Bactrian Camel: ఎత్తైన పర్వత ప్రాంతాలలో ఏ సమయాన పరిస్థితి ఎలా మారిపోతుందో చెప్పలేము. దాంతో అక్కడ పనిచేస్తున్న సైనికులకు సరైన సదుపాయాలూ కల్పించలేని దుస్థితి ఉంది. ఈ పరిస్థితుల మధ్య సరిహద్దుల్లో పహరా కాసేందుకు, అలాగే అవసరమైన సామగ్రిని తీసుకెళ్ళేందుకు ప్రత్యామ్నాయ మార్గాలపై మిలటరీ బలగాలు దృష్టి సారించాయి. ఇందులో భాగంగా ఇప్పుడు రెండు మూపురాల (Bactrian) ఒంటెలను రంగంలోకి తీసుకొచ్చారు. వీటిని ముక్యముగా బందోబస్తుకు ఉపయోగపడేలా, అలాగే బరువులు మోసేందుకు సహకరించేలా లేహ్ లోని డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హై ఆల్టి ట్యూడ్ రీసెర్చ్ (DIHAR) ఈ ఒంటెలకు ఇస్తున్న శిక్షణ సత్ఫలితానిస్తోందని అధికారులు తెలిపారు.
Effect of Inflation : ఆకాశాన్నంటుతున్న బంగాళాదుంపలు, ఉల్లిపాయలు, టమోటాల ధరలు
ఇకపోతే, ప్రస్తుతం లద్దాజ్ లో రోడ్డు సౌకర్యాలు బాగా మెరుగుపడినప్పటికీ.. పర్వతాల్లోని మారు మూల ప్రాంతాలను చేరుకునేందుకు ఇప్పటికీ మనుషులు, జన్స్కర్ వంటి గుర్రాల పై ఆధార పడాల్సిన పరిస్థితి. అయితే ఆ ప్రాంతంలో డ్రోన్లు, అల్ టెరైన్ వాహనాల వంటివాటిని ఉపయోగించాలంటే.. అక్కడి వాతావరణం పర్యావరణ అంశాలు, భూభా గాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఇకపోతే., లాద్దాబ్ సెక్టార్లో సామగ్రి చేరవేతకు 1999 కార్గిల్ యుద్ధం సమయం నుండి జన్స్కర్లను బాగా ఉపయోగించారు. వీటి కోసం చైనా సరిహద్దున తూర్పు లద్ధాఖ్ బాక్ట్రియన్ ఒంటెలతో నిర్వహించిన ప్రాథమిక పరీక్షలు జరిగాయి. ముక్యంగా పెట్రోలింగ్, బరువులు మోయడం లాంటి పనుల కోసం బాక్ట్రియన్ ఒంటెల పై ట్రయల్స్ చేయగా సత్ఫలితాలు వచ్చాయని అధికారులు తెలిపారు.
Bengaluru North University: కాలేజీ పోర్టల్ హ్యాక్.. 60 మంది విద్యార్థుల మార్కులు తారుమారు
బాక్ట్రియన్ ఒంటెలు ఎంతో దృఢంగా ఉంటాయి. ఇవి ఎత్తైన ప్రాంతాల్లో జీవించగల శక్తిని కలిగి ఉంది. ఇవి ఏకంగా రెండు వారాల పాటు ఆహారం తీసుకోకుండా జీవించగలవు. అలాగే సులభంగా 150 కిలోలకు పైగా బరువును మోయగలవు. అతిశీతల ఉష్ణోగ్రతలను తట్టుకోగలవు.