ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టీమ్ ఆఫ్ ద టోర్నమెంట్‌ను ఐసీసీ (ICC) ప్రకటించింది. ఇందులో టీమిండియా నుంచి ఆరుగురికి చోటు దక్కింది. అయితే.. అందులో కెప్టెన్ రోహిత్ శర్మ లేకపోవడం ఆశ్చర్యకరం.
ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్ తర్వాత టీమిండియా కీలక ఆటగాళ్లు రిటైర్ మెంట్ ప్రకటించబోతున్నారంటూ చర్చలు ఊపందుకున్నాయి. ముఖ్యంగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ వన్డేలకు వీడ్కోలు పలుకుతాడని ఊహాగానాలు వెల్లువెత్తాయి. గత సంవత్సరం ప్రపంచ కప్ గెలిచిన తర్వాత అతను T20 అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికినట్లుగానే ఇప్పుడు ఛాంపియన్ ట్రోఫీ అనంతరం వన్డేలకు రిటైర్ మెంట్ పలుకుతాడని అంతా భావించారు. అయితే ఈ పుకార్లకు రోహిత్ స్వయంగా ఫుల్ స్టాప్ పెట్టాడు. రిటైర్మెంట్ ఊహాగానాలపై…
ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ 2025లో భారత్ గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఫైనల్ లో న్యూజీలాండ్ పై నాలుగు వికెట్ల తేడాతో టీమిండియా విజయం సాధించింది. ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ మూడోసారి గెలుచుకున్న జట్టుగా హిస్టరీ క్రియేట్ చేసింది. రోహిత్ శర్మ కెప్టెన్సీలో భారత్ రెండోసారి ICC ట్రోఫీని గెలుచుకుంది. ఈ విజయంలో జట్టులోని ఆటగాళ్లు అందరు కీలక పాత్ర పోషించారు. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో న్యూజిలాండ్‌ను 4 వికెట్ల తేడాతో ఓడించిన తర్వాత ఆటగాళ్లు సంబరాలు చేసుకున్నారు.…
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ ఘన విజయం సాధించింది. చివరి వరకు ఎంతో ఉత్కంఠ కొనసాగింది. 6 వికెట్ల నష్టానికి భారత్ 254 పరుగులు విజయ కేతనాన్ని ఎగురవేసింది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025ని కైవసం చేసుకుంది. ఇప్పటికే రెండు ట్రోఫిలు సొంతం చేసుకున్న టీమిండియా తాజా గెలుపుతో మరో ట్రోఫీని ఖాతాలో వేసుకుంది.
భారతదేశం- న్యూజిలాండ్ మధ్య ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో భారత జట్టు టాస్ ఓడిపోయి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. భారత జట్టు మూడోసారి ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకోవాలని ప్రయత్నిస్తోంది. రోహిత్ శర్మ నాయకత్వంలోని భారత జట్టు సెమీఫైనల్లో ఆస్ట్రేలియాను 4 వికెట్ల తేడాతో ఓడించింది.
ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సంచలన నిర్ణయం తీసుకోనున్నారు. వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించే యోచనలో రోహిత్ శర్మ..? ఉన్నట్లు సమాచారం. తన భవిష్యత్‌పై సెలక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్‌తో చర్చించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.
భారత్- పాక్ మధ్య జరిగిన హై ఓల్టేజ్ మ్యాచ్‌లో టీమిండియా 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 242 పరుగుల లక్ష్యాన్ని 4 వికెట్లు కోల్పోయి 45 బంతులు ఉండగానే పూర్తి చేసింది. ఈ మ్యాచ్‌లో ఫోర్ కొట్టి టీమిండియాకు మర్చిపోలేని విక్టరీని అందించాడు విరాట్ కోహ్లీ. ఈ లెజెండరీ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ క్రీజులో అడుగు పెట్టిన దగ్గర్నుంచి పాక్ బౌలర్లను చీల్చి చెండాడాడు.
విరాట్ కోహ్లీకి పాకిస్తాన్‌పై ఎన్నో రికార్డులు ఉన్నాయి. తాజాగా మరో రెండు రికార్డులను బద్దలు కొట్టాడు. మొదట ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు మహమ్మద్ అజారుద్దీన్ అత్యధిక క్యాచ్‌ల రికార్డును బద్దలు కొట్టాడు. బ్యాటింగ్‌లో మరో రికార్డు నెలకొల్పాడు. పాకిస్తాన్‌తో జరుగుతున్న వన్డే మ్యాచ్‌లో కోహ్లీ 14,000 పరుగులు పూర్తి చేశాడు.
భారత్- ఇంగ్లండ్ మధ్య జరిగిన నాలుగో టీ20లో భారత్ ఘన విజయం సాధించింది. సిరీస్ పై కన్నేసిన టీమిండియా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ కైవసం చేసుకుంది. టఫ్ ఫైట్ లో ఇంగ్లండ్ ను సూర్యకుమార్ సేన మట్టికరిపించింది. 15 పరుగుల తేడాతో ఇంగ్లీష్ జట్టుపై ఘన విజయం సాధించింది. కాగా ఈ మ్యాచ్ లో ముందుగా టాస్ గెలిచిన ఇంగ్లండ్ బౌలింగ్ ఎంచుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన టీమిండియా నిర్ణీత 20…
పూణే వేదికగా భారత్- ఇంగ్లండ్ మధ్య నాలుగో టీ20 మ్యాచ్ జరుగుతోంది. గెలుపు కోసం ఇరు జట్లు హోరాహోరీగా తలపడుతున్నాయి. కాగా ఈ మ్యాచ్ లో ముందుగా టాస్ గెలిచిన ఇంగ్లండ్ బౌలింగ్ ఎంచుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్స్ నష్టపోయి 181 పరుగులు చేసి ఇంగ్లండ్ కు 182 పరుగుల టార్గెట్ ను నిర్ధేశించింది. ఇక ఈ మ్యాచ్ లో భారత సారథి సూర్యకుమార్ యాదవ్…