లార్డ్స్ టెస్టులో చేతులెత్తేసిన భారత్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో…భారత్ బ్యాట్స్‌మెన్లు పోరాడుతున్నారు. నాలుగో రోజు ఆట నిలిచిపోయేసరికి 6 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. వెలుతురు లేమి కారణంగా అంపైర్లు ఆటను ముందుగానే నిలిపివేశారు. రిషభ్ పంత్ 14 పరుగులు, ఇషాంత్ శర్మ 4 పరుగులతో క్రీజులో ఉన్నారు. చివరి రోజు రిషబ్ పంత్ ధాటిగా ఆడి పరుగులు సాధిస్తే….భారత్ ఓటమి నుంచి గట్టెక్కే అవకాశాలు ఉన్నాయ్. పంత్‌కు…టెయిలెండర్లు ఎలా సహకారం అందిస్తారన్న దానిపై ఇప్పుడు ఉత్కంఠగా మారింది. సిడ్నీ టెస్టులో మాదిరిగా రాణిస్తే…ఈ టెస్టు మ్యాచ్ కూడా డ్రా అయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రత్యర్థికి 250 పరుగుల టార్గెట్ కూడా విధించకపోతే…మనకు కష్టాలే. ఇంగ్లీష్ జట్టుపై వీలైనన్ని ఎక్కువ పరుగులు చేస్తే…భారత్ ఓటమి తప్పినట్లే.
Also Read
- Shreyas Iyer: అప్పుడు చాలా బాధేసింది.. ఏం చేయాలో అర్థం కాలేదు.. ఇప్పుడు ఫుల్ హ్యాపీ!
- ENG vs SL: హడలెత్తించిన 'హ్యారీ బ్రూక్' సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ రికార్డు విజయం.!
- Ind vs Afg T20 : ఆఫ్ఘన్‌పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
- Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
అంతకుముందు అజింక్య రహానె చతేశ్వర్ పుజారా…నాలుగో వికెట్‌కు శతక భాగస్వామ్యం నెలకొల్పారు. 55 పరుగులకే ముగ్గురు టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ విఫలమవడంతో రహానె, పుజారా కీలక ఇన్నింగ్స్ ఆడారు. ఇంగ్లాండ్ బౌలర్లపై ఆధిపత్యం చెలాయించారు. ఈ క్రమంలోనే ఇద్దరూ వంద పరుగుల భాగస్వామ్యం నమోదుచేశారు.ఇద్దరు క్రీజులో కుదురుకున్నారని అనుకునే లోపే…పూజారా ఊహించని బంతికి పెవిలియన్ చేరాడు. కాసేపటికే అర్ధ శతకంతో కొనసాగుతున్న రహానె కూడా ఔటయ్యాడు. మోయిన్ అలీ బౌలింగ్‌లో కీపర్ చేతికి చిక్కాడు. ఇక ఎన్నో ఆశలు పెట్టుకున్న రవీంద్ర జడేజా నిరాశపరిచాడు. మోయిన్ అలీ బౌల్డ్ చేయడంతో భారత్ ఆరో వికెట్ కోల్పోయింది. అలా స్వల్ప వ్యవధిలో మూడు వికెట్లు కోల్పోయి మ్యాచ్‌పై పట్టు కోల్పోయింది. తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన పంత్, ఇషాంత్ మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు. 82 ఓవర్ల తర్వాత వెలుతురు లేమి కారణంగా…అంపైర్లు ఆటను నిలిపివేశారు. అంతకుముందు రాహుల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ తక్కువ స్కోరుకు పెవిలియన్ చేరారు. ఇంగ్లాండ్ బౌలర్లలో మార్క్‌వుడ్ మూడు, మోయిన్ అలీ రెండు వికెట్లు తీశారు.
- Tags
- england
- india
- lords
- Test series
తాజావార్తలు
-
Shreyas Iyer: అప్పుడు చాలా బాధేసింది.. ఏం చేయాలో అర్థం కాలేదు.. ఇప్పుడు ఫుల్ హ్యాపీ!
-
ENG vs SL: హడలెత్తించిన ‘హ్యారీ బ్రూక్’ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ రికార్డు విజయం.!
-
CM Chandrababu: ఆరు నెలల్లో 5.52 లక్షల ఇళ్లను పూర్తి చేయాలి.. సీఎం కీలక ఆదేశాలు
-
బడ్జెట్ సెగ్మెంట్లో 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Samsung Galaxy A08 లాంచ్..!
-
Suriya – Jyotika: 20 ఏళ్ల తర్వాత మళ్లీ పెళ్లి.. పిల్లల ముందే సూర్య, జ్యోతిక ప్రమాణాలు, వీడియో వైరల్!
ట్రెండింగ్
-
రూ.1,659కే itel Muzik 450L ఫోన్.. థియేటర్ లాంటి సౌండ్, 2,500mAh బ్యాటరీ.!
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్‌ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?