మెటా యాజమాన్యంలోని ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్, జనవరి 2025లో 99.67 లక్షల భారతీయ ఖాతాలను నిషేధించింది. వీటిలో 13.27 లక్షల ఖాతాలను వినియోగదారు నివేదిక లేకుండానే నిషేధించారు. కంపెనీ ప్రకారం.. ప్లాట్‌ఫారమ్ భద్రతను బలోపేతం చేయడానికి, స్పామ్, స్కామ్‌లను నిరోధించడానికి ఈ చర్య తీసుకున్నారు.
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక అక్రమ వలసలపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఇక ఎలాంటి అనుమానాలు వచ్చినా.. దేశం నుంచి బహిష్కరణ వేటు వేస్తున్నారు. తాజాగా భారతీయ పరిశోధకుడు బాదర్ ఖాన్ సురిని అమెరికా బహిష్కరణ వేటు వేసింది.
తన మిస్ వరల్డ్ ప్రయాణం ప్రారంభానికి ఇండియానే వేదిక అని మిస్ వరల్డ్ క్రిస్టినా పిస్కోవా పేర్కొంది. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడింది. నమస్తే ఇండియా.. హెల్లో వరల్డ్.. అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించింది. తాను గత మిస్ వరల్డ్ పోటీల్లో ముంబాయిలోనే విజేతగా నిలిచినట్లు తెలిపింది. ఇండియా తనకు ఎప్పుడు స్పెషల్ అని చెప్పింది. ఇక్కడ ప్రజల చాలా మంచి అర్థం చేసుకునే మనస్తత్వం ఉంటుందని స్పష్టం చేసింది.
భారతదేశంలో రైళ్ల మీద దాడులు చెయ్యడం సర్వసాధారణం అయ్యింది. ముఖ్యంగా వందేభారత్ రైళ్లు ప్రారంభం అయిన తరువాత రైళ్ల మీద అల్లరిమూకలు రాళ్లు రువ్వడం చాలా ఎక్కువ అయ్యింది. వందేభారత్ రైళ్లను టార్గెట్ చేస్తున్నారని ఆరోపణలు వచ్చిన తరువాత మామూలు రైళ్ల మీద దాడులు ఎక్కువ అయ్యాయి. రైళ్లపై రాళ్లు రువ్వడం, ట్రాక్‌లను ధ్వంసం చేయడం వంటి కేసులు పెరుగుతున్నాయి. ఈ దాడులకు సంబంధించి 2023 నుంచి ఫిబ్రవరి 2025 వరకు మొత్తం 7,971 కేసులు నమోదైనట్లు…