హైదరాబాద్‌లో మరో దారుణ సంఘటన చోటు చేసుకున్న విషయం తెలిసిందే. పహాడీ షరీఫ్ ప్రాంతంలో ఓ విదేశీ యువతిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారం చేసిన ఘటన కలకలం రేపుతోంది. ఈ ఘటనలో నిందితుడు క్యాబ్ డ్రైవర్‌గా పోలీసులు గుర్తించారు. సెలవుల కోసం ఇండియాకు వచ్చిన ఈ విదేశీ యువతి షాపింగ్ చేసేందుకు క్యాబ్ బుక్ చేసుకుంది. మీర్పేట్ పరిధిలోని ఫ్రెండ్ ఇంట్లో తాత్కాలికంగా ఉంటున్న ఆమె, తన ఫ్రెండ్ అయిన మరో విదేశీ యువకుడు, పిల్లలతో కలిసి…
నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్ అంతరిక్ష అనుభవాలు పంచుకున్నారు. వారం రోజుల అంతరిక్ష పర్యటనకు వెళ్లిన సునీతా.. సాంకేతిక లోపం కారణంగా దాదాపు 9 నెలలు స్పేస్‌లోనే ఉండిపోవల్సి వచ్చింది. ఎట్టకేలకు ఇటీవల పుడమిని ముద్దాడారు. తాజాగా బాహ్య ప్రపంచం ముందుకు వచ్చిన ఆమె.. అంతరిక్ష పర్యటన అనుభవాలు మీడియాతో పంచుకున్నారు.
భద్రతలో భాగమైన హెల్మెట్ ప్రతిఒక్కరు ధరించాల్సిందే. అయితే చాలామంది టూవీలర్ అయితే కొంటున్నారు. కానీ, హెల్మెట్ కొనేందుకు మాత్రం ఆలోచిస్తుంటారు. ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ కంపెనీలకు కీలక సూచన చేశాడు. దేశంలోని టూవీలర్ తయారీ సంస్థలు ఇక నుంచి తమ వాహనాలతో పాటు రెండు హెల్మెట్లను అందించడం తప్పనిసరి అని కేంద్ర రోడ్డు రవాణా అండ్ రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. వాహనాన్ని కొనుగోలు చేసేటపుడు రెండు హెల్మెట్స్ ను అందించాలని సూచించారు.…
April 1: ఏప్రిల్ 1 నుంచి కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. UPI, GST, పన్ను రేట్లలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. దేశవ్యాప్తంగా పౌరుల్ని ప్రభావితం చేస్తే ఆర్థిక మార్పులు అమలులోకి రానున్నాయి. పన్ను స్లాబుల మార్పుల నుంచి యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI), యూనిఫైడ్ పెన్షన్ పథకం ప్రారంభం వరకు మార్పులు చోటు చేసుకుంటున్నాయి. కొత్త పన్ను స్లాబులు, రేట్లు: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో వార్షిక బడ్జెట్లో కొత్త పన్ను స్లాబులు,…
మయన్మార్ అధికారులకు ప్రధాని మోడీ ఫోన్ చేశారు. ఈ సందర్భంగా శుక్రవారం సంభవించిన శక్తివంతమైన భూకంపంపై ఆరా తీశారు. అలాగే ప్రస్తుతం జరుగుతున్న సహాయ చర్యలపై కూడా వివరాలు అడిగి తెలుసుకున్నారు. మిలిటరీ సీనియర్ జనరల్ మిన్ ఆంగ్ హలాయింగ్‌తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.
Bird flu: భారతదేశంలో కోళ్ల ఫామ్స్, ఇంట్లో పెంచుకునే కోళ్లలో 8 ప్రాంతాల్లో వ్యాధికారక H5N1 బర్డ్ ఫ్లూ నమోదైనట్లు భారతీయ అధికారులను ఉటంకిస్తూ ప్రపంచ జంతు ఆరోగ్య సంస్థ శుక్రవారం తెలిపింది. సాధారణంగా బర్డ్ ఫ్లూ అని పిలిచే ఏవియన్ ఇన్ఫ్లూఎంజా వ్యాప్తిని ఇటీవల ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంతంలో గుర్తించినట్లు పారిస్‌కి చెందిన సంస్థ తన నివేదికలో తెలిపింది. దీని వల్ల 6,02,000 కోళ్లను చంపేసినట్లు చెప్పింది.
భారీ భూప్రకంపనలతో బ్యాంకాక్, మయన్మార్ వణికిపోయాయి. రిక్టర్ స్కేల్‌పై 7.7 తీవ్రతతో ప్రకంపనలు రావడంతో ప్రజలు బెంబేలెత్తిపోయారు. భయంతో జనాలు బయటకు పరుగులు తీశారు. పెద్ద పెద్ద బిల్డింగ్లు కూలిపోయాయి. అయితే ఈ ఘటనలో భారీగానే ప్రాణనష్టం జరిగి ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు భారీ భూకంపాలతో హడలెత్తిపోయాయి. ఈ ఉదయం బ్యాంకాక్, మయన్మార్‌లో పెద్ద ఎత్తున భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 7.7గా నమోదైంది. దీంతో భారీ అంతస్తుల బిల్డింగ్లు నేలకూలిపోయాయి. భయంతో జనాలు పరుగులు తీశారు.