India vs Pak : ఆపరేషన్ సిందూర్ అనంతరం భారత-పాకిస్తాన్ నియంత్రణ రేఖ (LoC) వద్ద పరిస్థితి తీవ్రంగా మారింది. పాకిస్తాన్ సైన్యం కాల్పులకు తెగబడ్డ విషయం అధికారికంగా భారత సైన్యం ధృవీకరించింది. ఈ కాల్పుల్లో భారత జవాన్ దినేష్ కుమార్ వీరమరణం పొందారు. దినేష్ కుమార్ మృతిపై వైట్ నైట్ కార్ప్స్ సంతాపం తెలియజేసింది. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపింది. ఇదే కాల్పుల్లో సరిహద్దు గ్రామాల్లో నివసిస్తున్న 15 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు.…
జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఉగ్రవాద దాడి తర్వాత తాజాగా భారత్ ఆపరేషన్ సిందూర్ విజయవంతమైంది. ఈ నేపథ్యంలో జమ్మూకశ్మీర్‌లో భద్రతా చర్యలు కట్టుదిట్టం చేశారు. ఉగ్రవాదులను అంతమొందించడానికి భద్రతా దళాలు ప్రచారం నిర్వహిస్తున్నారు. ఉగ్రవాదులకు సహాయం చేస్తున్న వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటివరకు 100కు పైగా అనుమానిత ఉగ్రవాదులు, వారి అనుచరుల ఇళ్లల్లో తనిఖీలు చేసినట్లు పోలీసులు తెలిపారు. బుధవారం ఒక్కరోజే 30కి పైగా ప్రాంతాల్లో సోదాలు చేసినట్లు చెప్పారు.
Ponnam Prabhakar: నేడు ఉదయం పాకిస్తాన్ పై భారత్ చేసిన ‘ఆపరేషన్ సింధూరం’ విజయం కావడంతో దేశమంతటా విజయోత్సవ సంబరాలు కొనసాగుతున్నాయి. ఇక ఈ “ఆపరేషన్ సింధూర్” విజయవంతంపై హుస్నాబాద్ నియోజకవర్గం కొహెడలో మంత్రి పొన్నం ప్రభాకర్ సంబరాల్లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన హర్షం వ్యక్తం చేసారు. భారత్ మాత కి జై అంటూ నినాదాలు చేస్తూ సంబరాల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన వ్యాఖ్యానిస్తూ.. జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్…
కశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారతదేశం "ఆపరేషన్ సిందూర్" నిర్వహించింది. పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని, భారత వైమానిక దళం, భారత సైన్యం, నావికాదళం సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహించాయి. ఈ దాడిలో క్షిపణులు ప్రయోగించారు. ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేశారు.
Terror Sites: జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడికి భారత సైన్యం ప్రతీకారం తీర్చుకుంది. ప్రధాని మోడీ వార్నింగ్ ఇచ్చినట్టుగానే ఉగ్రస్థావరాల లెక్కలు తీసి మరీ టార్గెట్ చేసి భారత్ దాడులు చేసింది.
కల్నల్ సోఫియా ఖురేషి ఆపరేషన్ సింధూర్ గురించి మాట్లాడుతూ.. మే 6, 7 తేదీలలో భారత సైన్యం జైషే, హిజ్బుల్ స్థావరాలను ఎలా ధ్వంసం చేసిందో ఆయన వివరించారు. గత మూడు దశాబ్దాలుగా పాకిస్తాన్‌లో ఉగ్రవాదులను సృష్టిస్తున్నారని కల్నల్ సోఫియా అన్నారు. పాకిస్తాన్, పీఓకేలలో తొమ్మిది లక్ష్యాలను గుర్తించి ధ్వంసం చేసాము. లాంచ్‌ప్యాడ్‌లు, శిక్షణా కేంద్రాలను లక్ష్యంగా దాడులు జరిపామని అన్నారు. 25 నిమిషాల పాటు ఆపరేషన్ సింధూర్ జరిగింది.. Also Read:Vikram Misri: పాక్ ప్రపంచాన్ని…
జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత, భారత సైన్యం నిన్న రాత్రి పాకిస్తాన్‌కు గట్టి గుణపాఠం నేర్పింది. ఉగ్రవాదులకు నిలయంగా మారిన పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే)లోని తొమ్మిది ఉగ్రవాద శిబిరాలపై సైన్యం దాడి చేసింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో సైన్యం నిర్వహిస్తున్న ఈ ఆపరేషన్ గురించి విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ వెల్లడించారు. విదేశాంగ కార్యదర్శి మిస్రీ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. అర్థరాత్రి 1. 05 నుంచి 1. 30 మధ్య ఆపరేషన్…
మొత్తం ఆపరేషన్ ను భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. రాత్రంతా వార్ రూమ్ నుంచి పర్యవేక్షించారు. భారత ఆర్మీకి సపోర్టుగా నిలిచారు. ఇక, ఉగ్రవాద శిబిరాలపై దాడుల వివరాలను భారత ఉన్నతాధికారులు ప్రపంచ దేశాలకు తెలియజేశారు.
80 Terrorists Killed: పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంతో భారత్ తీర్చుకుంది. బుధవారం తెల్లవారుజామున పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే)లోని ఉగ్రవాద శిబిరాలపై భారత సాయుధ దళాలు నిర్వహించిన వరుస దాడుల్లో సుమారు 80 మందికి పైగా టెర్రరిస్టులు మరణించారని భద్రతా దళాలు తెలిపాయి.
Operation Sindoor: పహల్గాం ఉగ్ర దాడికి ప్రతీకారంతో రగిలిపోయిన భారతదేశం మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత పాక్‌పై ఎయిర్ స్ట్రైక్స్ తో విరుచుకుపడింది. 9 ఉగ్ర స్థావరాలపై ‘ఆపరేషన్ సింధూర్’ విజయవంతంగా చేపట్టినట్లు ఇండియన్ సైన్యం ప్రకటించింది.