ముంబై పేలుళ్ల నిందితుడు తహవూర్ రాణా(64)కు మరోసారి అమెరికా సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. భారత్‌కు అప్పగించొద్దంటూ అమెరికా సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. ఇప్పటికే పలుమార్లు పిటిషన్లు కొట్టేసింది. తాజాగా మరోసారి తహవూర్ రాణా పిటిషన్‌ను తిరస్కరించింది.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన సుంకాలు కారణంగా ప్రపంచ మార్కెట్లు కుదేల్ అయిపోయాయి. లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది. కోవిడ్ సమయంలో ఎదురైన భారీ పతనం.. మరోసారి ట్రంప్ టారిఫ్‌లు కారణంగా చవిచూశాయి. ఇక ట్రంప్‌నకు ధీటుగా చైనా కూడా సుంకాలు పెంచేసింది.
Saudi Arabia: హజ్ భద్రతా సమస్యల్ని దృష్టిలో పెట్టుకుని సౌదీ అరేబియా 14 దేశాలపై వీసా బ్యాన్ విధించింది. ఈ జాబితాలో భారత్, పాకిస్తాన్ కూడా ఉన్నాయి. ఈ ఏడాది హజ్ తీర్థయాత్ర ముగిసే జూన్ మధ్య వరకు ఈ నిషేధం ఉంటుంది. వీసా సస్పెన్షన్‌లో ఉమ్రా వీసాలతో పాటు వ్యాపార మరియు కుటుంబ సందర్శన వీసాలు కూడా ఉన్నాయి. సరైన రిజస్ట్రేషన్ లేకుండా హజ్ యాత్రకు వచ్చే వారిని నియంత్రించేందుకు సౌదీ అరేబియా ఈ దేశాలకు…
Trump Tax Effect On Prawns: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన ట్యాక్సులు సముద్రపు రొయ్యలపై పెద్దగా ప్రభావం చూపడం లేదు. బ్రౌన్ 400, టైగర్ 1000 - 1200, వైట్ రొయ్య 500 - 550 రూపాయల మధ్య ధర పలుకుతుంది.
PM Modi: తమిళనాడు రాష్ట్రంలోని రామనాథపురంలో పంబన్ బ్రిడ్జి ప్రారంభానికి సిద్ధమైంది. ఈరోజు (ఏప్రిల్ 6న) శ్రీ రామనవమి సందర్భంగా మధ్యాహ్నం 12.45 గంటలకు పంబన్ బ్రిడ్జిను ప్రారంభించి జాతికి అంకితం చేయనున్న మోడీ..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నట్టుగానే ఆయా దేశాలపై ప్రతీకార సుంకాలు విధించారు. వైట్‌హౌస్‌లోని రోజ్ గార్డెన్లో మీడియా సమావేశంలో సుంకాలు వెల్లడించారు. అర్ధరాత్రి నుంచే అమల్లోకి వస్తాయని స్పష్టం చేశారు.
Waqf Bill: చారిత్రాత్మక వక్ఫ్ సవరణ బిల్లును ఈ రోజు ఎన్డీయే ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టబోతోంది. ముందుగా లోక్‌సభలో ఈ బిల్లును ప్రవేశపెడుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బీజేపీ సహా కాంగ్రెస్, ఇతర పార్టీలు తమ ఎంపీలకు త్రీ లైన్ విప్ జారీ చేశాయి.
వైట్‌హౌస్ మీడియా కార్యదర్శి కరోలిన్ లీవిట్ మాట్లాడుతూ.. అమెరికా ఉత్పత్తులపై భారత్ 100 శాతం సుంకాలు విధిస్తుందన్నారు. ఇతర దేశాలు విధించే అధిక సుంకాలతో యూఎస్ ఉత్పత్తులను ఎగుమతి చేయడం అసాధ్యంగా మారిందన్నారు. అందుకే వాటిపై ప్రతీకార సుంకాలు విధించడానికి ఇదే సరైన సమయమని వెల్లడించింది.