జమ్మూ కాశ్మీర్లో జరిగిన ప్రమాదంలో ఏపీకి చెందిన ముగ్గురు జవాన్లు వీరమరణం పొందారు. లద్దాఖ్ లో నది దాటుతూ యుద్దట్యాంక్ కొట్టుకుపోయిన ఘటనలో ప్రాణాలు కోల్పోయారు.
భారత సైన్యం చరిత్రలో తొలిసారిగా అద్భుత ఘట్టం చోటుచేసుకుంది. ఇద్దరు మిత్రులు ఆర్మీ, నేవీకి చీఫ్ లుగా నియమితులయ్యారు. లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది.. అడ్మిరల్ దినేష్ త్రిపాఠి అనే ఇద్దరు సహవిద్యార్థులు భారత సైన్యం నావికాదళానికి చీఫ్‌లుగా నియమితులయ్యారు.
Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్‌లో మరోసారి ఎన్‌కౌంటర్ చోటు చేసుకుంది. ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య బుధవారం ఉదయం కాల్పులు చోటు చేసుకున్నాయి. దోడా జిల్లాలోని అటవీ ప్రాంతంలో ఎన్‌కౌంటర్ జరిగింది.
Next Army Chief: డిప్యూటీ ఆర్మీ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది కొత్త ఆర్మీ చీఫ్‌గా నియమితులయ్యారు. అతను జనరల్ మనోజ్ పాండే స్థానంలో నియమితులు కానున్నారు.
దేశ సరిహద్దుల్లో ఉగ్రవాదులు తరచూ దాడులకు దిగుతున్నారు. జమ్మూ కశ్మీర్‌లోని దోడాలో గల ఆర్మీ పోస్ట్‌పై మంగళవారం అర్థరాత్రి ఉగ్రమూకలు దాడి చేశాయి. ప్రస్తుతం ఉగ్రవాదులు, భద్రతా సిబ్బంది మధ్య ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయని పోలీసులు చెప్పారు.
అటవీ నిర్మూలనను ఎదుర్కోవడానికి అలాగే స్థానిక పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు అసోం లోని సోనిత్ పూర్ జిల్లాలో భారత సైన్యం లోని ఎకోలాజికల్ టాస్క్ ఫోర్స్ (ETF) యూనిట్ బుధవారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా దాదాపు 5 వేల చెట్లను నాటినట్లు అధికారులు బుధవారం తెలిపారు. ఎకోలాజికల్ టాస్క్ ఫోర్స్ అనేది టెరిటోరియల్ ఆర్మీ (TA) కింద వస్తుంది. ఇది ప్రకృతి వైపరీత్యాలు, జాతీయ అలాగే ప్రాంతీయ అత్యవసర పరిస్థితుల్లో భారత సాయుధ దళాలు, పౌర…
సైన్యంలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు శుభవార్త. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) అనేక గ్రూప్ B, గ్రూప్ C పోస్టుల కోసం రిక్రూట్మెంట్ను ప్రకటించింది. BSF ఈ రిక్రూట్మెంట్ కోసం 10th, 12th పాస్ అభ్యర్థుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానించింది.
Kanhaiya Kumar: ఇండియా కూటమి తరుపున కాంగ్రెస్ అభ్యర్థిగా కన్హయ్య కుమార్ ఈశాన్య ఢిల్లీ నుంచి పోటీ చేస్తున్నారు. శుక్రవారం కన్హయ్య ప్రచారం చేస్తుండగా, ఒక వ్యక్తి పూలమాల వేయడానికి దగ్గరగా వచ్చి అతని చెంపపై కొట్టాడు.
భారత సైన్యం మరోసారి ఉగ్రవాదుల చొరబాటు యత్రాన్ని భంగం చేసింది. ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టింది. జమ్మూకశ్మీర్‌లో గురువారం ఉదయం ఎన్‌కౌంటర్ జరిగింది. కుప్వారా జిల్లాలో నియంత్రణ రేఖవెంబడి భారత్లోకి చొరబడేందుకు యత్నించిన వారిపై భారత సైన్యం కాల్పులు జరిపింది.