పహల్గామ్ ఉగ్ర దాడిని అక్టోబర్ 7, 2023న ఇజ్రాయెల్‌పై హమాస్ జరిపిన మారణహోమంతో అమెరికా పెంటగాన్ మాజీ అధికారి మైఖేల్ రూబిన్ పోల్చారు. ఆనాడు ఇజ్రాయెల్ ప్రతీకారం తీర్చుకుందని.. అలాగే పాకిస్థాన్‌పై భారత్ ప్రతీకారం తీర్చుకోవాలని సూచించారు.
Indus Water Treaty: దాయాది దేశం పాకిస్తాన్ భారత్‌పైకి ఉగ్రవాదాన్ని ఉసిగొల్పుతూనే ఉంది. మంగళవారం జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్లో సాధారణ టూరిస్టులను టార్గెట్ చేసుకుని ముష్కరులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో 28 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనకు తామే పాల్పడినట్లుగా పాక్ ప్రేరేపిత లష్కరే తోయిబా ప్రాక్సీ సంస్థ ‘‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్(టీఆర్ఎఫ్)’’ ఉగ్రసంస్థ ప్రకటించింది. ఈ దాడికి సంబంధించి పాకిస్తాన్ ప్రమేయాన్ని భారత ఇంటెలిజెన్స్ సంస్థలు కనుగొన్నాయి.
Terror Attack: జమ్ము కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలోని పహల్గామ్లోని బైసరన్ లోయను చూసేందుకు వచ్చిన పర్యటకులపై ఉగ్రవాదులు కాల్పులకు తెగ బడ్డారు. ఈ ఉగ్ర దాడిలో మృతుల సంఖ్య క్రమంగా పెరిగే అవకాశం ఉంది. అయితే, ఇప్పటి వరకు సుమారు 27 మంది టూరిస్టులు మృతి చెందినట్లు సమాచారం.
Extramarital Affairs: వివాహేతర సంబంధం నేరం కాదు.. ఇది ఢిల్లీ కోర్టు ఇచ్చిన తీర్పు. గతంలో సుప్రీంకోర్టూ ఇలాంటి తీర్పే ఇచ్చింది. కానీ నైతికంగా తప్పయినా నేరం కాదని స్పష్టం చేసింది. వ్యక్తి స్వేచ్ఛకు ప్రాధాన్యం ఇస్తూ కొన్ని కేసుల్లోనే ఈ తీర్పులు ఇచ్చాయి కోర్టులు.
జపాన్‌లోని ఒసాకాలో జరుగుతున్న ప్రతిష్ఠాత్మక ‘ఒసాకా ఎక్స్పో’లో తెలంగాణ రాష్ట్రం తన ప్రత్యేకమైన పెవిలియన్‌ను ఘనంగా ప్రారంభించింది. కిటాక్యూషు నుంచి ఒసాకా చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం సోమవారం ఉదయం భారత పెవిలియన్‌లో అడుగుపెట్టింది. భారత పెవిలియన్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన తెలంగాణ జోన్‌ను సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు. ప్రతి ఐదేళ్లకు ఒకసారి ఒసాకో ఎక్స్పో నిర్వహిస్తారు. ఒసాకో ఎక్స్‌పోలో పాల్గొన్న…
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కుటుంబం నేటి నుంచి నాలుగు రోజుల పాటు భారత్‌లో పర్యటించనున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రపంచ దేశాల సుంకాలు పెంచేసిన తరుణంలో జేడీ వాన్స్ భారత్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.