Rajnath Singh: పాకిస్తాన్‌కు భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఆపరేషన్ సిందూర్ కేవలం ట్రైలర్ మాత్రమే అని శనివారం తీవ్రస్థాయిలో హెచ్చరించారు. ఈ ఆపరేషన్ ద్వారా భారతదేశానికి విజయం ఒక అలవాటుగా మారిందని నిరూపణ అయిందని ఆయన అన్నారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌లో కలిసి రాజ్‌నాథ్ సింగ్ లక్నోలోని బ్రహ్మోస్ ఏరోస్పేస్ యూనిట్‌లో తయారైన బ్రహ్మోస్ క్షిపణుల మొదటి బ్యాచ్‌ను జెండా ఊపి ప్రారంభించారు. Read Also: Shubman Gill:…
India Missiles 2025: దాయది దేశం పాకిస్థాన్ ఎన్ని కొత్త క్షిపణులు కొనుగోలు చేసిన అవి భారత అమ్ముల పొదిలో ఉన్న అత్యున్నత క్షిపణులతో పోల్చితే చాలా వెనకబడి ఉంటాయని రక్షణ వర్గాలు పేర్కొంటున్నాయి. తాగా పాక్ AIM-120 AMRAAM, చైనీస్ PL-15 వంటి కొత్త క్షిపణులను కొనుగోలు చేస్తోంది. అయితే వీటితో పోల్చితే భారతదేశ క్షిపణులు చాలా ఉన్నతమైనవిగా నిఘా వర్గాలు వెల్లడిస్తున్నాయి. DRDO VSHORAD, Astra, Rudram, NRSAM, BrahMos-ER వంటి క్షిపణులు పరిధి,…
NCERT: పాకిస్తాన్ పై భారత్ ఎంతో విజయవంతంగా నిర్వహించిన మిలిటరీ ఆపరేషన్ ‘‘ఆపరేషన్ సిందూర్’’ పాఠ్య పుస్తకాల్లో భాగం కానుంది. సిందూర్‌తో పాటు చంద్రయాన్, ఆదిత్య ఎల్1 అంతరిక్ష మిషన్లు, ఇటీవల శుభాన్షు శుక్లా ‘‘అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)’’ వెళ్లిన మిషన్లు పాఠ్యాంశాలుగా నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేుషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్(NCERT)లో చేర్చాలని కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ భావిస్తోంది.
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్‌పై రక్షణ శాఖ చీఫ్, సీడీఎస్ జనరల్ అనిల్ చౌహాన్ శుక్రవారం కీలక వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ సిందూర్ ‘‘ఇప్పటికీ కొనసాగుతోంది’’ అని శుక్రవారం చెప్పారు. దేశ సైనిక సంసిద్ధత హై అలర్ట్‌లో ఉందని, 24 గంటలూ, ఏడాది పొడవునా ఉంటుందని చెప్పారు.
LAC: జాతీయ భద్రత, చైనాతో సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్ తన రక్షణ సామర్థ్యాలను మరింత విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో వాస్తవ నియంత్రణ రేఖ(LAC) వెంబడి కనెక్టివిటీ పెంచే దిశగా తూర్పు లడఖ్‌లోని ముధ్ న్యోమా వద్ద భారతదేశంలో ఎత్తైన ఎయిర్ ఫీల్డ్ అక్టోబర్ నాటికి పూర్తి చేయనుంది. సముద్రమట్టానికి దాదాపు 13,700 అడుగుల ఎత్తులో ఉన్న న్యోమా భారత్-చైనా సరిహద్దుల్లో ఎల్ఏసీకి దగ్గరగా ఉన్న అడ్వాన్సుడ్ ల్యాండింగ్ గ్రౌండ్(ALG).
Hypersonic missiles: ఓ వైపు పాకిస్తాన్, మరోవైపు చైనా, కొత్తగా ఇప్పుడు బంగ్లాదేశ్.. ఇలా భారత్ చుట్టూ శత్రు దేశాలు ఉన్నాయి. అయితే, వీటిని సమర్థవంతంగా అడ్డుకునేందుకు భారత్ ఇటీవల కాలంలో తన ఆయుధ సంపత్తిని గణనీయంగా పెంచుకుంటోంది. ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్ స్వదేశీ ఆయుధాల సత్తా పాకిస్తాన్, చైనాలకు తెలిసి వచ్చింది. ఇక ముందు కూడా ఈ రెండు దేశాలకు భయపడేలా భారత్ పెద్ద ప్రాజెక్టుకే శ్రీకారం చుట్టింది.
భారతదేశాన్ని అభివృద్ధి చేయడంలో ప్రధాని మోడీ ఏ అవకాశాన్ని వదిలిపెట్టలేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. దేశాన్ని సురక్షితంగా ఉంచే పని ప్రధాని మోడీ చేశారన్నారు. గాంధీనగర్ లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. 2014 కి ముందు, ప్రతిరోజూ ఉగ్రవాద దాడులు జరిగాయని.. కానీ అప్పటి ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాలేదని విమర్శించారు. కానీ ఇప్పుడు అలా కాదని శత్రు దేశానికి తగిన సమాధానం చెబుతామన్నారు. సైన్యం ఇటుకలకు రాళ్లతో ప్రతిస్పందించిందని…
‘ఆపరేషన్ సిందూర్’ లో భాగంగా భారత్ చేపట్టిన వైమానిక దాడిలో ఇప్పటికే 100 మందికి పైగా ఉగ్రవాదులు హతమైన విషయం తెలిసిందే. ఈ అంశాన్ని భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. అయితే.. ఈ దాడిలో జైషేను స్థాపించిన మసూద్ అజార్ కుటుంబానికి చెందిన 10 మంది కూడా హతమైన విషయం తెలిసిందే. మసూద్ అజార్ సోదరుడు అబ్దుల్ రవూఫ్ అజార్ కూడా ఈ దాడిలో ప్రాణాలు కొల్పోయినట్లు తెలిసింది. ఈ విషయాన్ని అధికారులు వెల్లడించారు.…
CM Revanth Reddy : తెలంగాణ రాష్ట్రం దేశ రక్షణలో కీలక భూమిక పోషిస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఇవాళ హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో కలిసి డిఫెన్స్ ఎగ్జిబిషన్‌ను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, దేశ భద్రతకు తెలంగాణ రాష్ట్రం ఎంతో సహకారం అందిస్తోందని, ఇప్పటికే హైదరాబాద్ రక్షణ రంగానికి సంబంధించిన పరిశ్రమలు, విభాగాలకు కేంద్రంగా మారిందని వెల్లడించారు. తెలంగాణలో డిఫెన్స్ పరిశ్రమలు విస్తృతంగా అభివృద్ధి…