గోల్డ్ మెడల్ అందుకే గెలవలేకపోయా.. ఫైనల్‌లో ఓటమిపై భవీనా పటేల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పారాలింపిక్స్ టేబుల్ టెన్నిస్‌లో కొత్త రికార్డు నెలకొల్పారు భారత్ అథ్లెట్ భవీనా పటేల్.. తొలిసారి పారాలింపిక్స్‌లో టేబుల్ టెన్నిస్ ఈవెంట్‌లో భారత్ ఒక్క పతకం సాధించకపోగా.. అనూహ్యంగా ఫైనల్‌లో అడుగుపెట్టిన భవీనా.. ఫైనల్‌లో ఓడినా.. ఇండియాకు తొలి పతకాన్ని అందించి చరిత్ర సృష్టించారు.. ఇక, భవీనా పటేల్‌కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.. భవీనా చరిత్ర లిఖించింది.. ఆమె జీవితం ఎంతో మందికి స్ఫూర్తిదాయకం అంటూ ప్రధాని నరేంద్ర మోడీ అభినందలు తెలపగా.. పారాలింపిక్స్‌లో భవీనాబెన్ సాధించిన విజయం దేశానికి గర్వకారణం అని.. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. మరోవైపు.. గోల్డ్ మెడల్ చేజారడంపై స్పందించారు భవీనా..
రజతం సాధించిన తర్వాత మీడియాతో మాట్లాడిన భవీనా పటేల్.. ఇవాళ నేను కాస్త నెర్వస్‌గా ఫీలయ్యాను.. అందుకే 100 శాతం ప్రదర్శన ఇవ్వలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు.. అయితే, తర్వాతి టోర్నీలో దీనిని సరిదిద్దుకుంటానని వెల్లడించారు.. ఓ అథ్లెట్ తన 100 శాతం ప్రదర్శన ఇచ్చారంటే ఇక వాళ్లు ఓడిపోయినట్లు కాదు అని నేను ఎప్పుడూ నమ్ముతాను అని తెలిపారు. ఓ తలుపు మూసుకుంటే మరో తలుపు తన కోసం తెరుచుకూనే ఉంటుందనే విషయాన్ని తాను నమ్ముతానని.. సమస్యలను సానుకూలంగా చూడటం వల్ల కఠోరంగా శ్రమించే ధైర్యాన్ని తనకు ఇస్తుందని.. భారత్‌కు తిరిగి రాగానే ఏషియన్ గేమ్స్, కామన్వెల్త్ గేమ్స్ కోసం సిద్ధమవుతానని తెలిపారు భనీనా పటేల్.
Also Read
తాజావార్తలు
-
Supreme Court: సీజేపీ నిరసన ఎఫెక్ట్.. పోలీసులకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..
-
Chiranjeevi: వయసు ఒక నంబర్ మాత్రమే..! ప్రేమ, అభిమానమే నాకు ఎనర్జీ..
-
Redmi K200 Series: Redmi K200 సిరీస్‌లో 7 ఇంచుల 2K డిస్‌ప్లే?.. హై రిఫ్రెష్ రేట్‌తో రానున్న కొత్త ఫ్లాగ్షిప్ ఫోన్లు!
-
Rashmika Mandanna : మరోసారి పుష్పరాజ్ అండ్ శ్రీవల్లి కాంబో ఆకట్టుకోబోతుందా..?
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
ట్రెండింగ్
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!