PM Modi Diwali 2025: దేశ వ్యాప్తంగా దీపావళి సంబరాలు అంబరాన్ని తాకుతుండగా, గోవాలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నావికాదళ సిబ్బందితో 2025 దీపావళిని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాని గోవా నావికా స్థావరంలో నావికాదళ సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడుతూ.. “మీతో దీపావళి జరుపుకోవడం ఒక గౌరవం” అని అన్నారు. “ఒక వైపు నాకు సముద్రం ఉంది, మరోవైపు వీర సైనికుల అపారమైన బలం ఉంది. సముద్ర జలాలపై సూర్యకిరణాల ప్రకాశం, వీర సైనికులు వెలిగించిన…
Anil Chauhan: చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(సీడీఎస్) జనరల్ అనిల్ చౌహాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. నెపోటిజం(బంధుప్రీతి) లేని ఏకైక ప్రదేశం సైన్యం మాత్రమే అని చెప్పారు. దేశానికి సేవ చేయడానికి, వివిధ ప్రాంతాలను అన్వేషించడానికి సాయుధ దళాల్లో చేరాలని పిల్లలను కోరారు. రాంచీలోని పాఠశాల పిల్లలతో మాట్లాడిన ఆయన, ప్రకృతి వైపరీత్యాల సమయంలో ప్రజల్ని కాపాడేందుకు సాయుధ దళాలు ఈ ఏడాది చాలా ప్రయత్నాలు చేశాయని చెప్పారు. Read Also: Coffee: కాఫీ ప్రియులకు అలర్ట్..…
Operation Sindoor: కుటుంబ సభ్యుల్ని చంపితే ఎలా ఉంటుందో పాకిస్తాన్ ఉగ్రవాదులకు ఇప్పుడు తెలిసి వస్తోంది. పహల్గామ్‌లో అమాయకులైన 26 మందిని చంపి, వారి కుటుంబాల్లో తీరని వేధనను మిగిల్చిన ముష్కరులకు ‘‘ఆపరేషన్ సిందూర్’’తో భారత్ ధీటుగా బుద్ధి చెప్పింది. ఆపరేషన్ సిందూర్‌లో భారత్, పాకిస్తాన్‌లోని లష్కరే తోయిబా, జైషే మహ్మద్ ఉగ్రవాద ప్రధాన కార్యాలయాలపై దాడులు చేసింది. ఈ దాడుల్లో 100కు పైగా ఉగ్రవాదులు హతమయ్యారు.
Golden Shawl: రాజన్న సిరిసిల్ల జిల్లా చేనేత కళాకారుడు నల్ల విజయ్ కుమార్ తన ప్రత్యేక నైపుణ్యంతో మరోసారి దేశ ప్రజల దృష్టిని ఆకర్షించాడు. ఆపరేషన్ సింధూర్ విజయవంతం అయిన సందర్భంగా త్రివిధ దళాల (సైన్యం, నౌకాదళం, వాయుసేన) చిత్రాలను బంగారు శాలువాపై నేసి తన దేశభక్తిని చాటుకున్నాడు.
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్‌పై రక్షణ శాఖ చీఫ్, సీడీఎస్ జనరల్ అనిల్ చౌహాన్ శుక్రవారం కీలక వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ సిందూర్ ‘‘ఇప్పటికీ కొనసాగుతోంది’’ అని శుక్రవారం చెప్పారు. దేశ సైనిక సంసిద్ధత హై అలర్ట్‌లో ఉందని, 24 గంటలూ, ఏడాది పొడవునా ఉంటుందని చెప్పారు.
జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాం లో జరిగిన దారుణమైన ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైనిక దళాలు చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ విజయాన్ని పురస్కరించుకుని, హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద ఘనంగా తిరంగా ర్యాలీ నిర్వహించారు. సిటిజన్స్ ఫర్ నేషనల్ సెక్యూరిటీ ఫోరమ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీలో వేలాది మంది ప్రజలు, రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు పాల్గొని, భారత సైనికులకు సంఘీభావం తెలిపారు. Also Read: Jayam Ravi : జయం రవి కోసం రూ.100 కోట్లు…
Tiranga Yatra: భారత సైనిక దళాల ధైర్యసాహసాలను స్మరించుకుంటూ బీజేపీ పార్టీ మంగళవారం (మే 13) నుంచి దేశవ్యాప్తంగా ‘తిరంగా యాత్ర’ను ప్రారంభించనుంది. ఈ యాత్ర మే 13 నుంచి మే 23 వరకు 11 రోజుల పాటు కొనసాగనుంది. తాజాగా విజయవంతంగా ముగిసిన ‘ఆపరేషన్ సిందూర్’ నేపథ్యంలో ఈ యాత్ర మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇక నేడు సాయంత్రం 4 గంటలకు ఈ యాత్ర ప్రారంభం కానుంది. దేశభక్తి, ఐక్యత, సైనికుల సేవలకు గౌరవం తెలిపేలా…
'ఆపరేషన్ సిందూర్'పై బాలీవుడ్ సినిమా రాబోతోంది.. ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతిస్పందనగా భారత సైన్యం చేపట్టిన శక్తివంతమైన ప్రతీకార చర్య అయిన 'ఆపరేషన్ సిందూర్' ఆధారంగా ఈ బాలీవుడ్ చిత్రం రాబోతోంది. 'ఆపరేషన్ సిందూర్' పేరుతోనే అధికారికంగా ఈ సినిమాను ప్రకటించారు.. అంతేకాదు.. ఓ పవర్‌ఫుల్ పోస్టర్‌ను.. అంటే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను కూడా విడుదల చేశారు.
మే 6-7 రాత్రి.. ప్రపంచం మొత్తం నిద్రపోతోంది. భారత సైన్యం పాకిస్థాన్లోని ఉగ్రవాద స్థావరాలను నాశనం చేయడంలో బిజీగా ఉంది. 30 నిమిషాల ఆపరేషన్లో భారత సైన్యం 9 ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది. ఉదయం వరకు దీని గురించి ఎవరికీ అధికారిక సమాచారం లేదు. ఇంతలో ఈ ఘటనపై సైన్యం, విదేశాంగ శాఖ సంయుక్త విలేకరుల సమావేశంలో సమాచారం అందించారు. సుమారు 10.30 గంటలకు ఒక వ్యక్తి విలేకరుల సమావేశంలో కనిపించారు. ఆయనతో పాటు భారత…
ఆపరేషన్ సిందూర్ విజయం ప్రశంసనీయమని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. మన సాయుధ దళాలు నిన్న తీసుకున్న చర్యకు, వారు ప్రదర్శించిన ధైర్యం, పరాక్రమాన్ని తాను అభినందిస్తున్నట్లు తెలిపారు. ఓ కార్యక్రమంలో మాట్లాడిన రక్షణ మంత్రి పాకిస్థాన్, పీవోకేలోని ఉగ్రవాద శిబిరాలను మన దళాలు ధ్వంసం చేసిన విధానం మనందరికీ గర్వకారణమన్నారు. 'ఆపరేషన్ సిందూర్' ఖచ్చితత్వంతో నిర్వహించారన్నారు.