Agniveer: రాహుల్ గాంధీ వాదన తప్పు.. అగ్నివీర్‌పై ఆర్మీ కీలక ప్రకటన..
- అగ్నివీరులకు పరిహారం అందడం లేదన్న రాహుల్ గాంధీ..
- కోటికి పైగా పరిహారం అందిస్తున్నామని ఆర్మీ కీలక ప్రకటన..
- కాంగ్రెస్ నేత ఆరోపణలపై రాజ్‌నాథ్ సింగ్ ఆగ్రహం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Agniveer: అగ్నివీరులకు ఇచ్చే పరిహారంపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. విధి నిర్వహణలో మరణించిన అగ్నివీర్ అజయ్ కుమార్ కుటుంబానికి కేంద్రం ఎలాంటి పరిహారం ఇవ్వలేదని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. అయితే, దీనిని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తోసిపుచ్చారు. విధి నిర్వహణలో మరణించిన అగ్నివీర్ అజయ్‌కుమార్ కుటుంబానికి రూ.98 లక్షలు పరిహారంగా చెల్లించినట్లు భారత సైన్యం బుధవారం ప్రకటించింది. అజయ్ కుమార్ కుటుంబానికి ఎలాంటి పరిహారం అందలేదని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ సోషల్ మీడియాలో పేర్కొన్న నేపథ్యంలో ఆర్మీ ఈ ప్రకటన చేసింది.
‘‘విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అగ్నివీర్ అజయ్ కుమార్ బంధువులకు ఎలాంటి పరిహారం చెల్లించలేదని సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు వచ్చాయి. చెల్లించాల్సిన మొత్తంలో ఇప్పటికే రూ. 98.39 లక్షలు చెల్లించారు’’ అని ఆర్మీ ఒక ప్రకటనలో పేర్కొంది. ‘‘అగ్నివీర్ స్కీమ్ నిబంధనల ప్రకారం వర్తించే విధంగా సుమారు 67 లక్షల ఎక్స్-గ్రేషియా మరియు ఇతర ప్రయోజనాలు, పోలీసు వెరిఫికేషన్ తర్వాత త్వరలో తుది ఖాతా సెటిల్‌మెంట్‌పై చెల్లించబడతాయి. మొత్తం సుమారుగా రూ.1.65 కోట్ల పరిహారం అందిచబడుతుంది’’ అని చెప్పింది.
Also Read
- CJP: కాక్రోచ్‌లంతా అస్సామేనా..? రాంకా అరెస్ట్.. దీప్కే కూడా అరెస్ట్ చేస్తారా?
- LNG Train: రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. దేశంలో తొలి LNG రైలుకు గ్రీన్ సిగ్నల్..
- Bank Strike: సెప్టెంబర్ 28 నుంచి మూడు రోజుల బ్యాంక్ సమ్మె.. కారణం ఇదే
- Parvesh Verma Slap Row: ఆప్ ఎమ్మెల్యేతో వాగ్వాదం.. యువకుడిని కొట్టిన ఢిల్లీ మంత్రి..
Read Also: Hemant Soren : జూలై 7న సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్న హేమంత్ సోరేన్.. మంత్రివర్గంలో మార్పు
అగ్నివీరులతో సహా మరణించిన ప్రతీ సైనికుడి కుటుంబానికి త్వరిగతిన పరిహారం చెల్లించబడుతుందని ఆర్మీ నొక్కి చెప్పింది. అగ్నివీర్ అజయ్ కుమార్ కుటుంబానికి చెల్లించిన పరిహారం విషయంలో రాజ్‌నాథ్ సింగ్ అబద్ధం చెప్పారని రాహుల్ గాంధీ తన ఎక్స్ పోస్టులో ఆరోపించిన కొద్ది సేపటికే ఆర్మీ నుంచి ఈ ప్రకటన వచ్చింది. సోమవారం లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ప్రభుత్వం అగ్నివీరులను యూజ్ అండ్ త్రో కార్మికులుగా పరిగణిస్తోందని, వారికి అమరవీరుల హోదా ఇవ్వడం లేదని ఆరోపించారు. అయితే, రాహుల్ వ్యాఖ్యలపై స్పందించిన రక్షణ శాఖ మంత్రి అతను పార్లమెంట్‌ని తప్పుదోవ పట్టిస్తున్నారని, విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అగ్నివీరుడికి కోటి రూపాయల పరిహారం అందుతుందని పేర్కొన్నారు.
జూన్ 14, 2022న ప్రకటించబడిన అగ్నిపథ్ పథకం, 17 మరియు 21 సంవత్సరాల వయస్సు గల యువకులను కేవలం నాలుగు సంవత్సరాలకు మాత్రమే రిక్రూట్‌మెంట్ చేసుకుంటారు, వారిలో 25 శాతం మందిని మరో 15 సంవత్సరాల పాటు సైన్యంలో ఉంచుకునే నిబంధన ఉంది. ఆ ఏడాది తర్వాత ప్రభుత్వం గరిష్ట వయోపరిమితిని 23 ఏళ్లకు పొడిగించింది.
सत्य की रक्षा हर धर्म का आधार है!
लेकिन रक्षा मंत्री राजनाथ सिंह ने शहीद अग्निवीर के परिवार को सहायता मिलने के बारे में संसद में झूठ बोला।
उनके झूठ पर शहीद अग्निवीर अजय सिंह के पिता जी ने खुद सच्चाई बताई है।
रक्षा मंत्री को संसद, देश, सेना और शहीद अग्निवीर अजय सिंह जी के… pic.twitter.com/H2odxpfyOO
— Rahul Gandhi (@RahulGandhi) July 3, 2024
*CLARIFICATION ON EMOLUMENTS TO AGNIVEER AJAY KUMAR*
Certain posts on Social Media have brought out that compensation hasn't been paid to the Next of Kin of Agniveer Ajay Kumar who lost his life in the line of duty.
It is emphasised that the Indian Army salutes the supreme… pic.twitter.com/yMl9QhIbGM
— ADG PI – INDIAN ARMY (@adgpi) July 3, 2024
తాజావార్తలు
-
BAR Tender: తెలంగాణలో 41 కొత్త బార్లు.. దరఖాస్తులకు నోటిఫికేషన్
-
Shai Hope: మమ్మల్ని దారుణంగా ముంచేశారు.. ఇలా ఆడతారని అస్సలు ఊహించలేదు: వెస్టిండీస్ కెప్టెన్
-
Nani: “18 ఏళ్ల కెరీర్.. 33 సినిమాలు.. ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు” ది ప్యారడైజ్ టాక్‌పై నాని ఓపెన్ రియాక్షన్!
-
Ind Vs WI: కోహ్లీ, గిల్ మానియా.. 295 రన్స్ ఉఫ్.. భారత్ ఘన విజయం..
-
LPU Students Protest: పంజాబ్ LPUలో ఆరని మంటలు.. స్టూడెంట్స్, పోలీసుల మధ్య ఉద్రిక్తత..
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?