ట్రంప్ విధించిన సుంకాలతో ప్రపంచ మార్కెట్లు కుదేల్ అయిపోయాయి. లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది. అన్ని దేశాల నుంచి, ఆర్థిక నిపుణుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో ట్రంప్ వెనుకడుగు వేశారు. దాదాపు 90 రోజుల పాటు సుంకాలను వాయిదా వేశారు.
ప్రధాని మోడీ మరో విదేశీ పర్యటనకు వెళ్తున్నారు. ఏప్రిల్ 22, 23 తేదీల్లో మోడీ సౌదీ అరేబియాలో పర్యటించనున్నారు. ఈ మేరకు కేంద్ర విదేశాంగ శాఖ శనివారం వెల్లడించింది. సౌదీ అరేబియా ప్రధానమంత్రి మహమ్మద్ బిన్ సల్మాన్ ఆహ్వానం మేరకు మోడీ ఆ దేశంలో పర్యటిస్తున్నట్లు పేర్కొంది.
కన్న కొడుకే ఆమె పాలిట యముడయ్యాడు. కని పెంచిన కొడుకే కేవలం రూ. 200 కోసం కన్న తల్లినే కడతేర్చాడు. ఈ ఘటన ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్లో శుక్రవారం చోటు చేసుకుంది. ఈ విషయం విన్న వారందరూ ఆ కొడుకుపై విరుచుకుపడుతున్నారు. తన వృద్ధ తల్లి ప్రాణాలను తీసిన కొడుకును చూసి అసహ్యించుకుంటున్నారు. కుక్క కొనడానికి రూ.200 ఇవ్వాలని కొడుకు కోరగా.. ఆ తల్లి నిరాకరించిందని అందుకో తన 70 ఏళ్ల తల్లిని కొట్టి చంపాడని పోలీసులు చెబుతున్నారు.
TCS: దిగ్గజ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ పై పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. ముఖ్యంగా 40 ఏళ్లకు పైబడిన దక్షిణాసియా యేతర మాజీ ఉద్యోగులు టీసీఎస్ తీరుపై పక్షపాతంగా లే ఆఫ్లు అమలు చేస్తోందని పేర్కొంటున్నారు.
Bangladesh vs India: పశ్చిమ బెంగాల్లో వక్ఫ్ సవరణ చట్టంతో నెలకొన్న హింసపై బంగ్లాదేశ్ ముఖ్య సలహాదారు ముహమ్మద్ యూనస్ స్పందించారు. ఈ సందర్భంగా గత వారం బెంగాల్ రాష్ట్రంలోని ముర్షిదాబాద్ జిల్లాలో చెలరేగిన హింసలో ముగ్గురు మరణించగా, వందలాది మంది గాయపడిన మైనారిటీ ముస్లిం వర్గాలను రక్షించాలని భారత ప్రభుత్వాన్ని కోరారు.
రెండో ప్రపంచ యుద్ధంలో నాజీ జర్మనీపై విజయానికి గుర్తుగా రష్యా ఏటా విక్టరీ డే వేడుకలు నిర్వహిస్తోంది. ఈ ఏడాది మే 9 మాస్కోలోని రెడ్ స్క్వేర్లో పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ విక్టరీ డే వేడుకలకు పలు దేశాధినేతలకు ఆహ్వానాలు పంపింది రష్యా. అందులో భాగంగా భారతదేశానికి సైతం ఆహ్వానం పంపినట్లు రష్యా తెలిపింది. అయితే భారత్ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి సమాధానం రాలేదని రష్యా అధ్యక్ష కార్యాలయం వెల్లడించింది. ఇప్పటికే…
ఇటీవల కాలంలో భారతదేశంలో ప్రపంచ దేశాలతో పోలిస్తే రోడ్డు ప్రమాదాలు అంతకంతకూ పెరుగుతన్నాయి. ఈ ప్రమాదాలు జరగడానికి అనేక కారణాలు ఉన్నాయి. అందులో పని గంటలు కూడా ఓ కారణం. ఎక్కువ సేపు డ్రైవింగ్ చేయడం వల్ల డ్రైవర్లు అలసిపోతుంటారు. నిద్రలోకి జరుకోవడం, తీవ్ర నీరసం కారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయి.