ఇండియాలో కరోనా కేసులు నిన్నటి కంటే కాస్త పెరిగాయి. తాజాగా కేంద్రం కరోనా బులిటెన్‌ను రిలీజ్ చేసింది. ఈ బులిటెన్ ప్రకారం దేశంలో కొత్తగా 45,892 కేసులు నమోదయ్యాయి. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,07,09,557 కి చేరింది. read also : కరోనా మరో కొత్త రూపం.. 30 దేశాల్లో గుర్తింపు ఇందులో 2,98,43,825 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. 4,60,704 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. గడిచిన 24…
ఇప్పటి వరకు సహాయ మంత్రిగా పనిచేసిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి ప్రమోషన్ వచ్చింది.. ప్రధాని నరేంద్ర మోడీ కేబినెట్లో చోటు దక్కింది.. ఇవాళ రాష్ట్రపతి భవన్లో జరిగిన ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమంలో కేబినెట్ మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు కిషన్‌రెడ్డి.. కాగా, సికింద్రాబాద్ నుంచి తొలిసారి లోక్‌సభకు ఎన్నికైన కిషన్ రెడ్డిని.. కేంద్ర కేబినెట్లోకి తీసుకున్నారు ప్రధాని నరేంద్ర మోడీ.. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాకు సహాయకుడిగా సహాయ మంత్రిత్వశాఖను కిషన్ రెడ్డికి అప్పగించారు. విధి నిర్వహణలో కీలకంగా వ్యవహరించి ఇద్దరి…
ఇండియాలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం తాజాగా కరోనా బులిటెన్‌ను విడుదల చేసింది. ఈ బులిటెన్ ప్రకారం, గడిచిన 24 గంటల్లో ఇండియాలో 43,733 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,06,63,665 కి చేరింది. read also : మరికాసేపట్లో తెలంగాణ పీసీసీగా రేవంత్ బాధ్యతల స్వీకరణ.. ఇందులో 2,97,99,534 మంది కోలుకొని డిశ్చార్జ్‌కాగా, 4,59,920 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. ఇక,…
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జే.పి. నడ్డా తో సహా, సీనియర్ మంత్రులతో ఈ రోజు సాయంత్రం 5 గంటలకు ప్రధాని మోడీ సమావేశం కానున్నారు. జూన్ 20 వ తేదీన అన్ని గత రెండేళ్ళు గా పలు మంత్రిత్వ శాఖల పనితీరుపై సమీక్ష జరిపిన ప్రధాని మోడీ… పలు మంత్రిత్వ శాఖ ల పనితీరు, భవిష్యత్తు లో చేపట్టాల్సిన పథకాల కు సంబంధించిన ప్రతిపాదనల పై సమాలోచనలు చేస్తున్నారు. హోమ్ మంత్రి అమిత్ షా, రక్షణ శాఖ…
మన దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం తాజాగా కరోనా బులిటెన్‌ను విడుదల చేసింది. ఈ బులిటెన్ ప్రకారం, గడిచిన 24 గంటల్లో ఇండియాలో 34,703 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,06,19,932 కి చేరింది. ఇందులో 2,97,52,294 మంది కోలుకొని డిశ్చార్జ్‌కాగా, 4,64,357 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. ఇక, గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 553 మంది మృతి…
ఇండియాలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. మార్చి, ఏప్రిల్ నెలల్లో భారీ సంఖ్యలో కేసులు నమోదవ్వగా, మే చివరి వారం నుంచి పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తున్నది. తాజాగా, కేంద్రం కరోనా బులిటెన్‌ను రిలీజ్ చేసింది. దీని ప్రకారం, ఇండియాలో కొత్తగా 39,796 కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 3,05,85,229 కి చేరింది. ఇందులో 2,97,00,430 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 4,82,071యాక్టీవ్ కేసులు ఉన్నాయి. ఇక…
చైనా ప్రతి దేశంలో కయ్యానికి కాలు దువ్వుతున్న సంగతి తెలిసిందే. కరోనా మహమ్మారి అపవాదును తొలగించుకునేందుకు, ఆ విషయాలను పక్కదోవ పట్టించేందుకు చైనా ఈ విధంగా ప్రవర్తిస్తున్నట్టు నిపుణులు చెబుతున్నారు. సరిహద్దుల్లో ఉన్నదేశాలతో నిత్యం పేచీ పెట్టుకుంటున్న డ్రాగన్, తైవాన్ విషయంలో చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీంగా టెన్షన్ పెడుతున్నాయి. ఇప్పటికే హాంకాంగ్ ను తన గుప్పిట్లో పెట్టుకున్న చైనా, తైవాన్ దేశాన్ని కూడా తన ఆదీనంలోకి తీసుకుంటానని అంటోంది. టిబెట్ విషయంలో కూడా ఇదే దూకుడును ప్రదర్శించి…
ప్రచ్చన్న యుద్ధం తరువాత రష్యా ప్రభావం తగ్గిపోవడంతో చైనా బలం పుంజుకుంది. ఆర్ధికంగా, రక్షణ పరంగా బలం పెంచుకుంది. ఒకప్పుడు ఆయుధాలపై ఇతర దేశాలపై ఆధారపడిన డ్రాగన్ ఇప్పుడు ఇతర దేశాలకు ఆయుధాలు సరఫరా చేసే స్థాయికి ఎదిగింది. గత కొంతకాలంగా చైనా అనుసరిస్తున్న విధానం, దూకుడు, సరిహద్దు దేశాలతో వివాదాలు కలిగి ఉండతటం, కరోనా మహమ్మారికి చైనానే కారణమని అగ్రదేశం అమెరికాతో సహా వివిధ దేశాలు ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ఆ ప్రభావం చైనా రక్షణ…
కరోనా దెబ్బతో ఏదైనా పనిచేసుకుందామన్న దొరకని పరిస్థితి.. వ్యవసాయం చేస్తే పెట్టిన పెట్టుబడి కూడా చేతికిరాని దుస్థితి.. ఖాళీగా ఉండలేక వ్యవసాయం చేద్దామంటే ఎద్దులు లేకపోవడం ఓవైపు అయితే.. మరోవైపు ట్రాక్టర్‌ను పెట్టి దున్నించడానికి డబ్బు కూడా లేదు.. ఈ సమయంలో.. ఆ రైతు మెదడుకు వినూత్నమైన ఆలోచన తట్టింది.. తన పాత సైకిల్‌తోనే వ్యవసాయం చేయడం మొదలుపెట్టాడు.. ఔరా..! అనిపించే ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలోని తిరుత్తణిలో జరిగింది.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కరోనా దెబ్బకు…
భారత్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా కిందికి దిగివస్తోంది.. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 43,071 మంది కోవిడ్‌బారిన పడ్డారు.. మరో 955 మంది కోవిడ్ బాధితులు మృతిచెందారు.. ఇదే సమయంలో 52,299 మంది కోవిడ్ నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు కేంద్రం పేర్కొంది… దీంతో.. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా నమోదైన కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 3,05,45,433కు చేరుకోగా… మొత్తం రికవరీ కేసులు 2,96,58,078కి పెరిగాయి……