దేశవ్యాప్తంగా 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఎర్రకోటపై ప్రధాని నరేంద్రమోదీ జాతీయ జెండాను ఎగురవేశారు. ఎర్రకోట వద్ద ప్రధాని మోదీకి రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, ఉన్నతాధికారులు ఘనస్వాగతం పలికారు. త్రివిధ దళాల నుంచి ప్రధాని మోదీ గౌరవ వందనం స్వీకరించారు. అంతకుముందు రాజ్‌ఘాట్‌లో జాతిపిత మహాత్మాగాంధీ సమాధి వద్ద ప్రధాని నివాళులర్పించారు.
దేశవ్యాప్తంగా 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఎర్రకోటపై ప్రధాని నరేంద్రమోదీ జాతీయ జెండాను ఎగురవేశారు. ఎర్రకోట వద్ద ప్రధాని మోదీకి రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, ఉన్నతాధికారులు ఘనస్వాగతం పలికారు. త్రివిధ దళాల నుంచి ప్రధాని మోదీ గౌరవ వందనం స్వీకరించారు. అంతకుముందు రాజ్‌ఘాట్‌లో జాతిపిత మహాత్మాగాంధీ సమాధి వద్ద ప్రధాని నివాళులర్పించారు. అనంతరం ప్రధాని మోడీ మాట్లాడుతూ.. దేశ వ్యాప్తంగా అన్ని సైనిక్ స్కూళ్లలో ఇకనుంచి అమ్మాయిలకు సైతం ప్రవేశం కల్పించనున్నట్లు.. ఎర్రకోట వేదికగా ప్రకటన చేశారు. అలాగే త్వరలోనే జమ్మూ కశ్మీర్ లో ఎన్నికలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు.