పహల్గాం ఉగ్రవాద దాడికి ప్రతిస్పందనగా భారతదేశం పాకిస్థాన్‌తో వాణిజ్య సంబంధాలను నిలిపివేసింది. దీంతో పాకిస్థాన్‌లో మందుల కొరత లేకుండా చూసుకోవడానికి ప్రభుత్వం అత్యవసర చర్యలు ప్రారంభించింది. మరోవైపు.. సింధు జల ఒప్పందాన్ని నిలిపివేయాలని భారత్ తీసుకున్న నిర్ణయానికి ప్రతిస్పందనగా.. ఇస్లామాబాద్ కూడా న్యూఢిల్లీతో అన్ని వాణిజ్యాలను నిలిపివేసింది. కానీ ఔషధాల దిగుమతుల అంశంపై మాత్రం ఇంత వరకు అధికారిక ప్రకటన వెలువడ లేదు. ఎందుకంటే పాకిస్థాన్ భారత్ నుంచి వచ్చే మందులుపై ఆ
పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత సింధు నదీ జలాల ఒప్పందాన్ని భారతదేశం నిలిపివేయడం వల్ల పాకిస్థాన్ తీవ్ర కలత చెందింది. ప్రతిరోజు ఆదేశానికి చెందిన నాయకులు ఏదో ఒక ప్రకటన విడుదల చేస్తున్నారు. భారతదేశం ప్రతీకార చర్యకు పాకిస్థాన్ భయపడుతుందని అర్థమవుతోంది. తాజాగా పాకిస్థాన్ రైల్వే మంత్రి హనీఫ్ అబ్బాసి భారతదేశంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రావల్పిండిలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. భారతదేశం పాకిస్థాన్‌కు నీటిని నిలిపివేస్తే, దానికి తగిన సమాధానం ఇస్తామని అన్నాడు.
ఉగ్రవాదానికి మద్దతు ఇస్తున్న దేశాలు మూల్యం చెల్లించక తప్పదు అని హెచ్చరించారు ఏపీ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్.. విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. పహల్గామ్ ఉగ్రదాడిపై స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేవారు.. పహల్గామ్లో జరిగిన దాడి దేశంలో మత విద్వేషాలు రెచ్చగొట్టే చర్చగా పేర్కొన్నారు సత్యకుమార్.. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ తీసుకునే ఏ నిర్ణయం అయినా.. మా మద్దతు ఉంటుంది అని ఆగ్రదేశాలు ముందుకు రావడం శుభపరిణామం అన్నారు..
పహల్గామ్ ఉగ్ర దాడిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. కాశ్మీర్ సమస్య చాలా ఏళ్లుగా ఉందని.. ఆ సమస్యనే పాకిస్థాన్-భారత్ పరిష్కరించుకోవాలని సూచించారు.
Ceasefire: పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో ఇప్పటికే పాకిస్తాన్‌పై దౌత్య చర్యలు తీసుకుంటున్న భారత్ మరో సంచలన నిర్ణయానికి సిద్ధమవుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి.
Pakistan: పహల్గామ్ ఉగ్ర దాడి జరిగిన తర్వాత పాకిస్తాన్ లోలోపల భయపడుతూనే, భారత ప్రతీకారాన్ని ఎదుర్కోవడానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే ఎల్ఓసీ వద్ద పాకిస్తాన్ తన సైన్యాన్ని మోహరించింది. ఈ రోజు పాక్ ప్రధాని షెహజాబ్ షరీఫ్ నేతృత్వంలో హై లెవల మీటింగ్ జరిగింది. దీని తర్వాత, భారత్‌పై ప్రతీకార చర్యలకు పాల్పడింది. భారత విమానాలకు పాకిస్తాన్ తన గగనతలాన్ని మూసేయడంతో పాటు ద్వైపాక్షిక ఒప్పందాలను నిలిపేస్తున్నట్లు, వాణిజ్యాన్ని నిలిపేస్తున్నట్లు ప్రకటించింది.
Netanyahu: ప్రధాని నరేంద్రమోడీకి, ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ ఫోన్ చేశారు. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో ఇరువురు నేతలు చర్చించుకున్నట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి గురువారం ఎక్స్‌లో పోస్ట్ చేశారు. దాడికి పాల్పడిన టెర్రరిస్టుల్ని, వారి మద్దతుదారుల్ని న్యాయం ముందు నిలబెట్టాలనే భారతదేశ దృఢ సంకల్పానికి ఇజ్రాయిల్ మద్దతుగా నిలిచింది. జోర్డాన్ రాజు అబ్దుల్లా -2 కూడా ప్రధాని మోడీకి ఫోన్ చేసినట్లు విదేశాంగ శాఖ తెలిపింది. ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తూ, భారత దేశానికి మద్దతుగా…