జమ్మూ కాశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో రెండు వేర్వేరు ప్రదేశాల్లో పాకిస్థానీ క్వాడ్‌కాప్టర్లను నేలకూల్చేందుకు శుక్రవారం నియంత్రణ రేఖ (ఎల్‌ఓసి) వద్ద కాపలాగా ఉన్న ఆర్మీ దళాలు కాల్పులు జరిపినట్లు అధికారులు తెలిపారు.
ఎన్నో ఏళ్ల కల అయోధ్య రామమందిర నిర్మాణం సాకారమైంది. సోమవారం ప్రధాని మోడీ ముఖ్య అతిథిగా రామ్ లల్లా ప్రాణప్రతిష్ట చేశారు. కాగా.. ఈ మహోత్సవాన్ని చూసేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు వేయి కళ్లతో ఎదురుచూశారు. అంతేకాకుండా.. ప్రాణప్రతిష్ట జరగగానే రామభక్తులు సంబరాలు జరుపుకున్నారు. ఈ క్రమంలోనే చైనా సైనికులు 'జై శ్రీరామ్.. జై శ్రీరామ్' అంటూ నినాదాలు చేశారు. వాస్తవాధీన రేఖ వద్ద భారత సైనికులతో పాటు చైనా సైనికులు కూడా జైశ్రీరామ్ అంటూ నినాదాలు…
Military Strength Ranking: ప్రపంచంలోనే అత్యంత శక్తి వంతమైన మిలిటరీ కలిగి ఉన్న దేశంగా అమెరికా తొలిస్థానంలో నిలిచింది. రష్యా, చైనాలు వరసగా రెండూ, మూడు స్థానాల్లో ఉన్నాయి. భారత్ 4వ స్థానంలో నిలిచింది. ప్రపంచ రక్షణ సమాచారాన్ని ట్రాక్ చేసే వెబ్‌సైట్ గ్లోబల్ ఫైర్‌పవర్ 2024కి గానూ
Operation Sarvashakti: జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని తిప్పికొట్టేందుకు ఇండియన్ ఆర్మీ సిద్ధమైంది. లోయలో మళ్లీ ఉగ్రవాదాన్ని పెంచేందుకు ఇటీవల పూంచ్, రాజౌరీ ప్రాంతాల్లో టెర్రరిస్టులు దాడులకు పాల్పడుతున్నారు. పిర్ పంజాల్ పర్వతాలను, అక్కడి అడవుల్లో దాక్కుంటూ భద్రతా సిబ్బందికి సవాల్ విసురుతున్నారు. ఈ ప్రాంతంలోని గుహలు, కొండలు, అడవులు ఉగ్రవాదులకు స్వర్గధామంగా మారడంతో వారిని ఏరేసేందుకు చేస్తున్న ఆపరేషన్లు కష్టంగా మారాయి. ఇటీవల జరిగిన ఉగ్రదాడుల్లో అధికారులతో సహా జవాన్లు 20 మంది…
జమ్మూ కాశ్మీర్‌లో సైన్యంపై ఉగ్రవాదులు చైనా తయారు చేసిన ఆయుధాలు, కమ్యూనికేషన్ పరికరాలను ఉపయోగిస్తున్నారని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇంటెలిజెన్స్ ఏజెన్సీ వర్గాల ప్రకారం.. జైషే మహమ్మద్, లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థలు సైన్యంపై దాడి చేయడానికి చైనా ఆయుధాలు, బాడీసూట్ కెమెరాలు, కమ్యూనికేషన్ పరికరాలను ఉపయోగిస్తున్నాయి.
Pakistan: దాయాది దేశం పాకిస్తాన్, భారత్‌లో అలజడి రేపేందుకు ప్రయత్నిస్తూనే ఉంది. ముఖ్యంగా జమ్మూకాశ్మీర్‌లో ఉన్న శాంతి పరిస్థితులు పాకిస్తాన్‌కి నచ్చడం లేదు. కాశ్మీర్‌లో దాడులు చేసేందుకు పాక్ స్పాన్సర్డ్ ఉగ్రవాదుల్ని నియంత్రణ రేఖ దాటించి భారత్‌లోకి పంపేందుకు ప్రయత్నిస్తోంది. అయితే గత రాత్రి నలుగురు ఉగ్రవాదుల్ని, భారత్ లోకి ప్రవేశపెట్టేందుకు పాకిస్తాన్ ఆర్మీ తీవ్రంగా ప్రయత్నించింది.
Vijay Diwas: పాకిస్తాన్ నుంచి తూర్పు పాకిస్తాన్(ఇప్పటి బంగ్లాదేశ్)కి విముక్తి కల్పించడం కోసం భారత్ 1971లో యుద్ధం చేయాల్సి వచ్చింది. తూర్పు పాకిస్తాన్లో ఏకంగా 90,000 మంది సైనికులు భారత్ ముందు లొంగిపోయారు. ఇందిరా గాంధీ ఉక్కు సంకల్పంతో బంగ్లాదేశ్ ఏర్పడింది. భారత్‌పై పాశ్చాత్యదేశాలు, అమెరికాలు ఒత్తిడి తీసుకువచ్చేందుకు ప్రయత్నించినా.. రష్యా భారత్‌కి అండగా నిలిచింది. 90 వేల మంది పాక్ సైనికులు భారత్ ముందు మోకరిల్లిన ఈరోజున భారత్ ‘విజయ్ దివాస్’ జరుపుకుంటుంది. యాభై రెండు…
Spying: పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ, ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్(ఐఎస్ఐ) కోసం గూఢచర్యం చేస్తున్నట్లు అనుమానిస్తున్న ఇద్దరు వ్యక్తులను ఉత్తర్ ప్రదేశ్ యాంటీ టెర్రరిజం స్వ్కాడ్(ఏటీఎస్) అరెస్ట్ చేసినట్లు ఆదివారం ప్రకటించారు. ఇద్దరు వ్యక్తులు టెర్రర్ ఫైనాన్సింగ్‌కి పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో పంజాబ్‌లోని భటిండాకు చెందిన అమృత్ గిల్ అలియాస్ అమృత్ పాల్ (25), ఘజియాబాద్‌లోని భోజ్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫరీద్‌నగర్‌లో నివసిస్తున్న రియాజుద్దీన్ (36)లను ATS అరెస్టు చేసింది.
Indian Army: జమ్మూ కాశ్మీర్‌లోకి విదేశీ ఉగ్రవాదులను పంపించేందుకు పాకిస్తాన్ ప్రయత్నిస్తోందని ఇండియన్ ఆర్మీ వెల్లడించింది. రాజౌరీ ఎన్కౌంటర్లో మరణించిన ఐదుగురు ఆర్మీ అధికారులకు ఉత్తర ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది శుక్రవారం శ్రద్ధాంజలి ఘటించారు. గత రెండు రోజులుగా జరిగిన ఎన్కౌంటర్లో లష్కరేతోయిబా టాప్ కమాండర్ కారీతో పాటు మరో ఉగ్రవాదిని భద్రతాబలగాలు హతమార్చాయి.
Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్ రాజౌరీలో బుధవారం ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య ఎన్కౌంటర్ ప్రారంభమైంది. గత 24 గంటలుగా ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఈ ఎన్కౌంటర్లో ఇద్దరు ఆర్మీ అధికారులతో పాటు ముగ్గురు సైనికులు మొత్తంగా ఐదుగురు వీరమరణం పొందారు. గురువారం కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ మరణించిన వారి ఫోటోలు పేర్లను ఎక్స్(ట్విట్టర్) ద్వారా వెల్లడించారు.