24 Airports Closed: భారత్- పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో పౌర విమానయాన మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. సరిహద్దు రాష్ట్రాల్లోని 24 విమానాశ్రయాలను మూసివేస్తున్నట్లు ప్రకటించింది. మే 15వ తేదీ వరకు ఇది అమలులో ఉంటుందని పేర్కొనింది.
India-Pakistan Tensions: భారత్- పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమైయ్యాయి. ఈ పరిణామాల వేళా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇవాళ (మే 9న) సాయంత్రం త్రివిధ దళాధిపతులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు.
Vikram Misri: గత రాత్రి భారత నగరాలపై, పౌరులపై పాకిస్తాన్ ఉద్దేశపూర్వక దాడులు జరిపింది అని భారత విదేశీ వ్యవహరాల శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ తెలిపారు. భారత్ ఉద్రిక్తతను పెంచకుండా, బాధ్యతాయుతంగా ఈ దాడులకు తగిన సమాధానం ఇచ్చిందని పేర్కొన్నారు.
Pakistan: భారతదేశం చేతిలో ఎన్ని సార్లు భంగపాటుకు గురైనా నాదే పైచేయి అంటుంది పాకిస్తాన్. అబద్ధాలను అవలీలగా ప్రచారం చేస్తుంది. చివరకు పాకిస్తాన్ ప్రభుత్వంలో అగ్ర నేతలుగా చలామణీ అవుతున్న వారు కూడా అబద్ధాలను ప్రచారంలో చేయడంలో పోటీ పడుతున్నారు. తమ పౌరుల్ని అబద్ధాలతో నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. ఆపరేషన్ సిందూర్ నుంచి పాకిస్తాన్‌ని భారత్ త్రివిధ దళాలు చితకబాదుతున్నా కూడా బుద్ధి రావడం లేదు.
Operation Sindoor : పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ vs పాక్ ఉద్రిక్తతలు పెరిగిన వేళ, ఆకాశంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. పాకిస్తాన్‌కు చెందిన అత్యంత కీలక ఎయిర్ వార్నింగ్ వ్యవస్థ అయిన AWACS విమానం భారత వైమానిక దళం చర్యతో కూలిపోయింది. ఇది కేవలం ఓ విమానం నష్టం కాదు, దాయాది దేశానికి వ్యూహాత్మకంగా చెమటలు పట్టించే పరిణామం. భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’లో భాగంగా, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని తొమ్మిది ఉగ్ర స్థావరాలపై…
JD Vance : అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ పాక్-భారత్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలపై కీలక వ్యాఖ్యలు చేశారు. వంశవ్యవస్థ, జాతీయ భద్రత వంటి కీలక అంశాలపై స్పష్టమైన వైఖరి ఉన్న జేడీ వాన్స్ ఈ వివాదంలో అమెరికా పాత్రపై తన అభిప్రాయాన్ని బయటపెట్టారు. ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, భారత్, పాకిస్థాన్‌ల మధ్య కొనసాగుతున్న సరిహద్దు ఉద్రిక్తతల విషయంలో తమ దేశం ఎలాంటి జోక్యం చేసుకోదని స్పష్టం చేశారు. Operation Sindoor 2:…
Samba : భారత-పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుండగా, గురువారం రాత్రి సాంబా సెక్టార్లో అంతర్జాతీయ సరిహద్దు గుండా చొరబాటుకు తెగబడిన ఉగ్రవాదులకు భారత జవాన్లు నరకం చూపించారు. అప్రమత్తమైన సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) జవాన్లు జైషే మహమ్మద్‌కు చెందిన 10 నుంచి 12 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టారు. హతమైన ఉగ్రవాదుల సంఖ్యపై అధికారులు ఇంకా స్పష్టమైన ప్రకటన చేయనప్పటికీ, విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఇది కేవలం చొరబాటు ప్రయత్నం మాత్రమే కాదు, పాకిస్తాన్…
మరో మహా భారతం ! ఒకటా ? రెండా ? వరుస అవమానాలు .. అన్యాయాలు .. ఇంటికి నిప్పు పెట్టారు .. నిండు సభలో ఘోరంగా అవమానించారు .. రాజ్యం లాగేసుకున్నారు ..అడవుల పాలు చేసారు .. అయినా పాండవులు కయ్యానికి కాలు దువ్వలేదు . రాయబారాలు పంపారు .. “యుద్ధం వద్దు .. కనీసం అయిదు ఊళ్ళు ఇవ్వు “అన్నారు . పోగాలము దాపురించిన వాడు మంచి వారి మాటలు వినడు . చివరకు…
భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో కీలక ప్రకటన చేశారు. దాడులు తక్షణమే తగ్గించాలని ఇరు దేశాలకు పిలుపునిచ్చారు. భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జైశంకర్, పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌తో ఆయన ఫోన్లో మాట్లాడారు. ఇరుదేశాల మధ్య చర్చలకు యూఎస్ మద్దతు ఉంటుందని వెల్లడించారు. అవసరమైతే భారత్, పాకిస్థాన్ మధ్య చర్చలకు మధ్యవర్తిత్వం వహిస్తానని ప్రతిపాదించారు. హహల్గాం ఉగ్రదాడిని ఖండించిన రూబియో ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లో…