అనుభవమయితే గానీ తత్వం బోధపడదంటారు పెద్దలు. ఇప్పుడు అచ్చం పాకిస్థాన్ పరిస్థితి అలానే అయింది. భారత్‌పై అనవసరంగా కాలుదువ్విన దాయాది దేశానికి తత్వం బోధపడినట్లుంది. దీంతో పాక్ కాళ్ల బేరానికి వచ్చింది. సింధు జలాలను భారత్ నిలిపివేయడంతో దాయాది దేశం విలవిలలాడుతోంది. దీంతో ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో సింధు జలాల నిర్ణయాన్ని పున:సమీక్షించాలంటూ భారత ప్రభుత్వానికి పాకిస్థాన్ లేఖ రాసింది. సింధు జలాల నిలిపివేతతో పాకిస్థాన్‌లో తీవ్ర దుర్భిక్షం ఏర్పడినట్లు పాక్ జలవనరుల శాఖ లేఖలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో చర్చించేందుకు పాక్ అధికారులు సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది.
ఇది కూడా చదవండి: Mukesh Ambani-Trump: ఖతార్‌లో భేటీకానున్న ట్రంప్-ముఖేష్ అంబానీ
అయితే ఇటీవల ప్రధాని మోడీ మాట్లాడుతూ.. ఇకపై పాక్‌తో చర్చలంటూ ఉంటే కేవలం ఉగ్రవాదం, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌పైనేనని పేర్కొన్నారు. రక్తం, నీరు రెండూ కలిసి ప్రవహించలేవంటూ తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలో పాక్ రాసిన లేఖపై భారత ప్రభుత్వం ఎలా స్పందిస్తుందన్న ఉత్కంఠ నెలకొంది.
ఇది కూడా చదవండి: Rakul Preet : ఉక్కపోత పెంచేస్తున్న రకుల్ ప్రీత్ సింగ్..
ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్ర దాడి జరిగిన తర్వాత భారత ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంది. సింధు జలాలు నిలిపివేసింది. అలాగే వీసాలను రద్దు చేసింది. అటారీ సరిహద్దు మూసేసింది. ఇలా ఒక్కొక్కటిగా కఠిన నిర్ణయాలు తీసుకుంది. అనంతరం పాక్‌పై ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. దీంతో పాకిస్థాన్ భారీగా నష్టపోయింది.