Missile Attack : ఉగ్ర స్థావరాలపై భారత్ సర్జికల్ స్ట్రైక్స్‌తో ఉలిక్కిపడిన పాకిస్తాన్, సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు తెగబడుతోంది. గురువారం తెల్లవారుజామున సుమారు 1 గంట ప్రాంతంలో పంజాబ్‌లోని అమృతసర్ సరిహద్దు జిల్లాలో భీకర శబ్దాలు, ఆకాశంలో వెలుగులు కనిపించడంతో స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. అనంతరం విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. ఉదయం జెతువాల్, మఖన్ విండి, పాంధేర్ శివారు ప్రాంతాల్లో క్షిపణి శకలాలు లభ్యమయ్యాయి. Miss World 2025 :…
Pakistan Shelling : భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సింధూర్’ అనంతరం, జమ్మూ-కశ్మీర్ రాష్ట్రంలోని నియంత్రణ రేఖ (ఎల్వోసీ) వద్ద పాకిస్తాన్ సైన్యం బుధవారం చేసిన ఘనమైన దాడులు తీవ్ర విధ్వంసాన్ని సృష్టించాయి. ఈ దాడుల్లో 15 మంది పౌరులు మరణించగా, 43 మంది గాయపడ్డారు. ధ్వంసమైన ఇళ్లు, పగిలిన దుకాణాలు, దగ్ధమైన వాహనాలు, రక్తపు మరకలు, శిథిలాలతో సరిహద్దు గ్రామాలు భయానకంగా మారిపోయాయి. ఆలయాలు, స్కూళ్లు, మసీదులపై కూడా పాకిస్తాన్ సైన్యం షెల్లింగ్ చేసి దాడి చేసింది.…
పాకిస్తాన్‌పై భారత్ దాడులు ‘ఆపరేషన్ సిందూర్’పై వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ స్పందించారు. పహల్గాం ఉగ్ర దాడి ఘటనకు భారత సైన్యం సరైన నిర్ణయం తీసుకుందని ప్రశంసించారు. భారత్‌లో రక్తపాతం సృష్టిస్తున్న ఉగ్రవాదుల, వారి శిబిరాలు, స్థావరాలపై చర్యలు అనివార్యం అని పేర్కొన్నారు. దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడం, ఉగ్రవాదుల దాడుల నుంచి తన పౌరులను రక్షించుకోడం అన్నది దేశానికి అత్యంత ముఖ్యమైన కర్తవ్యం అని ట్వీట్ చేశారు. ఆపరేషన్ సిందూర్‌పై వైఎస్ జగన్ ట్విట్టర్…
Ind-Pak Tensions To Impact IPL: పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్- పాకిస్తామ్ మధ్య యుద్ధ వాతావరణం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో భారత్ లో జరుగుతున్న ఇండియన్ ప్రిమియర్ లీగ్ పై తీవ్ర ఉత్కంఠ కొనసాగుతుంది.
ఆపరేషన్ సింధూర్ ఎఫెక్ట్ తో పాకిస్తాన్ స్టాక్ మార్కెట్‌కు బిగ్ షాక్ తగిలింది. పాక్ స్టాక్ మార్కెట్ ఇండెక్స్ కరాచీ-100 బుధవారం తెల్లవారుజామున ప్రారంభ ట్రేడింగ్‌లో 6,272 పాయింట్లు ( 6 శాతం) మేర నష్టపోయింది. అయితే, మంగళవారం ముగింపు స్థాయి 113,568.51 నుంచి 107,296.64 కనిష్ట స్థాయికి పడిపోయింది.
భారత్- పాక్ సరిహద్దులో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఆపరేషన్ సింధూర్ పేరిట ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్లో లోని ఉగ్ర శిబిరాలపై దళాల దాడులు చేసింది. పీఓకేలో ఉగ్రస్థావరాలపై భారత సైన్యం మెరుపు దాడులు చేసి మొత్తం 9 పాక్ ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసింది భారత ఆర్మీ. పాకిస్తాన్‌పై భారత ఆర్మీ చేపట్టిన చర్యల పట్ల సర్వత్రా అభినందనలు వెళ్లువెత్తుతున్నాయి. సోషల్ మీడియాలో ఇండియాన్ ఆర్మీకి అభినందలు తెలుపుతూ పోస్ట్ లు చేస్తున్నారు నెటిజన్స్. అలాగే పలువురు…
China Terms India's Strikes: పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే) ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని భారతదేశానికి చెందిన సైన్యం జరిపిన దాడులపై చైనా ఆందోళన వ్యక్తం చేసింది. దాయాది దేశంపై ఇండియా దాడి చేయడం విచారకరం అని అభివర్ణించారు.