కాశ్మీర్‌పై పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ కీలక వ్యాఖ్యలు చేశారు. విదేశాల్లో నివసిస్తున్న పాకిస్తానీయులను ఉద్దేశించి ప్రసంగిస్తూ అసిమ్ మునీర్ కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తారు. కాశ్మీర్ తమ జీవనాడి అని.. దానిని మరిచిపోలేమని వ్యాఖ్యానించారు.
భారతదేశంలో ప్రతి సంవత్సరం 1 లక్ష 40 వేల మంది విషపూరిత పాము కాటు కారణంగా మరణిస్తున్నారు. ఈ మరణాలలో ఎక్కువ భాగం సకాలంలో చికిత్స లేకపోవడం వల్ల సంభవిస్తున్నాయి. కానీ కెన్యాలో కనుగొన్న ఒక ఆవిష్కరణ ఇప్పుడు పాము కాటుకు చికిత్సను సులభతరం చేసింది. ఇంట్లోనే తమ శరీరంలోని పాము విషాన్ని సులభంగా తొలగించుకోవచ్చని పరిశోధకులు చెబుతున్నారు.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బీఆర్ గవాయ్ నియమితులయ్యారు. ప్రస్తుత చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా మే 13న పదవీ విరమణ చేయనున్నారు. ఆయన స్థానంలో తదుపరి చీఫ్ జస్టిస్‌గా గవాయ్ పేరును కొలీజియం ప్రాతిపాదించింది.
ఆప్ఘనిస్థాన్‌లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 5.9గా నమోదైంది. బుధవారం ఉదయం 4:43 గంటలకు హిందూకుష్ ప్రాంతంలో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ(ఎన్సీఎస్) అధికారులు తెలిపారు.
Nitin Gadkari: దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం తీవ్రస్థాయిలో ఉండటంపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. హస్తినలో మూడు రోజులుంటే చాలు వ్యాధి రావడం ఖాయమన్నారు. కాలుష్యం విషయంలో ఢిల్లీ, ముంబై రెడ్‌జోన్‌లో ఉన్నాయని పేర్కొన్నారు.
Mehul Choksi: ఆర్థిక నిందితుడు మెహుల్ చోక్సీని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. భారత్ ప్రభుత్వం అభ్యర్థన మేరకు బెల్జియంలో అతడిని అరెస్ట్ చేశారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ని మోసం చేసి వేల కోట్లు అప్పుగా తీసుకుని, ఇండియా నుంచి పరారయ్యాడు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) అభ్యర్థన మేరకు 65 ఏళ్ల వ్యక్తిని శనివారం అరెస్టు చేసి ప్రస్తుతం జైలులో ఉన్నాడని ఎకనామిక్ టైమ్స్ నివేదించింది.
Bangladesh: బంగ్లాదేశ్‌లో మహ్మద్ యూనస్ తన పట్టు నిలుపుకునేందుకు గేమ్స్ ఆడుతున్నాడు. ముఖ్యంగా, లౌకికవాదిగా, మాజీ ప్రధాని షేక్ హసీనాకు నమ్మకస్తుడిగా ఉన్న ఆర్మీ చీఫ్ జనరల్ వకార్ ఉజ్ జమాన్ని ఆ పదవి నుంచి దించేందుకు పాకిస్తాన్ ఐఎస్ఐ, అక్కడి మతోన్మాద సంస్థలు ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది.
పాకిస్థాన్‌లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 5.8గా నమోదైంది. శనివారం మధ్యాహ్నం 1 ఒంటి గంటకు వచ్చిన భూప్రకంపనలకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఆస్తి, ప్రాణ నష్టాలకు సంబంధించిన వివరాలు రాలేదు.
భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జైశంకర్ మాట్లాడుతూ.. భారతదేశం తన ప్రయోజనాలను కాపాడుకోవడానికి సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. రెండు అతి పెద్ద ప్రపంచ ఆర్థిక వ్యవస్థల మధ్య టిట్-ఫర్-టాట్ టారిఫ్ వార్ కొనసాగుతుంది.. ఇకపై ఏదీ పూర్తిగా వ్యాపారం కాదు.. ప్రతిదీ కూడా వ్యక్తిగతమైనదని అన్నారు.