Jaiswal vs Gill: టీమిండియా టెస్టు జట్టులో విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. డబుల్ సెంచరీ చేసే అవకాశం కళ్ల ముందు చేజారితే ఏ బ్యాటర్‌కైనా కోసం రావడం సహజం. వెస్టిండీస్‌తో రెండో టెస్టు తొలి రోజు అద్భుతంగా ఆడిన యశస్వీ జైస్వాల్ (175) ఈరోజు కూడా మంచి జోష్‌లో ఉన్నాడు. అయితే, విండీస్ పేసర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ ముందుకు కొనసాగుతున్నాడు. కానీ, రనౌట్ రూపంలో డగౌట్ కి వెళ్లిపోయాడు. దీంతో నాన్ స్ట్రైకింగ్‌లో ఉన్న కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌పై జైస్వాల్ తీవ్రంగా మండిపడ్డాడు. ఈ విజువల్స్ సోషల్ మీడియాలో ట్రిండింగ్ అవుతున్నాయి. గిల్ పరుగు కోసం రాకపోవడంతోనే ఔటైన యశస్వీ.. చేతితో తలను కొట్టుకుంటూ స్టేడియం వీడాడు.
Read Also: Nobel Peace Prize: రాహుల్ గాంధీ నోబెల్ శాంతి పురస్కారానికి అర్హుడే..? కారణం చెప్పిన కాంగ్రెస్ నేత..!
అయితే, ఇన్నింగ్స్ 92వ ఓవర్‌ను జైదెన్ సీలెస్ వేశాడు. ఆ ఓవర్ సెకండ్ బంతిని యశస్వీ జైస్వాల్ మిడాఫ్ వైపు కొట్టాడు. ఈజీగా పరుగు వస్తుందని భావించిన యశస్వి రన్నింగ్ చేయడం స్టార్ట్ చేశాడు. మరోవైపు గిల్ మాత్రం అతడి పిలుపును పట్టించుకోకపోవడంతో.. అప్పటికే సగం పిచ్‌కు పైగా దాటిన జైస్వాల్ రిటర్న్ అయ్యేలోపు రనౌట్ అయ్యాడు. రనౌట్ తర్వాత గిల్ పై ఇట్స్ మై కాల్ అంటూ జైస్వాల్ తీవ్రంగా మండిపడ్డాడు. క్రీజులోనే అసహనం వ్యక్తం చేస్తూ బయటకు వెళ్లిపోయాడు. కాగా, శుభ్ మన్ గిల్ తీరుపై క్రికెట్ అభిమానులు సీరియస్ అవుతున్నారు. గిల్ తప్పిదం వల్లే జైస్వాల్ డబుల్ సెంచరీ మిస్ అయిందని నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో 74 పరుగుల భాగస్వామ్యానికి తెర పడింది. మరోవైపు, భారత జట్టు 5 వికెట్ల నష్టానికి 518 పరుగులకు ఇన్సింగ్స్ ను డిక్లేర్ చేసింది. యశస్వీ జైస్వాల్, కెప్టెన్ గిల్ సెంచరీలతో చెలరేగిపోయారు.
Shubman Gill had a chance to be a good captain today but he failed to do so, resulting in Yashasvi Jaiswal being run out.💔😭 pic.twitter.com/9b5csGWbqD
— CricSachin (@Sachin_Gandhi7) October 11, 2025