Kanhaiya Kumar: ఇండియా కూటమి తరుపున కాంగ్రెస్ అభ్యర్థిగా కన్హయ్య కుమార్ ఈశాన్య ఢిల్లీ నుంచి పోటీ చేస్తున్నారు. శుక్రవారం కన్హయ్య ప్రచారం చేస్తుండగా, ఒక వ్యక్తి పూలమాల వేయడానికి దగ్గరగా వచ్చి అతని చెంపపై కొట్టాడు.
భారత సైన్యం మరోసారి ఉగ్రవాదుల చొరబాటు యత్రాన్ని భంగం చేసింది. ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టింది. జమ్మూకశ్మీర్‌లో గురువారం ఉదయం ఎన్‌కౌంటర్ జరిగింది. కుప్వారా జిల్లాలో నియంత్రణ రేఖవెంబడి భారత్‌లోకి చొరబడేందుకు యత్నించిన వారిపై భారత సైన్యం కాల్పులు జరిపింది.
Jammu Kahmir: జమ్మూ కాశ్మీర్‌లో భద్రతా బలగాలకు కీలక విజయం లభించింది. నిషేధిత లష్కరే తోయిబా అనుబంధంగా ఉన్న ది రెసిస్టెంట్ ఫ్రంట్(టీఆర్ఎఫ్) ఉగ్రసంస్థకు చెందిన ముగ్గురు ఉగ్రవాదుల్ని భద్రతా బలగాలు హతమార్చాయి.
జవాన్లంటే బార్డరులో కాపలా కాస్తూ దేశాన్ని రక్షించే రక్షకులు మాత్రమే కాదు.. దేశ ప్రజలకు ఎలాంటి కష్టం వచ్చిన సాయం చేసే సేవకులమని నిరుపించుకున్నారు. భారత జవాన్లు మరోసారి మానవత్వం చాటుకున్నారు.
Rajnath Singh : దేశ రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సోమవారం సియాచిన్‌ను సందర్శించనున్నారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధభూమిలో మోహరించిన సైనికులతో సంభాషించనున్నారు.
డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) దేశీయంగా రూపొందించిన మ్యాన్-పోర్టబుల్ యాంటీ-ట్యాంక్ గైడెడ్ మిస్సైల్ (MPATGM) ఆయుధ వ్యవస్థ యొక్క అభివృద్ధి పరీక్షలను విజయవంతంగా పూర్తి చేసింది. మ్యాన్-పోర్టబుల్ యాంటీ-ట్యాంక్ గైడెడ్ మిస్సైల్ వ్యవస్థలో క్షిపణి, లాంచర్, టార్గెటింగ్ సిస్టమ్ మరియు ఫైర్ కంట్రోల్ యూనిట్ ఉన్నాయి. ఇది వివిధ పరిస్థితులలో దాని ప్రభావాన్ని నిరూపించడానికి అనేక పరీక్షలు చేయబది. ఈ పరీక్షలు భారత సైన్యం నిర్దేశించిన అవసరాలను తీర్చాయి. Also Read: Solo Boy:…
భారత సైన్యంలో అధికారుల కొరతను తీర్చేందుకు కొత్త సర్వీస్ సెలక్షన్ బోర్డులు (ఎస్‌ఎస్‌బీ) తెరవనున్నారు. భారత సైన్యం దీనిపై కసరత్తు చేస్తోంది ఈ ఏడాది చివరి నాటికి 3 కొత్త సర్వీస్ సెలక్షన్ బోర్డులను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. మొత్తంగా ప్రస్తుతం 12 బోర్డులు ఉన్నాయి, అది కాస్తా త్వరలో 15 అవుతుంది.
అపాచీ గర్జనకు శత్రువులు వణికిపోతారు, సైన్యం బలం పెరుగుతుంది. పాకిస్థాన్ సరిహద్దు సమీపంలో అపాచీ హెలికాప్టర్ల తొలి స్క్వాడ్రన్ రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో భారత ఆర్మీ ఏర్పాటు చేసింది. పశ్చిమ ప్రాంతంలో భూసేకరణ చేసేందుకు స్క్వాడ్రన్ సహకరిస్తుందని అధికారులు తెలిపారు.
China: మాల్దీవుల సార్వభౌమాధికారాన్ని కాపాడుకోవడంలో తాము మద్దతు ఇస్తున్నామని చైనా మంగళవారం ప్రకటించింది. ఫస్ట్ బ్యాచ్ భారత సైనిక సిబ్బంది మాల్దీవులను విడిచిపెట్టింది. వారి స్థానంలో పౌరసిబ్బందిని నియమించింది. హెలికాప్టర్ సేవల్ని నిర్వహిస్తున్న భారత సైన్యం దేశాన్ని విడిచిపెట్టినట్లు మాల్దీవుల మీడియా సోమవారం తెలిపింది.