కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ సింగ్ స్పందించారు. ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ పెట్టారు.. భారతదేశం ఈ ప్రతీకార చర్యల్లో పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్‌లోని 9 ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది అన్నారు. ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్‌లోని ఏ సైనిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకోలేదు అన్నారు.
సరిహద్దు నియంత్రణ రేఖ (LOC) వెంట పాక్ ఆర్మీ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో.. ఈ ఘటనలో ముగ్గురు భారతీయ పౌరులు మృతి చెందారు.
ఇండియన్ ఆర్మీ మెరుపు దాడులపై పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ రియాక్ట్ అయ్యారు. తమ దేశంలోని 5 ప్రాంతాల్లో దాడులు జరిగినట్లు పేర్కొన్నారు. ఈ చర్యలకు పాకిస్థాన్ కచ్చితంగా బదులు తీర్చుకుంటుందని వెల్లడించారు.
India PakistanTensions: భారత్- పాకిస్తాన్ సరిహద్దులో తీవ్ర ఉద్రిక్తత కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఆపరేషన్ సింధూర్ను ఇండియన్ ఆర్మీ ప్రారంభించింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో దాయాది దేశంలోని 9 ఉగ్రవాద శిబిరాలపై భారత సైన్యం దాడులకు దిగింది.
Pakistan: జమ్ము కాశ్మీర్ లోని పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్-పాకిస్తాన్ మధ్య టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ దాడిపై ప్రతీకారం తీర్చుకుంటామని ఇప్పటికే ఇండియా ప్రకటించింది. ఈ క్రమంలో దాయాది దేశం కవ్వింపు చర్యలకు దిగుతుంది.
జమ్మూ కాశ్మీర్‌లోని రాంబన్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. భారత ఆర్మీ వాహనం లోయలో పడిపోయింది. 700 అడుగుల లోతైన లోయలో ఆర్మీ కాన్వాయ్ లోని వాహనం పడింది. జమ్ము నుంచి శ్రీనగర్ వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు సైనికులు మృతిచెందారు. మరణించిన సైనికులను అమిత్ కుమార్, సుజీత్ కుమార్, మాన్ బహదూర్ గా గుర్తించినట్లు వార్తా సంస్థ పిటిఐ తెలిపింది. Also Read:Virat Kohli: కోహ్లీ ఖాతాలో మరో రికార్డు.. ‘గోట్’…
India Pak War: పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పాక్ నేతలు భారత్ ఏ చర్య తీసుకున్నా, తమ ఆర్మీ ధీటైన జవాబు ఇస్తుందని బీరాలు పలుకుతున్నారు. తమ వద్ద అణ్వాస్త్రాలు ఉన్నాయని భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అయితే, బలహీనతల్ని కప్పిపుచ్చుకునేందుకు పాకిస్తాన్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తోంది. నిజానికి భారత సైన్యం ముందు నిలబడే దమ్ము లేదని విషయాలు ప్రస్తుతం వెలుగులోకి వస్తున్నాయి.
జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్ లో జరిగిన ఉగ్రవాద దాడికి సంబంధించి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైన విషయం తెలిసిందే. జ్యుడీషియల్ విచారణకు ఆదేశించాలని కోరుతూ పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు పిటిషనర్‌ను మందలించింది. పిటిషనర్ తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పిటిషన్ వేసేముందు బాధ్యతగా వ్యవహరించాలని సుప్రీం కోర్టు హెచ్చరించింది. దేశంపై బాధ్యత లేదా అంటూ పిటిషనర్‌ను ప్రశ్నించింది. బలగాల మనోస్థైర్యాన్ని దెబ్బతీస్తారా అని అసహనం వ్యక్తం చేసింది. Also Read:Payal :…
Shahid Afridi: షాహిద్ అఫ్రీది..క్రికెట్ ప్రపంచంలో ఈ పేరు తెలియనివారు ఉండరు. మన దాయాది దేశమైన పాకిస్తాన్‌కి చాలా ఏళ్లు క్రికెట్ ఆడాడు. అయితే, పలు సందర్భాల్లో భారత్ అన్నా, హిందువులు అన్నా ద్వేష భావం అతడిలో కనిపిస్తుంటుంది. తాజాగా, పహల్గామ్ దాడి నేపథ్యంలో భారత సైన్యంపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పాటు ఉగ్రవాదాన్ని సమర్థించాడు. ఈ నేపథ్యంలో అతడి యూట్యూబ్ ఛానెల్‌ని కేంద్రం బ్యాన్ చేసింది.