చేసింది రష్యా.. మిలటరీ ట్రైనింగ్ క్యాంపుపై మిస్సైల్‌లో దాడులకు పూనుకుంది.. రష్యా దాడుల్లో తాజాగా 35 మంది మృతిచెందగా.. 134 మందికి పైగా గాయాలపాలైనట్టు తెలుస్తోంది. ఇక, మరో మేయర్‌ను కూడా కిడ్నాప్ చేసింది రష్యా సైన్యం, తాజాగా మెలిటోపోల్ మేయర్‌ను రష్యా కిడ్నాప్ చేసినట్లు ఉక్రెయిన్ ప్రకటించింది.. దీంతో ఇప్పటి వరకు కిడ్నాప్‌నకు గురైన…
ఆపరేషన్ గంగ కార్యక్రమంలో భాగంగా ఆదివారం వరకు 73 విమానాల్లో 15,206 మందిని భారత్ తీసుకొచ్చినట్టు పౌర విమానయాన శాఖ ప్రకటించింది. అలాగే 10 ఎయిర్‌ఫోర్స్ విమానాల్లో 2056 మందిని తరలించినట్టు తెలిపింది. సోమవారం 7 విమానాల్లో 1314 మంది భారత్ వచ్చినట్టు వివరించింది. మొత్తంగా ఫిబ్రవరి 22న ఆపరేషన్ గంగ మొదలైనప్పట్నుంచి ఉక్రెయిన్ పొరుగు దేశాల నుంచి 17,400 మందికి పైగా భారతీయులను సొంత దేశానికి తరలించామని వివరించింది. మంగళవారం మరో 2 విమానాలు భారత్…
ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం మరింత తీవ్ర రూపం దాల్చుతోన్న నేపథ్యంలో.. ఉక్రెయిన్‌లోని చిక్కుకుపోయిన భారతీయ కోసం కీలక ఆదేశాలు జారీ చేసింది భారత ప్రభుత్వం.. ఖార్కివ్‌లోని భారతీయులకు కేంద్రం అత్యవసర ఆదేశాలు జారీ చేసింది.. యుద్ధభూమి ఖార్కివ్‌ను తక్షణం వీడాలని స్పష్టం చేసింది ఉక్రెయిన్‌లోని భారత రాయబార కార్యాలయం.. ఖార్కివ్‌లోని భారతీయులకు ఇండియన్ ఎంబసీ ఈ కీలక సూచనలు చేసింది.. నగర శివార్లలోని పెసోచిన్, బబాయే, బెజ్లిడోవ్కా వైపు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వెళ్లాలని…
ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయ విద్యార్థులు, పౌరుల తరలింపు ప్రక్రియను మరింత వేగవంతం చేసింది కేంద్ర ప్రభుత్వం.. ఇప్పటికే ఆపరేషన్ గంగ పేరుతో భారత పౌరులను స్వదేశానికి రప్పించే ప్రయత్నాలు సాగుతుండగా.. మరిన్ని ప్రయత్నాలు మొదలుపెట్టారు.. భారత వైమానిక దళాన్ని తరలింపు ప్రక్రియలో పాల్గొనాలని పిలుపునిచ్చారు ప్రధాని నరేంద్ర మోడీ.. ఉక్రెయిన్ లో చిక్కుకున్న భారతీయులను మరింత వేగంగా తీసుకు వచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు.. భారత వైమానిక దళానికి చెందిన C-17 విమానం ద్వారా భారతీయులను తీసుకొచ్చేందుకు ఆలోచన…
ఉక్రెయిన్, రష్యా మధ్య నెలకొన్ని యుద్ధ పరిస్థితులతో అక్కడ చిక్కుకునన భారతీయ పౌరులను స్వదేశానికి తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఉక్రెయిన్ ఎంబీసీతో పాటు.. సంబంధింత అధికారులతో మాట్లాడుతూ.. భారతపౌరులను దేశానికి తీసుకువచ్చేందుకు ఇండియన్ ఎంబసీ తీవ్రంగా శ్రమిస్తోంది. అయితే ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతపౌరులు ఉక్రెయిన్ సరిహద్దు దాటి పోలెండ్ కు చేరుకుంటే అక్కడి నుంచి ఢిల్లీకి తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలెండ్ రాజధాని భారత రాయబార కార్యాలయం భారత్ పౌరులు, విద్యార్థులకు…
రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతోన్న తరుణంలో.. ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయి అవస్థలు పడుతున్న భారతీయ విద్యార్థులు, పౌరులకు పలు సూచనలు చేసింది భారత రాయబార కార్యాలయం… హంగేరిలోని భారత రాయబార కార్యాలయం నుంచి ఈ ప్రకటన విడుదల చేశారు.. ఆ ప్రకటనలో పలు కీలక సూచనలు చేసింది సర్కార్. Read Also: Ukraine Crisis: విద్యార్థుల భద్రతపై సీఎం జగన్ ఉన్నతస్థాయి సమీక్ష ఉక్రెయిన్‌లో చిక్కుకున్న విద్యార్థులను హంగేరి, రుమేనియా ద్వారా భారతీయుల తరలింపుకు కేంద్ర విదేశాంగ శాఖ…
రష్యా- ఉక్రెయిన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు ఇప్పుడు అందరినీ కలవరపెడుతున్నాయి.. వీటి ప్రభావం స్టాక్‌మార్కెట్లపై కూడా పడిన విషయం తెలిసిందే కాగా… రెండు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో అప్రమత్తమైంది భారత ప్రభుత్వం.. దీనిపై భారత విదేశాంగశాక ఓ ప్రకటన విడుదల చేసింది.. ఉక్రెయిన్‌లోని భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లను ముమ్మరం చేసినట్లు వెల్లడించింది.. పరిస్థితులపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నామని.. ఉక్రెయిన్‌లో భారత విద్యార్థులున్నందున అప్రమత్తంగా ఉన్నామని ప్రకటించింది ప్రభుత్వం.. ఇక, భారత్-ఉక్రెయిన్ మధ్య…
ఉక్రెయిన్ – రష్యా ల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఉక్రెయిన్ లో విద్యను అభ్యసిస్తున్న భారతీయ విద్యార్ధులకు కేంద్రం పలు సూచనలు చేసింది. తాజా పరిణామాలతో ఉక్రెయిన్ లో వైద్యవిద్యను అభ్యసిస్తున్న వందలాది మంది తెలుగు విద్యార్ధులు. తల్లితండ్రులు ఆందోళనలో వున్నారు. ఉక్రెయిన్‌లో ఉండాల్సిన అవసరం లేని భారతీయ విద్యార్ధులు స్వదేశానికి తిరిగి రావాలని కేంద్రం సలహా ఇచ్చింది. ఉక్రెయిన్ లోని భారతీయ విద్యార్ధులు భారత్ దౌత్యకార్యాలయాన్ని సంప్రదించాలని సూచించింది. ఉక్రెయిన్ లోని భారత దౌత్యకార్యాలయం…
తాలిబన్ల ఆధీనంలోకి వెళ్లిపోయిన ఆఫ్ఘనిస్థాన్‌లోని భారత రాయబార కార్యాలయాన్ని కూడా మూసివేశారనే వార్తలు హల్ చల్ చేశాయి.. కార్యాలయ సిబ్బందిని మొత్తం భారత్‌కు తరలించే ప్రక్రియ కొనసాగుతుండగా.. కార్యాలయం మూసివేశారని వార్తలు గుప్పుమన్నాయి.. అయితే, వాటిపై స్పందించిన కేంద్రం.. అసలు కాబూల్‌లోని భారత రాయబార కార్యాలయాన్ని మూసివేయలేదని క్లారిటీ ఇచ్చింది.. కాబూల్‌లోని భారత ఎంబసీలో సేవలు కొన సాగుతున్నాయని స్పష్టం చేసిన కేంద్రం.. దాదాపు 1,650 మంది భారతీయులు.. తిరిగి స్వదేశానికి వచ్చేందుకు దరఖాస్తు చేసుకున్నారుని వెల్లడించింది.…