Pahalgam Terror Attack: పహల్గాం ఉగ్రదాడి మృతుడి భార్యను సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. ఈ ఘటనపై జాతీయ మహిళా కమిషన్ తీవ్రంగా మండిపడింది. ఆమె సైద్ధాంతిక వ్యక్తీకరణను తప్పుపడుతూ ట్రోల్ చేయడం మంచిది కాదని తెలిపింది.
బైసారన్ లోయలో ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో ఒక నేపాలీ జాతీయుడితో సహా ఇరవై ఆరు మంది మరణించగా, అనేక మంది గాయపడ్డారు. ఈ ఘటనకు పాల్పడిన టెర్రరిస్టులను పట్టుకునేందుకు భారత భద్రతా దళాలు గాలింపు చర్యలు ప్రారంభించాయి. ఈ ఘోరమైన కాల్పులకు పాల్పిన ఉగ్రవాదులు పాకిస్తాన్లో ఉన్నత సైనిక శిక్షణ పొందారని నిఘా వర్గాలు తెలిపాయి.
Pakistan: జమ్ము కాశ్మీర్ లోని పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్-పాకిస్తాన్ మధ్య టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ దాడిపై ప్రతీకారం తీర్చుకుంటామని ఇప్పటికే ఇండియా ప్రకటించింది. ఈ క్రమంలో దాయాది దేశం కవ్వింపు చర్యలకు దిగుతుంది.
భారత్- పాక్ దేశాల మధ్య సమస్యను పరిష్కరించడానికి రంగంలోకి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి నేడు కీలక సమావేశం ఏర్పాటు చేయబోతుంది. ఈ మీటింగ్ లో ఇరు దేశాలకు చెందిన ప్రతినిధులు పాల్గొన తమ వాదనలు తెలియజేయనున్నారు.
India Pakistan War: భారత్ ను రెచ్చగొట్టేలా రష్యాలోని పాకిస్తాన్ దౌత్యవేత్త మహ్మద్ ఖలీద్ జమాలీ వ్యాఖ్యలు చేశాడు. పాక్ భూభాగంపై భారతదేశం సైనిక దాడులకు ప్రణాళికలు వేస్తున్నట్లు ఇస్లామాబాద్కు విశ్వసనీయ నిఘా సమాచారం ఉందని అన్నారు.
India Pak War: పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పాక్ నేతలు భారత్ ఏ చర్య తీసుకున్నా, తమ ఆర్మీ ధీటైన జవాబు ఇస్తుందని బీరాలు పలుకుతున్నారు. తమ వద్ద అణ్వాస్త్రాలు ఉన్నాయని భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అయితే, బలహీనతల్ని కప్పిపుచ్చుకునేందుకు పాకిస్తాన్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తోంది. నిజానికి భారత సైన్యం ముందు నిలబడే దమ్ము లేదని విషయాలు ప్రస్తుతం వెలుగులోకి వస్తున్నాయి.
Congress vs BJP: కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గోగోయ్ పై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా ఎక్స్ (ట్విట్టర్ ) వేదికగా చేసిన పోస్టులో.. ఎంపీ గోగోయ్ పాకిస్తాన్, నేపాల్ దేశాల్లో పర్యటనలకు సంబంధించిన "స్పష్టమైన ఆధారాలు" తన దగ్గర ఉన్నాయని పేర్కొన్నారు.