అమూల్ వినియోగదారులకు చేదు వార్త వినిపించింది… అమూల్‌కు చెందిన అన్ని రకాల పాల బ్రాండ్లపై లీటర్‌కు రూ.2 చెప్పున పెంచేసింది… పెరిగిన ధరలు రేపటి నుంచి అంటే జులై 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి.. అన్ని బ్రాండ్లపై పాలపై లీటర్‌కు రూ. 2 చొప్పున పెంచినట్టు గుజరాత్ సహకార మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ (జీసీఎంఎంఎఫ్) అధికారి ప్రకటించారు.. అయితే, ఉత్పత్తి వ్యయం పెరడమే ధరల పెరుగుదలకు కారణమని.. ఏడాదిన్నర తర్వాత పాల ధరలను పెంచాల్సి వచ్చిందని…
జులై 23, 2021 నుంచి ఆగష్టు 8 వరకు జపాన్ టోక్యో నగరంలో జరిగే ఒలింపిక్స్‌కు ఏపీ నుంచి భారతదేశం తరపున పాల్గొంటున్న పి.వి సింధు, ఆర్. సాత్విక్ సాయిరాజ్, రజనీలకు విషెస్ చెప్పారు సీఎం వైఎస్ జగన్. ఒక్కొక్కరికీ రూ.5 లక్షల చెక్ అందజేసిన సీఎం వైఎస్ జగన్… విశాఖలో బ్యాడ్మింటన్ అకాడమీ ఏర్పాటుచేసేందుకు ప్రభుత్వం కేటాయించిన రెండు ఎకరాల భూమికి సంబంధించిన జీవోను పి.వి. సింధుకి అందజేశారు. రజనీ (ఉమెన్స్ హకీ) చిత్తూరు జిల్లా,…
దేశంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. నిన్నటి కరోనా బులిటెన్ ప్రకారం దేశంలో 40వేల దిగువకు కరోనా కేసులు చేరగా, ఈరోజు రిలీజ్ చేసిన బులిటెన్ ప్రకారం కేసులు పెరిగాయి. ఇండియాలో కొత్తగా 45,951 కేసులు నమోదయ్యాయి. దేశంలో ఇప్పటివరకు మొత్తం 3,03,62,848 కేసులు నమోదయ్యాయి. ఇందులో 2,94,27,330 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 5,37,064 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 817 మంది మృతి చెందారు. దీంతో దేశంలో…
ఆర్చరీ దీపికా కుమారి ప్యారిస్ లో జరుగుతున్న ఆర్చరీ వరల్డ్ కప్ స్టేజ్ 3లో గోల్డ్ మెడల్ సాధించింది. హ్యాట్రిక్ గోల్డ్ మెడల్స్ అందుకున్న దీపికా కుమారిని క్రీడారంగానికి చెందిన పలువురు ప్రముఖులు అభినందించారు. సచిన్ టెండూల్కర్… దీపికను ట్విట్టర్ ద్వారా అభినందిస్తూ, టోక్యోలో జరిగే ఒలింపిక్స్ లోనూ విజయం సాధించాలంటూ శుభాకాంక్షలు అందించారు. సచిన్ తో పాటు దినేశ్ కార్తిక్, శిఖర్ ధావన్, మనోజ్ తివారి తదితరులు సైతం ఆర్చరీ వరల్డ్ ర్యాంకింగ్ లో అగ్రస్థానంలో…
ప్రస్తుతం దేశంలో పెట్రో ధరలు పెరుగుదల సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో సెంచరీ కూడా దాటేశాయి. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ పై 23 పైసలు, లీటర్ డీజిల్ పై 30 పైసలు పెరిగింది. ఈ పెరుగుదలతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 98.81 చేరగా.. లీటర్ డీజిల్ ధర రూ. 89.18 కు చేరింది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో సెంచరీకి చేరింది. లీటర్ పెట్రోల్ ధర రూ. 104.90 చేరగా..…
సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ మరోసారి బరితెగించింది… రెచ్చగొట్టే చర్యలకు దిగింది. కేంద్రపాలిత ప్రాంతమైన లడాఖ్‌ను వేరే దేశంగా తన వెబ్సైట్లో చూపించింది.. ఇక, జమ్మూ కశ్మీర్‌ను పాకిస్థాన్‌లో అంతర్భాగంగా చూపించింది.. ట్విట్టర్ చర్యలపై సీరియస్‌గా ఉంది భారత ప్రభుత్వం… ట్విట్టర్ గతంలోనూ ఇలాంటి తప్పులే చేసింది.. గత ఏడాది లడాఖ్‌ను చైనాలో అంతర్భాగమని చూపించింది.. దీనిపై అప్పట్లో విమర్శలు వెల్లువెత్తగా.. కేంద్రం వివరణ కోరడంతో క్షమాపణలు చెప్పింది.. సరిగ్గా ఏడాది కాకముందే.. మరోసారి అలాంటి తప్పే…
తెలుగు తేజం, బ్యాడ్మింటన్ సూపర్ స్టార్ పీవీ సింధుకి అరుదైన గౌరవం దక్కనుంది. వచ్చేనెలలో ప్రారంభమయ్యే టోక్యో ఒలింపిక్స్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో భారత జాతీయ పతాకాన్ని చేత పట్టుకుని భారత బృందాన్ని నడిపించే అవకాశం లభించనుంది. ఈ సారి బిన్నంగా పతాకాదారులుగా ఇద్దరిని ఎంపిక చేయనున్నారు. ఇద్దరు పతాకదారుల్లో సింధు ఒకరు అని భారత ఒలింపిక్ సంఘం వర్గాలు తెలిపాయి. దీనిపై ఈ నెలాఖారులోగా అధికారిక ప్రకటన వెలువడే అవకాశంఉంది.
త్వరలోనే కేంద్ర కేబినెట్లో మార్పులు, చేర్పులు జరగబోతున్నాయా అంటే అవుననే అంటున్నారు నిపుణులు. వచ్చే ఏడాది అనేక రాష్ట్రాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. దీంతో ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు ప్రధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో కేంద్రం కేబినెట్‌ను విస్తరించబోతున్నది. కొత్తగా 27 మందికి చోటు లభించే అవకాశం ఉన్నట్టు సమాచారం. వచ్చే ఏడాది యూపీ ఎన్నికలు జరగబోతున్న తరుణంలో ఈ కేబినెట్లో ఆరాష్ట్రానికి ఎక్కువ ప్రధాన్యత ఇస్తారనే ప్రచారం జరుగుతున్నది. Read: సోదరులతో సల్మాన్ డ్యాన్స్… రేర్ వీడియో…
ఇండియాలో వ్యాక్సినేషన్‌ను వేగంగా అమలు చేస్తున్నారు. జూన్ 21 వ తేదీ నుంచి దేశంలో 18 ఏళ్లు నిండిన వారికి ఉచిత వ్యాక్సిన్‌ను అందిస్తున్నారు. రోజుకు లక్షల సంఖ్యలో వ్యాక్సిన్‌ను అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది జనవరి 16 నుంచి వ్యాక్సినేషన్‌ను ప్రారంభించారు. మొదట్లో మందకోడిగా సాగిన వ్యాక్సినేషన్ ప్రక్రియ కొన్ని రోజులుగా వేగంగా అమలు చేస్తున్నారు. Read: ఎన్టీఆర్ ఫిల్మ్స్ బ్యానర్ లో పి. వి. నరసింహరావు బయోపిక్! అయితే, వ్యాక్సినేషన్ విషయంలో ఇండియా…